యాలపొద్దున యేరు దాటిన చిరుత నోటిిని చీల్చి లేచిన.. డ్రోను డేగల కూల్చి వేసిన.. దొంగ దాడుల శత్రు మూకల.. నేల గూల్చి నేరు గొచ్చిన.. ఎదురు పొదల ఎంట దెచ్చిన.. దారి జూపే దుసురు తీగా.. దూప దీర్చే మోదుగాకూ.. మాటు గాయే మడ్డి చెట్టూ.. గుట్టు జెప్పే బోడు మిట్ట.. వొడిల దాచిన గుండ్లు వడిసెలు.. మోపు గట్టిన ర్యాల పండ్లూ.. మాగ బెట్టిన శీత ఫలమూ.. పైలమేనా ఆ కాయలన్నీ.. కత్తు వెంట కాలి బాట దింపి పంపే జారు బండ.. వొంపు దేలిన మా డొంక తల్లీ.. వోదలి వస్తనే వనం బిడ్డల.. వీరులయ్యే గురుల చెంతన.. సాన బెట్టిన అక్షరాలకు.. సాము నేర్పే స్కూలు లోన.. * * *
