దేశంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. “2026 ప్రపంచ అసమానతల నివేదిక” 2025 డిసెంబర్ లో విడుదలైంది.
ప్రపంచ అసమానతల నివేదిక :
ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండు వందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక , అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం. ప్రపంచాన్ని “కమ్యూనిస్టు భూతం” ఆవహించకుండా, జనం దానివైపు మరలకుండా చూసేందుకు పెట్టుబడిదారీ ఆర్థిక, సామాజికవేత్తలు అనేక అంశాలను ముందుకు తెచ్చారు. వాటిలో ఊట సిద్ధాంతం ఒకటి. ప్రభుత్వాలు కేవలం పాలనకే పరిమితమై అన్ని రంగాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగిస్తే వారు సృష్టించే సంపదల మూట నుంచి ఊట యావతం సమాజానికి దిగుతుందన్నది ఊట సిద్ధాంతం. దానికి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల వంటి ముద్దుపేర్లు పెట్టారు. జనం కూడా నిజమే అని నమ్మారు. తమకూ సంపదల ఊట దిగుతుందేమోనని పోరాటాలు మాని ఆశతో చెంబులు పట్టుకు ఎదురు చూశారు, ధారలేమీ కారలేదు, కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పడ్డాయి. దాంతో ఫలితం లేదని అసంతృప్తి చెందటం ప్రారంభించారు.
2026 ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం సమాజంలో ప్రపంచంలో ఎగువన ఉన్న పది శాతం మంది వద్ద సంపద 58 శాతం ఉంది (2022లో 57శాతం) దిగువన ఉన్న 50శాతం మందికి 15 శాతం (2022లో 13 శాతం). ప్రపంచ మధ్యతరగతిలోకి చైనా జనాభా ఎక్కువ మంది చేరారని, అదే భారత్ లో 1980లో మధ్య తరగతిలో ఉన్న 40శాతంలో ఎక్కువ మంది ఇప్పుడు దిగువ 50శాతంలోకి దిగజారినట్లు పేర్కొన్నది. అసమానతల గురించి తాజా నివేదికలో పేర్కొన్న అంశాలను క్షుప్తంగా చూద్దాం. మచ్చుకు ఒకటి, సబ్ సహారా ప్రాంతంలో ఒక బిడ్డ మీద పిపిపి పద్ధతిలో 200 యూరోలు ఖర్చు చేస్తుండగా ఐరోపాలో 7,400, ఉత్తర అమెరికా, ఓషియానా దేశాల్లో 9,000 యూరోలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో 0.001 శాతం అంటే అరవై వేల మంది కంటే తక్కువ ఉన్న కోటీశ్వరులు దిగువన ఉన్న 50 శాతం జనాభా మొత్తం సంపదల కంటే మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచ జిడిపిలో ఒక శాతం ధనిక దేశాలకు తరలుతున్నది. ఇది ప్రపంచ వృద్ధికి ఇస్తున్నట్లు చెబుతున్న సాయానికి మూడు రెట్లు ఎక్కువ. స్త్రీ, పురుష వేతన తేడా అన్ని చోట్లా ఉంది. గంటకు ఒక పురుషుడు పొందే వేతనంలో మహిళకు వస్తున్నది 61 శాతమే, వేతన చెల్లింపులేని పనిగంటలను కూడా లెక్కిస్తే ఈ తేడా 32 శాతానికి దిగజారుతుంది.
హురున్ ప్రపంచ సంపన్నుల జాబితా
దేశంలో ప్రజల ఆదాయాలు సన్నగిల్లుతుండగా కుబేరుల సంపదలు పెరుగుతున్నాయి. ‘హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026’ నివేదిక మార్చి 3న వెల్లడైంది. ప్రపంచంలోనే బిలయనీర్ల సంఖ్య మొదటిసారిగా 4,000 మార్కును దాటింది. ప్రపంచంలో 4020 బిలియనీర్లు ఈ ఏడాది మన భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య బాగా పెరిగింది. ఇది ఒక కొత్త ప్రపంచ రికార్డు. నివేదిక ప్రకారం.. ఈసారి మనదేశంలో కొత్తగా 57 మంది కోటీశ్వరులు చేరారు. దీంతో మొత్తం బిలియనీర్ల సంఖ్య 308కి చేరింది. వీరి సగటు సంపద సుమారు రూ.26,570 కోట్లుగా నమోదయ్యింది. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా కోటీశ్వరులు ఉన్న మూడవ దేశంగా భారత్ నిలిచింది. మన దేశంలోని ఈ కోటీశ్వరులందరి ఆస్తి విలువ కలిపి సుమారు 112 లక్షల కోట్ల రూపాయలు. ఇండియాలో కోటీశ్వరులకు అడ్డా. అంటే ఇప్పటికీ ముంబైనే. ముంబైలో 95 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ ఏడాది ముంబైలో కొత్తగా 15 మంది కోటీశ్వరులు వచ్చి చేరారు. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో ముంబై ఆరవ స్థానంలో ఉంది. దీని తర్వాత న్యూయార్క్, షెన్జెన్, షాంఘై, బీజింగ్, లండన్ ఉన్నాయి.
