సంభాషణ నివేదిక

సాంస్కృతిక ప్రతివ్యూహపు కలనేత

విరసం సాహిత్య పాఠశాల నివేదిక విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.  విరసం సీనియర్‌ సభ్యులు