వ్యక్తులు వెళుతూ వెళుతూ
వారి జీవితాన్నిచ్చి వెళ్ళారు

మేఘం చినుకులు కురిపించినట్టు
వెన్నెల కాంతిని పంచినట్టు
నేల చెట్టు వేళ్లని దాచినట్టు
వాళ్లేం ఊరకేనే వెళ్లలేదు

నదుల దారులను చూపి
వెలుగుల్లో చదువులు చెప్పి
చెట్ల పత్రహరితాన్ని ఇచ్చి
ప్రకృతిని సౌందర్యం చేసి వెళ్ళారు

వారు వెళ్ళిపోవడమంటే
మాయమైపోవడం కాదు
మనలోకి మనం చేరుకోవడం..

Leave a Reply