అయ్యో రామ!
“ఏమైపోయావురా? నేన్నిన్ను పోల్చుకోలేకపోయాను తెలుసా?” నమ్మలేనట్టు యెగాదిగా చూస్తూ అడిగాడు బట్టతలమనిషి. చింపిరిజుట్టూ గడ్డంతోవున్న మనిషి యేమీ మాట్లాడలేదు. పుసులు కట్టిన అతని లోతు కళ్ళలో తడి. బలహీనంగా వున్నాడు, మాసిన దుస్తుల్లో. కాలాన్ని అందుకోవాలన్నట్టు రైలు దూసుకుపోతోంది. ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. బహుశా వాళ్ళు వాళ్ళ బాల్యపు బావుల్లో పడి కొట్టుకుంటున్నట్టున్నారు. తగ్గిన స్లీపర్ కోచ్‌లవల్ల కాస్తంత రద్దీగానే వుంది బోగీ. బట్టతలమనిషి తన వుద్యోగము గురించి చెప్పాడు. ఆతరువాత పిల్లల చదువుల గురించి అలాగే అనుకూలవతయిన భార్య గురించి చెప్పాడు. అన్నిటికీ సమాధానంగా జీవంలేని నవ్వు ముఖంతో చూశాడు చింపిరిజుట్టు గడ్డంమనిషి. “అది అట... యిదట










