2025 సెప్టెంబర్‌ 22-26 తేదీల్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం న్యూయార్క్ లో జరుగుతున్న వేళ, ప్రపంచ ఆర్థిక వేదిక సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు, కృత్రిమ మేధ ప్రభావం, స్థిరమైన ఆర్థికం వంటి ప్రపంచ సవాళ్లపై దృష్ట సారించింది. ఆర్థిక వృద్ధిలో నెలకొన్న అనిశ్చితి, శ్రామికశక్తి భవిష్యత్తును పరిశీలించింది. అభివృద్ధి సంక్లిష్టతను చర్చించేందుకు 22-26 తేదిల్లో స్థిరత్వం, ఆర్థికవృద్ధి, బాధ్యత యుతమైన సాంకేతికపై, పురోగతిని చర్చించడానికి ప్రపంచ దేశాల నుండి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో నూతన తయారీ సాంకేతికతలకు మార్గదర్శకత్వం వహించే సైట్‌లను గుర్తించింది. ఈ నెట్‌వర్క్ ల కోసం 12 మంది నిపుణులను ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక న్యూయార్క్ లో సెప్టెంబర్‌ 30న చీఫ్‌ ఎకనామిస్ట్స్‌ అవుట్‌లుక్‌, చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్స్‌ అవుట్‌లుక్‌ నివేదికలను విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పోకడలను విశ్లేషించడానికి ప్రపంచ ఆర్థిక వేదిక క్రమం తప్పకుండా చీఫ్ ఎకనామిస్టుల సర్వేను నిర్వహిస్తుంది. ఇది వృద్ధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక విధానాలపై తాజా దృక్పథాన్ని అందిస్తుంది.  ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ప్రతి యేటా జనవరి 15-19 తేదిల మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక అనేది అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. ఇది స్విట్జర్లాండంలోని జెనీవా నగరంలో ఉంది. దీనిని 1971 జనవరి 24న జర్మన్ ఇంజనీర్, ఆర్ధికవేత్త క్లాస్ స్క్వాబ్ స్థాపించారు. దీని లక్ష్యం వ్యాపార విస్తరణ, లాభాలు గడించడం తప్పా సామాజిక, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి  చొరవ చూపదు.

ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లతో కూడుకున్నదని ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన ఆర్థికవేత్తల అవుట్ లుక్ పేర్కొంది. వాణిజ్య అవరోధాలు, రాజకీయ విధానాలలో అనిశ్చితి, సాంకేతిక మార్పులు దీనికి కారణమని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. సెప్టెంబర్‌ 2025లో ప్రపంచ ఆర్థిక వేదిక 22 నుండి 26 వరకు న్యూయార్క్ లో తన సుస్థిర అభివృద్ధి ప్రభావ సమావేశాలను (ఎస్‌డిఐయం) నిర్వహించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సెప్టెంబర్‌ 30, 2025న, ఫోరం తన చీఫ్‌ ఎకనామిస్ట్స్‌ అవుట్‌లుక్‌ నివేదికను విడుదల చేసింది. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రూపొందించే తాజా గతిశీలతను అన్వేషించింది. వీటిలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, రాజకీయ విధాన మార్పులు, కృత్రిమ మేధస్సు సాంకేతికతల విఘాతకరమైన ప్రభావాలను ముఖ్య ఆర్థిక వేత్తలు పరిశీలించారు. వీరి పరిశీలనలు తీవ్రతరం అవుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, మారుతున్న అభివృద్ధి విధానాలు, కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి ద్వారా తీవ్రతరం అవుతున్న ప్రస్తుత వాతావరణ అనిశ్చితిని ప్ర‌ధానం చేసి చెప్పింది.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం చీఫ్‌ ఎకనామిస్ట్స్‌ సర్వే నుండి డేటాను ఉపయోగించి, ఆ నివేదిక ప్రమాదాలు, స్థితిస్థాపకత, అవకాశాల భవిష్యత్తు అంచనాను అందిస్తుంది. మారుతున్న భౌగోళిక, రాజకీయ ఆర్థిక ఉద్రిక్తలు, కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి ద్వారా నొక్కిచెప్పబడిన ప్రస్తుతస్థితిలోని అనిశ్చితిని ప్ర‌ధానంగా చేసి చెప్పింది. ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోతైన పరివర్తన ద‌శ‌లో ఉంది. ఇది నిరంతర స్వల్పకాలిక అంతరాయాలు, పెరిగిన అనిశ్చితి అలాగే దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పుల ద్వారా వర్గీకరించబడుతుంది. అమెరికా చేత అణచివేయబడిన అవకాశాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తుంది. యూరప్‌ బలహీనంగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న స్థితిని చూపుతోంది. చైనా ప్రతి ద్రవ్యోల్బణ ఎదురుగాలిని ఎదుర్కొంటున్న‌ది. దక్షిణాసియా ప్రాంతం వృద్ధికి ప్రకాశవంతమైన ప్రదేశంగా ఉందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారుతుందని ఆర్థికవేత్తలు గుర్తించారు. ఇది అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యత్యాసాల వంటి సవాళ్లను కూడ పరిశీలిస్తోంది.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్య్లూఈఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్తల తాజా దృక్కోణం ప్రకారం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విధాన నిర్ణ‌యాలు, రుణభారాలు, సాంకేతిక మార్పులు, నిరంతర అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులను బలహీనపరుస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి థలోకి ప్రవేశిస్తుందని, వ్యవస్థాగత అంతరాయ ద‌శ‌లోకి అడుగుపెడుతోందని ప్రపంచ ఆర్థిక వేదిక తాజాగా విడుదల చేసిన చీఫ్‌ ఎకనమిస్ట్స్‌ అవుట్‌లుక్‌లో పేర్కొంది. సర్వే చేసిన ముఖ్య ఆర్థికవేత్తలలో సుమారు 72 శాతం మంది రాబోయే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అంచనా వేశారు. దీనికి కారణాలు వాణిజ్య అంతరాయం తీవ్రతరం కావడం, పెరుగుతున్న విధానపర అనిశ్చితి, వేగంగా సాగుతున్న సాంకేతిక మార్పులు అని పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక అంతరాయం, పెరుగుతున్న విభజన ద్వారా రూపుదిద్దుకుంటున్న ఒక కొత్త ఆర్థిక వాతావరణం ఆవిర్భావాన్ని ఈ పరిశోధన ఫలితాలు సూచిస్తు న్నాయి. ఈ పరిశోధన తీవ్రమైన ప్రాంతీయ విభజనలను ఎత్తిచూపుతోంది. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ వంటి వర్ధమాన మార్కెట్‌ ప్రాంతాలు వృద్ధికి ప్రధాన చోదక శక్తులు, ఆకర్షణీయమైన కేంద్రాలుగా ఉంటాయని అంచనా వేసింది. వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం, రాజకీయంగా మారుతున్న విధానాలు, కృత్రిమ మేధస్సులో కలిగే వేగవంతమైన పురోగతి ద్వారా సంభవించే వ్యవస్థాగత నష్టాలు,  ప్రపంచ క్రమం యొక్క పునర్నిర్మాణం వంటివి ఈ దృక్పథాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాలుగా పేర్కొంది.

 డబ్య్లూఈఎఫ్ చైనాకు సంబంధించిన అంచనా మిశ్రమంగా ఉంది. ఇక్కడ ద్రవ్యోల్భణ ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ మధ్యతరహా వృద్ధి ఉంటుందని ముఖ్య ఆర్థిక వేత్తలలో 56 శాతం మంది అభిప్రాయపడు తున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వృద్ధి మరింత స్థబ్దుగా ఉంటుందని అంచనా. ఐరోపాలో 40 శాతం మంది ద్రవ్య సడలింపుతో బలహీన వృద్ధి ఉంటుందని, తక్కువ లేదా మధ్యస్థ ద్రవ్యోల్బణం (88 శాతం)తో ఉంటుందని భావిస్తున్నారు. చాలా మంది ముఖ్య ఆర్థికవేత్తలు (52 శాతం) అమెరికాలో బలహీనమైన లేదా అత్యంత బలహీనమైన వృద్ధి ఉంటుందని, అధిక ద్రవ్యోల్బణం (59 శాతం) ఉంటుందని, ద్రవ్య విధానం సడలించబడుతోందని (85 శాతం) మంది అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మరింత భిన్నమైన వృద్ధి మార్గాలలో ఉన్నాయని ముఖ్య ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి, వ్యవస్థాగత సవాళ్ల ద‌శ‌లోకి ప్రవేశించినట్లు ‘చీఫ్‌ ఎకానమిస్టుల’ ఔట్‌లుక్‌ నివేదిక పేర్కొంది.

