భూమి పతనంలోని సామాజిక విషాదం
సాహితీలోకంలోకి ముందుగా చాలా మంది కవితల్తోనో, కథల్తోనో ఎక్కవగా ప్రవేశిస్తుంటారు. కాని గూండ్ల వెంకట నారాయణ మొదటగా నవల ప్రక్రియ ద్వారా అది కూడా డిగ్రీ చదివే వయస్సులో సాహితీలోకానికి ‘భూమి పతనం’ అనే నవల ద్వారా పరిచయం కావడం చాలా విశేషమైన విషయం. గూండ్ల వెంకట నారాయణ తాను వ్యక్తికరించబోయే విషయాలకు తగిన ప్రక్రియగా నవల ఉండటం వల్ల నవల ప్రక్రియను వాహకంగా ఎన్నుకున్నారేమోనని భూమి పతనం నవలను చదివిన తర్వాత అనిపించింది. భూమి పతనం తర్వాత ఇయ్యాల ఊళ్ళో, గరికపాటోడి కథలు, కాపలాదారుని పాటలు, ద్రావిడమహాసముద్రం వంటి రచనలు చేసారు. ‘భూమి పతనం’ పుస్తకం కవర్






