ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ‘బలం’ అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర అప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయి. అందుకే 1944లో బ్రెట్టన్వుడ్స్లో అన్ని దేశాలూ అమెరికన్ డాలర్ను రిజర్వు కరెన్సీగా ఉపయోగించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పట్నుంచి చమురు, ఆయుధాలు, ఆహారం, బంగారం, ఖనిజాలు, వ్యాపార సరుకుల క్రయవిక్రయాలకు డాలర్లలో చెల్లింపులు జరిపే సంప్రదాయం నెలకొంది. దీంతో ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు డాలర్ నిల్వలను భారీగా పోగేస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటికీ 47 శాతం లావాదేవీలకు డాలర్లనే ఉపయోగిస్తున్నారు. అమెరికా డాలర్ ప్రపంచంలోనే ప్రధాన రిజర్వ్ కరెన్సీ, ఇది వాణిజ్యం, ఇతర అంతర్జాతీయ లావాదేవీలకు అత్యంత విస్తృతంగా ఉపయోగించే కరెన్సీ కూడా. అయితే, ఇటీవలి కాలంలో భౌగోళిక రాజకీయ, వ్యూహాత్మక మార్పుల కారణంగా దాని ఆధిపత్యం ప్రశ్నార్థకంగా మారింది.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచంలో బలమైన ఆర్థిక, సైనికశక్తిగా అమెరికా ముందుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం, అస్థిరత, ఆర్థిక వినాశనంతో అలసిపోయిన ప్రపంచం ఇక తరువాతి కాలంలో, ప్రపంచ యుద్ధాలు, అశాంతి, ఆర్థిక అభద్రతలు లేని సుస్థిరత దిశగా సాగాలని కోరుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నింటినీ సమన్వయపరుచుకుని వాటి మధ్య వచ్చే విబేధాలు, వైషమ్యాల పరిష్కారానికి ఒక వేదికగా 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. మరో పక్కన ప్రపంచానికి ఒక సుస్థిరమైన ఫైనాన్స్ వ్యవస్థను అందించేందుకు గాను ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి ఆర్థిక, ఫైనాన్స్ వ్యవస్థలు కూడా పుట్టుకువచ్చాయి. ఈ ఆర్థిక, ఫైనాన్స్ వ్యవస్థల ఆవిర్భావం 1944లో అమెరికాలోని న్యూహాంషైర్లోని బ్రెట్టన్వుడ్స్లో 44 దేశాల సమావేశంలో ఏర్పడింది. ఈ సమావేశంలోనే డాలర్ కరెన్సీకి ప్రస్తుతపు అగ్రగామి స్థానాన్ని కట్టబెట్టిన నిర్ణయం కూడా జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం అమెరికా కరెన్సీ డాలర్ ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీ అయ్యింది. అంటే, వివిధ ప్రపంచ దేశాల మధ్యన జరిగే వ్యాపారం, లావాదేవీలలో వినియోగించుకునే మారకం సాధనంగా డాలర్ను నాటే బ్రెట్టన్వుడ్స్ సమావేశంలో ప్రపంచ దేశాలు ఆమోదించుకున్నాయి. రిజర్వ్ కరెన్సీగా అమెరికా డాలర్ దాదాపు మూడు థాబ్ధాల పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో అనేక పరిణామాలు జరిగాయి.
1944-1971 మధ్యకాలంలో, ప్రపంచదేశాల మధ్య వాణిజ్యం భారీస్థాయిలో విస్తరించింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్థిక వినాశనం పాలైన దేశాలు తిరిగి కోలుకోవడం, మరింత వేగంగా ఆర్థిక పురోగతిని సాధించడంతో ఈ వాణిజ్య విస్తరణ జరిగింది. ఈ క్రమంలోనే, ప్రపంచంలోని దేశాలకు తమ తమ అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం డాలర్ల అవసరం భారీగా పెరిగింది. ఫలితంగా అమెరికా పెద్దస్థాయిలో డాలర్ల ముద్రణను చేపట్టవలసి వచ్చింది. అయితే ఇలా డాలర్లు ముద్రించిన ప్రతి సందర్భంలోనూ అమెరికా తన ఖజానాలో ప్రతీ 35 డాలర్ల ముద్రణకూ ప్రతిగా, ఒక ఔన్స్ బంగారాన్ని కొని నిలువ పెట్టవలసిన అవసరం ఉంది. డాలర్తో బంగారం ముడిని కొనసాగించడంలో అమెరికాకు ఇక్కడే సమస్య మొదలయ్యింది. బ్రెట్టన్వుడ్స్ వ్యవస్థ ప్రకారం 35 డాలర్లను 31.103 గ్రాముల బంగారంతో ముడిపెట్టారు. అంటే, ఈ వ్యవస్థలో 31.03 గ్రాముల బంగారం ధర 35 డాలర్ల వద్ద స్థిరపరచబడింది. అయితే, బహిరంగ మార్కెట్లో పరిస్థితి ఇలా స్థిరంగా ఉండదు. ఆ మార్కెట్లో బంగారం ధర నిరంతరంగా మారుతూ ఉంటుంది. ఎక్కువ సందర్భాలలో ఆ ధర పెరుగుతూనే ఉంటుంది. అంతిమంగా 1971 ఆగష్టు 15వ తేదీన నాటి అమెరికా అధ్యకక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారంతో డాలర్కు ఉన్న ముడిని తిరస్కరిస్తూ, ఇకముందు కాలంలో తమ ఫెడరల్ బ్యాంక్ వద్ద డాలర్లను బంగారంలోకి మార్చుకోవడం కుదరంటూ తేల్చి చెప్పేశారు. దాంతో బంగారం, డాలర్ లింక్ తెగిపోయింది.
ఇప్పటివరకు అమెరికా కలకు ఆలంబన ‘డాలర్’… ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ‘డాలర్’… బంగారం బదులుగా ‘డాలర్’.. బంగారానికి సమానం డాలర్’…! మరి ఈ డాలర్కు ఏదో ముప్పు ముంచుకు వస్తోందని అమెరికా అధ్యకక్షుడు ట్రంప్ ఎందుకు ఆందోళన చెందుతున్నట్టు? థాబ్ధాలుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అనుసంధానిస్తున్న అమెరికా కరెన్సీ, డాలర్… ఇదే అగ్రరాజ్యానికి ఆయుధంగా మారింది. తనకు గిట్టని దేశాలపై ఎడాపెడా ఆంక్షలు విధిస్తోంది. డాలర్లు చిక్కకుండా చేస్తూ పైచేయి సాధిస్తోంది. డాలర్ ప్రధాన ప్రపంచ కరెన్సీగా కొనసాగుతున్నందున అమెరికా ట్రెజరీలను సురక్షితమైన ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు) ఆస్తిగా పరిగణిస్తారు. వాస్తవానికి, అన్ని బ్యాంకులు ఈ సెటప్తో ముడిపడి ఉన్నందున, అమెరికా వాస్తవంగా సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ (ఐఇ|ఓఊ) చెల్లింపుల వ్యవస్థను నియంత్రిస్తుంది. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, రష్యాకు జరిగే అన్ని చెల్లింపులను అమెరికా నిరోధించింది. ఈ దెబ్బ తీవ్రంగా ఉంది కానీ అలాంటి అవకాశాల గురించి ఇతర దేశాలకు కూడా ఒక సంకేతం. అందువల్ల, అన్ని కేంద్ర బ్యాంకులు ఇప్పటికీ అమెరికా ట్రెజరీలను ఇష్టపడతాయి. కానీ పరిస్థితులు మారుతున్నాయి. చర్చ డాలర్కు ప్రత్యామ్నాయాలను అన్వేషించడంపై దృష్టి పెట్టింది. అందుకే డాలర్ ఆధిపత్యంలో ఉన్నప్పటికీ పలు దేశాలు తమ ఫారెక్స్ హోల్డింగ్లను వైవిధ్యపరుస్తున్నాయి.