సర్వే చేసిన‌ ఆర్థిక వేత్తలలో ఎక్కువ మంది ప్రస్తుత అమెరికా ఆర్థిక విధానం ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని చూపుతుందని భావించారు. 87 శాతం మంది ఇది వ్యూహాత్మక వ్యాపార నిర్ణయాలను నిర్లక్ష్యం చేస్తుందని, మాంద్యం ప్రమాదాలను పెంచుతుందని అంచనా వేశారు. ఉత్తర అమెరికాలో బలహీనమైన అవకాశాలు, ఆసియా-పసిఫిక్‌లో స్థితిస్థాపకత, ఐరోపాలో జాగ్రత్తగా ఉండే ఆశావాదంతో ప్రపంచ వృద్ధి దృక్పథం విభజించబడింది. దక్షిణాసియాలో బలమైన ఆర్థిక విస్తరణ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్య ఆర్థికవేత్తలు అత్యంత ఆశావాదంగా ఉన్నారు. 2025, 26 సంవత్సరాల్లో భారతదేశం వృద్ధికి ప్రాథమిక చోదక శక్తిగా ఉంటుందని ఒక కొత్త సర్వే చూపించింది. అయితే, వాణిజ్య విధాన షాక్‌లు, ఎఐ అంతరాయం కారణంగా మొత్తం ప్రపంచ వృద్ధి ఒత్తిడికి గురవుతుందని ప్రధాన ఆర్థికవేత్తలు హెచ్చరించారని ప్రపంచ ఆర్థిక వేదిక తన తాజా ‘చీఫ్‌ ఎకనామిస్ట్స్‌ అవుట్‌లుక్‌’ నివేదికలో పేర్కొంది. మొత్తంగా చూస్తే ట్రంప్‌ విధానాల వల్ల ప్రపంచ వృద్ధి ఒత్తిడికి గురవుతుందని ముఖ్య ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రధాన ఆర్థికవేత్తల దృక్పథం ప్రకారం, వాణిజ్య విధాన షాక్‌లు, ఎఐ వంటి సాంకేతికతల వేగవంతమైన మార్పుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. 2026 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అనేకమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా దక్షిణాసియా, వృద్ధికి ప్రధాన చోదకాలుగా నిలుస్తాయని భావిస్తున్నారు. 87 శాతం మంది వ్యాపారాలు వ్యూహాత్మక నిర్ణయాలను ఆలస్యం చేస్తాయని, ఇది మాంద్యం ప్రమాదాలను మరింత పెంచుతుందని అంటున్నారు. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా(ఎంఈఎన్‌ఎ), దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్‌ వెలుగు రేఖల్లా కనిపిస్తున్నట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతీ ముగ్గురు ప్రధాన ఆర్థికవేత్తలలో ఒకరు ఈ ప్రాంతాలు అత్యంత పటిష్ట వృద్ధిని సాధించనున్నట్లు అభిప్రాయపడినట్లు వెల్లడించింది. చైనా ఔట్‌లుక్‌పై మిశ్రమ స్పందన కనిపించగా.. 56 శాతం మంది చీఫ్‌ ఎకనమిస్ట్‌లు అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేసినట్లు తెలియజేసింది. ఈ నేప‌థ్యంలోంచే వచ్చే ఏడాది (2026) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డీలా పడనున్నట్లు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ తాజాగా అంచనా వేసింది.

ప్రస్తుత భౌగోళిక ఆర్థిక రాజకీయ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శాశ్వత నిర్మాణాత్మక మార్పులను సూచిస్తాయని ఎక్కువ మంది ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో నైపుణ్యాలలో 39 శాతం మార్పు చెందుతాయి లేదా కాలం చెల్లిపోతాయి. యూరప్‌ పెళుసుగా ఉన్నప్పటికీ వృద్ధిని మెరుగుపరుస్తోంది. చైనా ప్రతి ద్రవ్యోల్బణ ఎదురుగాలిని ఎదుర్కొని నిలుస్తుంది. సబ్‌-సహారా ఆప్రికా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు బలమైన ఊపును అంచనా వేస్తున్నాయి. ఆర్థికవేత్తలు మొత్తం దృక్పథం గురించి కొంత నిరాశావాదంగా ఉన్నప్పటికీ, మెజారిటీ ప్రపంచ దేశాల వృద్ధి బలహీనంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ వైవిద్యంతో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ఆశావాదాన్ని చూపిస్తున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం, కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి కీలకమైన నష్టాలకు కార‌ణం కానున్నాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం, యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం వాణిజ్య గొలుసుకు విఘాతం కలిగించాయి, క‌లిస్తున్నాయి. పర్యవసానంగా భౌగోళిక రాజకీయ విచ్ఛిన్నత, అనిశ్చితి ప్రభావంతో బలహీనమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ముఖ్య ఆర్థికవేత్తలలో ఎక్కువ మంది అంచనా వేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Leave a Reply