విప్లవం తీర్చిదిద్దిన మనిషి
ఆగస్టు 13న చత్తీస్ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు కూడా చనిపోయినట్లు సమాచారం. వాళ్ల గ్రామస్థులు కావచ్చని, అందుకే వాళ్ల వివరాలు ప్రకటించడం లేదని అనుమానం. ఇప్పటికి పోలీసులు ప్రకటించిన ఇద్దరు మావోయిస్టులలో ఒకరు స్థానిక ఆదివాసీ, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్. విప్లవం ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఎందరిని అసాధారణ మానవులుగా తీర్చిదిద్దుతుందో .. చరిత్రను నిర్మించే ఎన్ని సామాజిక సాంస్కృతిక నైతిక పరివర్తనా క్రమాలను ముందుకు నడుపుతుందో. ఇందులో పాల్గొనే కోటానుకోట్ల మందికి ప్రతినిధులనదగిన లక్షలాది మందిని ఉదాహరణలు










