మాంద్యం అంటే ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన, విస్తృతమైన, సుదీర్ఘమైన తిరోగమనం, దీనిలో స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)తో పాటు ఉద్యోగాల సంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి, అమ్మకాల వంటివి తగ్గుతాయి. సాధారణంగా, వరుసగా రెండు త్రైమాసికాల పాటు జిడిపిలో సంకోచం ఉంటే దాన్ని మాంద్యం అంటారు, అయితే దీనిని అమెరికాలో ”అధికారిక మాంద్యం స్కోర్‌ కీపర్‌” అయిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌బిఇఆర్‌) నిర్వచిస్తుంది. మాంద్యం యొక్క ముఖ్య లక్షణాలు 1) ఆర్థిక వ్యవస్థలో మొత్తం పనితీరు తగ్గుతుంది. 2) ఉద్యోగాల సంఖ్య తగ్గి, నిరుద్యోగిత పెరుగుతుంది. 3) కంపెనీలు సరుకులను ఉత్పత్తి చేయడాన్ని తగ్గిస్తాయి. 4) ఈ ప్రభావం కేవలం ఒక రంగంపై మాత్రమే కాదు. ఆర్థిక వ్యవస్థలోని చాలా రంగాలపై ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు తీవ్రమైన అస్థిరతను ఎదుర్కొంటున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్సీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వికె విజయ్‌ కుమార్‌ అన్నారు. ట్రంప్‌ టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన ఈ సంక్షోభం ఎలా మారబోతోందో అంచనా వేయడం కష్టంగా మారిందన్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభావ్యతను సంవత్సరాంతానికి 60 శాతం అవకాశం ఉందని  రేటింగ్‌ సంస్థ జెపి మోర్గాన్‌ తెలిపింది. అమెరికా అధ్యకక్షుడు ట్రంప్‌ తీసుకున్న చర్యల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం ప్రమాదం ఎక్కువగా ఉందని అలియాజ్‌ ముఖ్య సలహాదారు మొహమ్మద్‌ ఎల్‌-ఎరియన్‌ హెచ్చరించాడు. మాంద్యం ప్రమాదం పెరుగుతున్న కొద్ది ఆర్థికవేత్తలు తమ క్లయింట్‌లను అప్రమత్తం చేస్తున్నారు. 

టారిఫ్‌లు ఆయా దేశాలతో పాటు అమెరికా పైనా ప్రభావం చూపిస్తాయని, దీనికి తోడు ట్రంప్‌ అనుసరిస్తున్న వలస విధానం ఉద్యోగ నియామకాలను నెమ్మదించేలా చేసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ విషయంలో ట్రంప్‌ నిర్ణయాల ప్రభావం, వ్యాపార రంగంపై భారీగా ఉందని, పెట్టుబడులు మందగించాయని, వీటన్నింటి ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతోందని జాండీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక రేటింగ్‌ కంపెనీ మూడీస్‌ చీఫ్‌ మార్క్‌ జాండీ హెచ్చరించారు. అధ్యకక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న విధాన నిర్ణయాలే ఇందుకు కారణమని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాండీ మాట్లాడుతూ.. ఇటీవల ట్రంప్‌ వివిధ దేశాలపై టారీఫ్‌లు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. టారిఫ్‌లు ఆయా దేశాలతో పాటు అమెరికా పైనా ప్రభావం చూపిస్తాయని చెప్పారు. దీనికి తోడు ట్రంప్‌ అనుసరిస్తున్న వలస విధానం ఉద్యోగ నియామకాలను నెమ్మదించేలా చేసిందని చెప్పారు. ట్రంప్‌ నిర్ణయాల ప్రభావం ఫెడరల్‌ రిజర్వ్‌ విషయంలో, వ్యాపార రంగంపై భారీగా ఉందని, పెట్టుబడులు మందగించాయని వివరించారు. వీటన్నింటి ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతోందని అమెరికన్‌ ఆర్థికవేత్త మార్క్‌ జాండీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆర్థిక మందగమనం లక్షణాలు ఇంకా బయటపడనప్పటికీ నిర్మాణ రంగంతో పాటు ఉత్పాదక రంగంలో సూచనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాలపై ట్రంప్‌ విధించిన టారీఫ్‌ల ప్రభావం అమెరికాలోని వినియోగదారుడిపై ఇంకా పూర్తిస్థాయిలో కనిపించడంలేదని జాండీ తెలిపారు.

