జైలూ బెయిలూ!
“అబ్బా... వీవీకి బెయిలొచ్చింది, యేమైనా కోర్టుల వల్లే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది” “రెండువేల పద్దెనిమిది నుంచి జైల్లో పెట్టి విచారణ జరపకుండానే తీర్పు యివ్వకుండానే శిక్షాకాలం అమలు చేస్తున్నారు కదా?” “ఔన్లే, యిప్పటిదాకా ఆయన మీద పెట్టిన యే కేసూ నిలబడలేదు” “ఇప్పుడూ బీమా కోరేగాం కేసూ నిలబడదు. ఆల్రెడీ ఆర్సెనాల్ ఫోరెన్సిక్ సంస్థ అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టులో కూడా పోలీసులు పెట్టిన ఎలిగేషన్లు కల్పితాలని, నిందితుల కంప్యూటర్లలోకి సాక్షాలని అక్రమంగా లోడ్ చేశారని చెప్పింది” “ఎవరు యేమి చెప్పినా, మనం చెప్పిన రిజల్టు వస్తేనే మనం నమ్ముతాం, అదే నమ్మదగింది అవుతుంది” “అమెరికా