డీ-డాలరైజేషన్ అంటే ఏమిటి? :
డీ-డాలరైజేషన్ అంటే ప్రపంచ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థికం, కరెన్సీ నిల్వలలో అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకుని, బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీలను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకునే ప్రక్రియ. ఇది దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలకు వర్తిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించి, వివిధ దేశాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం లక్ష్యంగా ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో అనేక దేశాలు వివిధ కారణాల వల్ల డీ-డాలరైజేషన్ను అనుసరిస్తున్నాయి. ఇటీవల, అమెరికా ఆర్థిక ఆధిపత్యం అనేక దేశాల ఆర్థిక సార్వభౌమాధికారం, భౌగోళిక, రాజకీయాలపై పెరుగుతున్న కారణంగా డీ-డాలరైజేషన్ను అనుసరిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి పలు దేశాలు తమ సొంత కరెన్సీలతో వాణిజ్యం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా ఆంక్షలకు డాలర్ ఆధారిత వ్యవస్థ ఒక ప్రధాన చోదకశక్తి. అందుకే రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు ఆర్థిక పరిమితులను నివారించడానికి డాలర్ ప్రత్యామ్నాయాలను వెతకడానికి ప్రేరేపించింది.
అనేక దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుదల లేదా కరెన్సీ షాక్ల వంటి డాలర్ సంబంధిత అస్థిరతల నుండి తమను తాము రక్షించుకోవాలని ఆలోచిస్తున్నాయి. గ్లోబల్ ఫైనాన్స్లో బహుళ ప్రామాణిక కరెన్సీకి కూడా ఒత్తిడి పెరుగుతున్నది. ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు స్థానిక కరెన్సీల వినియోగాన్ని లేదా చైనా క్రాస్-బోర్డర్ ఇంటర్బ్యాంక్ చెల్లింపు వ్యవస్థ(సిఐపిఎస్) వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో డాలర్కు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకునే దిశలో దేశాలు అడుగులు వేస్తున్నాయి. తద్వారా జాతీయ కరెన్సీలను బలోపేతం చేసుకుంటున్నాయి. ఇవాళ డీ-డాలరైజేషన్ అనేది పెట్టుబడిదారుడు, కార్పొరేట్లు, మార్కెట్ భాగస్వాములలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ”డీ-డాలరైజేషన్ భావన డాలర్ యొక్క నిర్మాణాత్మక డిమాండ్లో మార్పులకు సంబంధించినది. ఇది రిజర్వ్ కరెన్సీగా దాని స్థితికి సంబంధించినది. ఇది డాలర్ యొక్క దీర్ఘకాలిక వినియోగానికి సంబంధించిన రంగాలను కలిగి ఉంటుంది.