అయితే, ఆర్థిక మందగమనం లక్షణాలు ఇంకా బయటపడనప్పటికీ నిర్మాణ రంగంతోపాటు ఉత్పాదక రంగంలో సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. వివిధ దేశాలపై ట్రంప్‌ విధించిన టారీఫ్‌ల ప్రభావం అమెరికాలోని వినియోగదారుడిపై ఇంకా పూర్తిస్థాయిలో కనిపించడంలేదని జాండీ తెలిపారు. అయినా ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందని తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మదుపరులను జాండీ హెచ్చరిస్తూ ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్‌ కూడా సురక్షితం కాదని సూచించారు. రాష్ట్రాల వారీగా చూస్తే, వ్యోమింగ్‌, మోంటానా, మిన్నెసోటా, మిస్సిస్సిప్పి, కాన్సాస్‌, మసాచుసెట్స్‌కు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోతపెట్టడంతో వాషింగ్టన్‌ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటోందని తెలిపారు. అమెరికా జిడిపి ఇప్పటికే మూడో వంతు జారుకుంది… అమెరికా జిడిపిలో మూడో వంతు (33.33 శాతం) ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుందని జాండీ తెలిపారు. ట్రంప్‌ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల ప్రభావం అమెరికాపైనే తీవ్ర ప్రభావం చూపనున్నది. అధ్యకక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త సుంకాలు ఆగష్టు 1 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అమలులోకి రావడంతో, అమెరికా ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతోంది. దేశంలో స్టాక్‌లు విస్తృతంగా పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందని తాజా గణాంకాలు వెల్లడించాయి. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనావేసిన ఆర్థికవేత్తల్లో జాండీ ఒకరు. ఆ సంక్షోభం అమెరికాతో పాటు మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి విధితమే.

గత ఆరు మాసాలుగా అమెరికన్ల కొనుగోలు శక్తి తగ్గింది … అమెరికాలో ధరలు, ముఖ్యంగా నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయని… త్వరలోనే అందుకోలేని స్థాయికి ధరలు ఎగబాకవచ్చని జాండీ అన్నారు. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ధరాభారం కారణంగా అమెరికన్ల కొనుగోలు శక్తి కూడా తగ్గిందని, వినియోగదారుల వ్యయ వృద్ధి 2008-09 ఆర్థిక సంక్షోభ కాలం నాటి కనిష్ట స్థాయికి జారుకుందన్నారు. ఈ జూలైలో అమెరికాలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరో 0.2 శాతం పెరిగి 2.7 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాదికాలంలో సూచీ 4 శాతానికి ఎగబాకవచ్చని జాండీ అంచనా వేశారు. తత్ఫలితంగా అమెరికన్ల కొనుగోలు శక్తి మరింత తగ్గిపోవచ్చని జాండీ అన్నారు. ట్రంప్‌ సుంకాల యుద్ధం ఫలితంగా… ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో అమెరికా జిడిపి 0.50 శాతం క్షీణించగా… రెండో త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో మాత్రం 3.3 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. మూడో త్రైమాసికం జూలై-సెప్టెంబర్‌లో వృద్ధి 2.7 శాతం ఉంటుందని అంచనా.  ప్రస్తుతం అమెరికా పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉంది. పెరుగుతున్న ధరలు, సుంకాలతో పెరిగిన వాణిజ్య అనిశ్చితి, తగ్గుతున్న కొనుగోళ్లు మున్ముందు త్రైమాసికాల్లో ఆ దేశ జిడిపిని మాంద్యంలోకి నెట్టవచ్చునని తెలుస్తుంది.

దేశ ఆర్థిక వ్యవస్థ వేగానికి కొలమానమైన కీలక కొత్త ఉద్యోగాల సృష్టి మందగించింది. స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛా వాణిజ్యానికి నిలయంగా ఉన్న అమెరికా ఇప్పుడు రక్షణాత్మక ఆర్థిక వ్యవస్థ వైపు మొగ్గు చూపుతోంది. ట్రంప్‌ సుంకాల బాదుడు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలను నిరాశపరచడమే కాకుండా, స్వదేశీయులను కూడా నిరాశపరిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం పెరుగుదలను ఎదుర్కొంటోంది. బలహీనపడిన జాబ్‌ మార్కెట్‌ …! ట్రంప్‌ టారిఫ్‌ యుద్ధం కారణంగా అమెరికాలో ఉద్యోగావకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. జూలైతో ముగిసిన మూడు నెలల్లో ఆర్థిక వ్యవస్థ సగటున 35,000 ఉద్యోగాలను జోడించింది, ఇది గత మూడు నెలల్లో నెలవారీగా జోడించబడిన దాదాపు 128000 ఉద్యోగాల నుండి పెద్ద మందగమనాన్ని సూచిస్తుందని అమెరికా బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ డేటా చూపించింది.

2020 నుండి యజమానులు అత్యంత నెమ్మదిగా నియామకాలు చేసుకుంటున్నారు. అమెరికా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం… గత నెలలో వ్యవసాయేతర ఉద్యోగ నియామకాలు అంచనాల కంటే తగ్గి 22 వేలకు పరిమితమయ్యాయి. అదే సమయంలో నిరుద్యోగిత రేటు 4.2 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగింది. అంతేకాదు, మే, జూన్‌ నెలలకు విడుదల చేసిన ఉద్యోగ గణాంక అంచనాలను కూడా భారీగా తగ్గించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందనడానికి ఇది సంకేతమని విశ్లేషకులు  అంటున్నారు. ట్రంప్‌ సుంకాలు అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీల లాభాలపైనా ప్రభావం చూపనున్నాయని, దాంతో కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తాయని, పర్యవసానంగా అక్కడి జాబ్‌ మార్కెట్‌ మరింత బలహీనపడే అవకాశాలున్నాయని జాండీ వివరించారు. అమెరికాలో నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా నిత్యావసరాల రేట్లు మళ్లీ పెరుగుతున్నాయని, త్వరలోనే అందుకోలేని స్థాయికీ ధరలు ