పర్యావరణం కోసం ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు
‘గ్లోబల్ విట్‌నెస్’ రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2012 నుండి పర్యావరణ పరిరక్షణా కర్తవ్యంలో మొత్తం 2,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లోనే, కనీసం 196 మంది పర్యావరణ రక్షణ కార్యకర్తలు తమ ఇళ్లను లేదా సముదాయాలను రక్షించుకోవడానికి పోరాడుతూ మరణించారు. వీటిలో భారత్ పదో స్థానంలో ఉంది. పర్యావరణం, భూమి హక్కుల కోసం మాట్లాడే వారిపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఈ ఆందోళనకరమైన సంఖ్య ప్రపంచ సంక్షోభాన్ని నొక్కి చెబుతుంది. కొలంబియా వరుసగా రెండో ఏడాది కార్యకర్తలకు అత్యంత ఘోరమైన దేశంగా వుంది. 2023లో, గ్లోబల్ విట్‌నెస్ రికార్డ్ చేసిన ఒక్క సంవత్సరంలో మరే ఇతర దేశం కంటే