డీ-డాలరైజేషన్కు కారణాలు :
అనేక దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుదల లేదా కరెన్సీ షాక్ల వంటి డాలర్ సంబంధిత అస్థిరతల నుండి తమను తాము రక్షించుకోవాలని ఆలోచిస్తున్నాయి. గ్లోబల్ ఫైనాన్స్లో బహుళ ప్రామాణిక కరెన్సీకి కూడా ఒత్తిడి పెరుగుతున్నది. ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు స్థానిక కరెన్సీల వినియోగాన్ని లేదా చైనా యొక్క క్రాస్బోర్డర్ ఇంటర్ బ్యాంక్ చెల్లింపు వ్యవస్థ (సిఐపిఎస్) వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నాయి. డాలర్ నుండి వైవిధ్యభరితంగా మారడం ద్వారా, ఈ దేశాలు వాణిజ్యం, ద్రవ్య విధానం, అంతర్జాతీయ చెల్లింపులపై ఎక్కువ నియంత్రణను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. డాలర్ నుండి వైవిద్యభరితతంగా మారడం ద్వారా, ఈ దేశాలు వాణిజ్యం, ద్రవ్య విధానం, అంతర్జాతీయ చెల్లింపులపై ఎక్కువ నియంత్రణను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనిలో భాగంగా, అనేక దేశాలు అమెరికా డాలర్కు బదులుగా వారి స్వంత కరెన్సీలను ఉపయోగించి వాణిజ్యాన్ని ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆంక్షలను దాటవేయడానికి ప్రయత్నిస్తున్న దేశాలలో ఈ ధోరణి పెరుగుతోంది. చైనా-రష్యా డాలర్ ఆధారిత లావాదేవీలను పక్కదారి పట్టించడానికి వారి స్వంత కరెన్సీలలో (చైనీస్ యువాన్- రష్యన్ రూబుల్) వాణిజ్యాన్ని గణనీయంగా విస్తరించాయి. భారతదేశం, రష్యా చమురు దిగుమతులు సహా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపాయలు- రూబుల్లలో పరిష్కరించుకుంటున్నారు. టర్కీ, రష్యా, ఇరాన్ కూడా డాలర్ ఆంక్షలను నివారించడానికి స్థానిక కరెన్సీ వాణిజ్య ఒప్పందాలలో పాల్గొంటున్నాయి.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజిప్ట్, ఇధియోపియా అనే పది దేశాలతో కూడిన బ్రిక్స్, అమెరికా నియంత్రణలో ఉన్న స్విఫ్ట్కు బదులుగా బ్రిక్స్ పే సిస్టమ్ ద్వారా సులభతరం చేయబడిన స్థానిక కరెన్సీలను ఉపయోగించడం ద్వారా డీ-డాలరైజేషన్ను ప్రారంభించింది. అమెరికా ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేసే దానికంటే గణనీయంగా ఎక్కువ ఖర్చు చేస్తూనే ఉంది. ఇది చివరికి రుణ సంక్షోభానికి దారితీయవచ్చు. దీనివలన డాలర్ నాటకీయంగా బలహీనపడుతుంది. 2025 ప్రారంభం నుండి ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువ గణనీయంగా తగ్గింది. ఈ ధోరణి కొనసాగుతుతందని ఆశించడానికి అనేక కారణాలు ఉన్నాయి. పెట్టుబడిదారులు తమ స్థిర ఆదాయ కేటాయింపులను అమెరికా కాని పెట్టుబడి-గ్రేడ్ బాండ్లు, స్థానిక కరెన్సీ ఉద్భవిస్తున్న మార్కెట్ బాండ్ల వైపుకు మార్చడాన్ని పరిగణించవచ్చు.
”డీ-డాలరైజేషన్ భావన డాలర్ యొక్క నిర్మాణాత్మక డిమాండ్లో మార్పులకు సంబంధించినది, ఇది రిజర్వ్ కరెన్సీగా దాని స్థితికి సంబంధించినది. ఇది డాలర్ యొక్క దీర్ఘకాలిక వినియోగానికి సంబంధించిన రంగాలను కలిగి ఉంటుంది. డీ-డాలరైజేషన్ అనేది ప్రపంచం ప్రధాన రిజర్వ్ కరెన్సీగా అమెరికా డాలర్ (యుఎస్డి)పై ఆధారపడటం నుండి వైదొలగడం అనే ప్రక్రియను వివరిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అగ్ర ఆర్థిక శక్తిగా అవతరించినప్పటి నుండి డాలర్ ప్రాథమిక రిజర్వ్ కరెన్సీగా, అంతర్జాతీయ వ్యాపారానికి వాహకంగా ఉంది. కానీ డాలర్ తన నాయకత్వాన్ని నిలబెట్టుకోగలదా అనే ప్రశ్నలు తరచుగా తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ చెల్లింపుల కోసం స్విప్ట్ వంటి పశ్చిమ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కొన్ని దేశాలు తమ సొంత చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి.