146 మంది బిలియనీర్లతో న్యూయార్క్ అత్యధిక సంఖ్యలో బిలియనీర్లను కలిగి ఉన్న నగరం. తరువాత షెన్ౙెన్ (132), షాంఘై (120) ఉన్నాయి. ఏ రంగాల్లో కోటీశ్వరులు పెరుగుతున్నారు…? అంటే హెల్త్‌కేర్ (ఆరోగ్య రంగం)లో కొత్తగా 53 మంది కోటీశ్వరులు వచ్చారు. ఇంధన రంగంలో ఎనిమిదిమంది బిలియనీర్లు ఉన్నప్పటికీ, అత్యధికంగా రూ. 18.3 ట్రిలియన్ల సంపదను ఈ రంగం కలిగి ఉంది. ఆ తర్వాత పారిశ్రామిక ఉత్పత్తులు, వినియోగ వస్తువుల రంగాల్లో కూడా మంచి వృద్ధి కనిపిస్తోంది. చిన్న వయసులోనే ఆస్తిని సంపాదించిన వారిలో ఒయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (32 ఏళ్లు) ఒకరు. ఆయన ఆస్తి 14,440 కోట్ల రూపాయలు. ఎలాన్ మస్క్ తన సంపదను ఏకంగా 89 శాతం పెంచుకుని 792 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
ఈ జాబితాలో ఉన్న వారిలో 80 శాతం మంది 10 ఏళ్ల క్రితం అసలు లేరంటే… మన దేశంలో వ్యాపారాలు, సంపద సృష్టించే మార్గాలు ఎంత వేగకంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ధనవంతుల జాబితాలో ఎవరు ముందున్నారు…? రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఏడాది కూడా ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన ఆస్తి 9.8 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 7.5 లక్షల కోట్ల రూపాయల ఆస్తితో రెండవ స్థానంలో ఉన్నారు. హెచ్‌సిఎల్ సంస్థకు చెందిన రోష్ని నాడార్ మల్హోత్రా 3.2 లక్షల కోట్ల రూపాయల ఆస్తితో మూడవ స్థానంలో నిలిచారు. టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ ఆమెనే. సైరస్ ఎస్. పూనావల్ల నాల్గవ స్థానానికి ఎగబాకారు. ఆయన సంపద 44 శాతం పెరిగి రూ.3 ట్రిలియన్లకు చేరుకుంది. ఈ సంవత్సరం ఆయన అత్యధికంగా లాభపడ్డారు. భారతదేశంలోని టాప్ 10 బిలియనీర్లలో ముఖేష్ అంబానీ రూ.9.8 లక్షల కోట్లు, గౌతమ్ అదానీ రూ.7.5 లక్ష… కోట్లు, రోప్నీ నాడార్ రూ. 3.2 లక్షల కోట్లు, సైరస్ ఎస్ పూనావల్ల రూ. 3.0 లక్షల కోట్లు కుమార్ మంగళం బిర్లా రూ. 2.5 లక్షల కోట్లు, దిలీప్ షాంఘ్వీ రూ. 2.3 లక్షల కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ రూ. 2.3 లక్షల కోట్లు, నీరజ్ బజాజ్ రూ. 2.2 లక్షల కోట్లు, ఆశోక్ పి. హిందూజా రూ. 2.2 లక్షల కోట్లు, రాధాకిషన్ దమానీ రూ. 1.5 లక్షల కోట్లు కూడా ఉన్నారు.
దేశంలో అధిక ధరలతో ప్రజల ఆదాయాలు సన్నగిల్లుతుండగా, కుబేరుల సంఖ్య యేటేటా భారీగా పెరుగుతోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 నివేదిక ప్రకారం.. ఇందులో 199 మంది సంపద పెరగ్గా, 109 మంది సంపదలో మార్పు లేకుండా ఉంది. భారతీయ బిలియనీర్లలో 7 శాతం మంది మహిళలు ఉన్నారు.
