ఆదివాసుల ప్రతిఘటన నేరమైతే అడవి నుంచి జైలుకు
2024 సెప్టెంబర్ 19నాడు మా మట్టి మాలి సురక్ష మంచ్ ప్రముఖ నాయకుడు కార్తీక్ నాయక్‌ను, భారతీయ శిక్షా స్మృతి కింద చట్టవిరుద్ధంగా గుమికూడడం, తీవ్రమైన గాయాలు కలిగించడం, హత్యాయత్నం వంటి అనేక ఆరోపణలపైన అరెస్ట్ చేసారు. సిజిమాలి/తీజ్మాలి కొండలలోని 1,549 హెక్టార్ల భూమిని (ఇందులో 699 హెక్టార్ల స్వచ్ఛమైన అటవీ ప్రాంతం ఉంది) వేదాంత సంస్థ ప్రతిపాదించిన బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా, రాయగడ, కలహండి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఆదివాసీలను నాయక్ సమీకరిస్తున్నారు. అంతకుముందు అదే ఏడాది, 2024 జూన్ 3నాడు మూల్ నివాసీ బచావో మంచ్ (ఎమ్‌బిఎమ్) ఉపాధ్యక్షురాలు సునీత పొట్టంను బీజాపూర్ పోలీసులు