పడిపోతున్న డాలర్ విలువ :
2025 ఆరంభం నుండి అమెరికా డాలర్ గణనీయమైన విలువను కోల్పోయింది. అనిశ్చితి ఎక్కువగా ఉంది. బలహీన డాలరు అంటే, ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ పడిపోతుంది. బలహీన డాలర్ అంటే ఇతర విదేశీ కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువలో తగ్గుదల ధోరణిని సూచిస్తుంది. సాధారణంగా పోల్చబడే కరెన్సీ యూరో కాబట్టి, యూరో ధర పెరుగుతుంటే డాలర్ బలహీనపడినట్లు చెబుతారు. ఈ తగ్గుదల ధోరణి కొనసాగే అవకాశం ఉంది. బలహీనమైన డాలర్ అంటే పెట్టుబడిదారులు అమెరికా సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతారు. డాలర్ బలహీన పడినప్పుడు అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులు ఇతర దేశాలకు చౌకగా లభిస్తాయి. దిగుమతులు ఖరీదైనవిగా మారుతాయి. 2025 ప్రారంభంలో డాలర్ విలువ తగ్గడానికి రెండు ప్రధాన కారణాలు తోడ్పడ్డాయి. ట్రంప్ సుంకాలను ప్రకటించడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు కోతలు పెడుతానని పెట్టుబడిదారులు బయపడ్డారు. ‘రేట్ కోత అంచనాలకు మార్పులు డాలర్ విలువపై ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ కెనడా వంటి బ్యాంకులు ఇప్పవటికీ ఫెడ్ కంటే ముందే వడ్డీరేట్లను తగ్గించారు. బలహీనమైన డాలర్ ఇతర విదేశీ కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువలో తగ్గుదల ధోరణిని సూచిస్తుంది.
ముగింపు :
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంట్ను అనేక చర్యలు, నిర్ణయాల వలన డాలర్ పతనం మరింత వేగాన్ని పుంజుకుంది. పారిశ్రామికంగా డొల్లగా మారిపోయిన స్థితిలో అమెరికా దేశ మనుగడకు మిగిలిన ఏకైక అస్త్రం దాని డాలర్కు ప్రపంచంలో ఉన్న ఆమోదయోగ్యత మాత్రమే! నేడు ఈ ఆమోదయోగ్యతకే ముప్పు వచ్చిపడుతోంది. పైగా యుక్రెయిన్-రష్యా యుద్ధ క్రమంలో రష్యా మీద అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది. వీటిలో భాగంగానే, రష్యా దేశం తన విదేశీ లావాదేవీల కోసం డాలర్ను వినియోగించుకొనే అవకాశం లేకుండా చేసేందుకుగానూ డాలర్ లావాదేవీల కోసం ఏర్పరిచిన ‘స్విప్ట్’ వ్యవస్థ నుంచి రష్యాను అమెరికా బహిష్కరించింది. ఈ బహిష్కరణ ప్రపంచంలోని అనేక దేశాల ఆలోచనలో పెద్దమార్పును తెచ్చింది. రేపు ఏదో ఒక రోజున తాము కూడా అమెరికాను కాదంటే తమకు కూడా ఇటువంటి ముప్పు వస్తుందని అనేక దేశాలు గ్రహించాయి. అంటే అమెరికాకు ఎదురితిరిగితే తాము కూడా డాలర్ లావాదేవీల వ్యవస్థ నుంచి బయటకు నెట్టివేయబడే ప్రమాదం ఉందని వాటికి అర్థమయ్యింది. ఈ కారణంలోనే రష్యా-యుక్రెయిన్ యుద్ధం తరువాత అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో భాగంగా చాలా దేశాలు నేడు తమ విదేశీ మారకద్రవ్య నిల్వలలో డాలర్ల శాతాన్ని కూడా తగ్గించుకుంటున్నాయి.




