డియర్ మోదీ..
నీదీ నాదీ
సిద్ధాంత చర్చ అయ్యుంటే
గౌరవప్రదంగా జరిపే వాడ్ని
నీతోను.. నీ అనుచరులతోనూ
నీ బత్తాయి రౌడీలతోనూ
మాగొప్పగా మాట్లాడేవాడ్ని
కానీ నీది
అబద్దాల రొష్టు
నాది
నిజాల కొలిమి
నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడే
ప్రతీ అబద్ధం
నీ గూండాలు ఎలా మోస్తున్నారు?
చరిత్ర..
నీకు నచ్చినట్టు రాసుకునేది కాదు
చరిత్ర..
నీ సిద్ధాంతాలకి తగ్గట్టు చెరిపేసేది కాదు
డబ్బై ఏళ్ళకి
మెదడు మొద్దబారుతుంది కానీ
అబద్ధాలను తయారీ చేస్తుందా?
ప్రభుత్వ యంత్రాంగాన్ని
నేడు అబద్ధాల తయారీ కేంద్రంగా మార్చావ్
దేశ ప్రధాని హోదాని
గాలికి ఒదిలేసి
నచ్చినట్ట వాగుతున్నావ్
నీకూ నీ నోటికి
తాళం వేయాలంటే
నిన్ను గద్దె నుంచి దింపడం తప్ప
మరో మార్గం కానరావట్లేదు.
డియర్ మోదీ..
దేశ చరిత్రను ఖూనీ చేసే
నీకంటే
పెద్ద "దేశద్రోహి" ఎవరు?
పేదల కన్నీటిని తుడవకుండా
ఫొటోలు దిగే నీకంటే
పెద్ద "అమానవీయత" ఎవరిది?
