శాంతి పావురాలను
చిదిమేసే "శాంతిదూత"
జగానికి "ప్రేమ" దిక్సూచినని
ప్రకటిస్తున్నాడు
ఆక్రమణ
దురాక్రమణలతో
శాంతిని నెలకొల్పుతానంటున్నాడు
ప్రపంచ దేశాల
సంపదను దోచుకునే
ముఠా నాయకుడు..
మారణహోమం జరిపే
రక్త పిపాసి
ఆనందంగా ఉండే
అన్నాతమ్ముళ్లకీ చిచ్చుపెట్టే జిత్తులమారి నక్క
పెట్టుబడిదారీ రక్కసి
జగత్తుపై జరిపే
హింసోన్మాదానికి
నల్ల రాజు తర్వాతి
బంటు ఈ తెల్లవాడు..
తెలుపు, శాంతికి చిహ్నం
ఈయన మనసు, అశాంతి
క్రోధానికి నిలయం..
విశ్వవ్యాప్తంగా పెల్లుబికే
ప్రజా వెల్లువలో
ఆకలి మంటల్లో
నిరుద్యోగపు జ్వాలల్లో..
శ్వేతసౌధం నిశ్శేషం
కాక మానదు.
యుద్ధోన్మాది అంతం తప్పదు..