దేశంలో వెక్కిరిస్తున్న పేదరికం :
హెల్త్ కేర్, ఎనర్జీ వంటి కీలక రంగాలు ఈ అపర కుబేరులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సామాన్యుడి పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతోంది. బిలియనీర్ల సంపద 10 శాతం పెరిగినప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సామాన్యుడి కొనుగోలు శక్తిని హరిస్తున్నాయి. ముఖ్యంగా హెల్త్‌కేర్, ఆటో విడిభాగాలు. ఎనర్ౙీ రంగాల్లో కొత్త కుబేరులు పుట్టుకొస్తున్న తరుణంలోనే అదే ఆరోగ్య సేవలు సామాన్యుడికి అత్యంత ఖరీదైనవిగా మారుతుండటం గమనార్హం. ముంబాయి వంటి మెట్రో నగరాలు సంపదకు కేంద్రాలుగా మారుతుండగా, గ్రామీణ భారతం ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేస్తూనే ఉంది. బిలియనీర్ల సంఖ్య పెరగడం మున్ముందు రాబోయే ఆర్థిక అసమానతలకు హెచ్చరికలా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 308 మంది కుబేరులు ఉండటం కన్నా, కోట్లాది మంది పేదరికం నుండి బయటపడటమే నిజమైన అభివృద్ధి అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సంవత్సరం భారతదేశంలో 57 మంది కొత్త బిలియనీర్లు చేరారు. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత మూడవ స్థానంలో ఉంది. గత సంవత్సరం కంటే 578 మంది బిలియనీర్లు పెరిగారు. చైనాలో 1,110 మంది బిలియనీర్లు ఉండగా, అమెరికాలో 1,000 మంది ఉన్నారు. 308 మంది బిలియనీర్లతో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలను అధిగమించింది.
ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపద 20.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. గత ఏడాదిలో నమోదైన 16.1 లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే మరో 4 లక్షల కోట్ల డాలర్ల వృద్ధి నమోదైంది. ప్రపంచంలోని 20 మంది కనీసం 10,000 కోట్ల డాలర్ల ఆస్తి కలిగి ఉన్నారు. వీరి మొత్తం సంపద 3.8 లక్షల కోట్ల డాలర్లు. లిస్ట్ లోని బిలియనీర్ల మొత్తం సంపదలో, దాదాపు 20 శాతానికి సమానం. మార్చి 1 నాటికి స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్ల ధరలు, కరెన్సీ మారకం రేట్ల ఆధారంగా ప్రపంచ సంపన్నుల ఆస్తిని లెక్కించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో కుబేరులు :
ప్రం.ర్యాంకు పేరు ఆస్తి(కో.డా.) కంపెనీ
332 మురళి దివి 1,010 దివీస్ లేబోరేటరీస్
1108 జీఎం రావు 390 జీఎంఆర్ గ్రూప్
1189 ప్రతాప్ సి రెడ్డి 360 అపోలో హాస్పిటల్స్
1251 బి. ప్రార్థసారధి రెడ్డి 340 హెటిరో గ్రూప్
1325 మహిమ దాట్ల 320 బయోలాజికల్Ðఇ
1406 పివి రాంప్రసాద్‌రెడ్డి 300 అరబిందో ఫార్మా
1440 ఎం సత్యనారాయణరెడ్డి 290 ఎంఎసఎస్ ఫార్మా
1834 జూపల్లి రామేశ్వర్రావు 230 మై హోమ్ గ్రూప్
1982 పివి కృష్ణారెడ్డి 210 మేఘా ఇంజనీరింగ్
2052 పి పిచ్ౘ్ిరెడ్డి 200 మేఘా ఇంజనీరింగ్
2481 కె సతీశ్ రెడ్డి 160 డాక్టర్ రెడ్డీస్
2481 జీవి ప్రసాద్ 160 డాక్టర్ రెడ్డీస్
2600 సత్యనారాయణ చావా 150 లారస్ ల్యాబ్స్
3017 ఆలూరు జగదీశ్‌ప్రసాద్ 120 హెచ్బిఎల్ పవర్
3185 సుబ్బమ్మ జాస్తి 110 సువెన్ ఫార్మా
ప్రపంచంలోని టాప్ 10 కుబేరులు :
క్ర.సం. పేరు సంపద(అమెరికా డాలర్లలో)
1. ఎలాన్ మస్క్ 800 బిలియన్లు
