విరసం 30వ మహా సభలకు సందేశం
సాయుధ పోరాట ఎర్రజెండ చిరకాలం వర్థిల్లు గాక! ఈ సంక్షోభానికి పరిష్కారం మరింత దృఢంగా వర్గపోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే. భావజాలరంగంలో, సాహిత్య సాంస్కృతిక క్షేత్రంలో ప్రజాయుద్ధ ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎత్తిపట్టడమే ఇప్పుడు విప్లవ రచయితల సంఘం తక్షణ, దీర్ఘకాలిక కర్తవ్యం అధ్యక్షా, కామ్రేడ్స్ 56వ ఏట తన ముప్పయ్యవ మహాసభలు నిర్వహించుకుంటున్న విరసం 56వసారి సాహిత్యం కళా, భావజాల రంగంలో తన వర్గ పోరాట కర్తవ్యాన్ని పునరుధ్ఘాటిస్తున్నది. శత్రువ్యూహానికి ఈసారి అంతర్గత ప్రతీఘాతుక సాయుధ విద్రోహ నాయకత్వం క్రియాశీలంగా జతకట్టి తాత్కాలిక సంక్షోభాన్ని, ఇదివరకెన్నడూ లేనంత నష్టాన్ని, పూడ్చుకోవడం కష్టసాధ్యమైన ప్రాణనష్టాన్ని నాయకత్వం నుంచి



