పదమూడు నెలల ఆపరేషన్ కగార్
ప్రజల హక్కులను పణంగా పెట్టి, అంతర్గత సాయుధ సంఘర్షణ పరిస్థితులలో రాజ్య బలప్రయోగాన్ని నియంత్రించే దేశీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్‌లో సంవత్సరానికి పైగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా విధానాన్ని ఖండిస్తున్నాం. ఇటీవల ఫిబ్రవరి 9నాడు జరిగిన ఎన్‌కౌంటర్ మరణాలతో సహా 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 30 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. మొత్తం అరెస్టులు 1033, లొంగుబాటులు 925 కు చేరుకున్నాయి. 2025లో కూడా మావోయిస్టులు కూడా కనీసం తొమ్మిది మంది పౌరులను చంపారని వార్తా నివేదికలు సూచిస్తున్నాయి.