2. జెఫ్ బెజోస్ 300 బిలియన్లు
3. లారీ పేజ్ 271 బిలియన్లు
4. లారీ ఎల్లిసన్ 267 బిలియన్లు
5. సర్ౙరీ బ్రిన్ 247 బిలియన్లు
6. మార్క్ జూకర్బర్గ్ 234 బిలియన్లు
7. బెర్నాండ్ ఆర్నాల్ట్ 178 బిలియన్లు
8. వారెన్ బఫెట్ 173 బిలియన్లు
9. జెన్సెన్ హువాంగ్ 172 బిలియన్లు
10. స్టీవ్ బాల్మ్ర్ 159 బిలియన్లు
ఇది భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద :
ఆ నివేదిక ప్రకారం, భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద రూ.112.6 ట్రిలియన్లకు పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 10 శాతం పెరుగుదల. ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడు, ఆసియాలో అత్యంత ధనవంతుడు, అతని సంపద రూ. 9.8 ట్రిలియన్లు. గత సంవత్సరంతో పోలిస్తే 9 శాతం పెరుగుదల. గౌతమ్ అదానీ భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడు. అయినప్పటికీ అతని సంపద 14 శాతం తగ్గి, ఇప్పుడు రూ. 7.5 ట్రిలియన్లకు చేరుకుంది. రోష్ని నాదర్ మల్హోత్రా రూ. 3.2 ట్రిలియన్ల (అమెరికా 1.2 ట్రిలియన్ డాలర్లు) నికర విలువతో మూడవ స్థానంలో నిలిచారు. భారతదేశంలోని టాప్ 10 ధనవంతులలో ఆమె ఏకైక మహిళ. సైరస్ ఎస్. పూనావాలా నాల్గవ స్థానానికి ఎగబాకారు. ఆయన సంపద 44 శాతం పెరిగి రూ.3 ట్రిలియన్లకు (అమెరికా 1.2 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. ఈ సంవత్సరం ఆయన అత్యధికంగా లాభపడ్డారు. భారతదేశంలోని టాప్ 10 బిలియనీర్లలో కుమార్ మంగళం బిర్లా, దిలీప్ సంఘ్వీ, అజీమ్ ఫ్రేమ్జీ, నీరజ్ బజాజ్, అశోక్ పి.హిందూజా, రాధాకిషన్ దమాని కూడా ఉన్నారు. ఈ నగరంలో అత్యధిక బిలియనీర్లు ఉన్నారు. ఇంకా ముంబై భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ల నగరంగా కొనసాగుతోంది. 95 మంది బిలియనీర్లకు నిలయంగా ఉన్న ముంబై ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. దీని తర్వాత న్యూయార్క్, షెన్జెన్, షాంఘై, బీజింగ్, లండన్ ఉన్నాయి. 146 మంది బిలియనీర్లతో న్యూయార్క్ అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు కలిగి ఉన్న నగరం. తరువాత షెన్జెన్ (132), షాంఘై (120) ఉన్నాయి.
ముగింపు :
ప్రపవంచ వ్యాప్తంగా సంపన్నుల సంపద వేగంగా పెరుగుతూ పోతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 మంది అత్యంత ధనవంతులు నిరుడు రోజుకు సగటున 100 మిలియన్ డాలర్లు సంపాదించారని ఆక్స్ ఫామ్ పేర్కొన్నది. అంతేగాక వీరి సంపదలో 99 శాతం కోల్పోయిన ఇంకా వారు బిలియనీర్లుగానే మిగిలి ఉంటారని తెలిపింది. పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. బిలియనీర్లు అంతే వేగంగా పుట్టుకొస్తున్నారు. గతేడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు పుట్టుకొచ్చారని ఆక్స్ ఫామ్ గత జనవరిలో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్య్లూఈఎఫ్) “’టేకర్స్ నాట్ మేకర్స్” పేరిట ఆక్స్ ఫామ్ నివేదికను విడుదల చేసింది. ఏటా ఈ సదస్సు తొలి రోజు అంతర్జాతీయ అసమానతలపై ఈ ప్రతిష్టాత్మక నివేదికను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి రిపోర్ట్ పేరుకు తగ్గట్టుగానే … ప్రపంచంలోని ధనికులకు, మిగతా జనాభాకు మధ్యనున్న సంపద అంతరాన్ని గట్టిగానే ఆవిష్కరించడం విశేషం.




