ఇది నైపుణ్య శిక్షణా? నిర్బంధమా? లొంగిపోయిన మావోయిస్టుల పేరుతో హింస
ఫోటోలో హోంమంత్రి అమిత్ షా మెరిసిపోతుంటే, ఆయనకు కొన్ని వరుసల వెనుక విషాద వదనంతో ప్రసన్న నిలబడి ఉన్నాడు. జూన్ 23న షా తన X హ్యాండిల్‌లో ఈ గ్రూప్ ఫోటోను పోస్ట్ చేసాడు. “నక్సలైట్లు ఎవరి చేతుల్లో తుపాకులు పెట్టారో, ఆ పిల్లలు తమ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు.” అని కింద రాసి ఉన్నది. కానీ ప్రసన్న చిన్నపిల్లవాడు కాదు. అతను యాభై ఏళ్ల వయసున్న ఆదివాసి. బీజాపూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందినవాడు - అతని భద్రత కోసం అసలు పేరును, ఊరును, గుర్తింపును చెప్పడం లేదు- జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఒక










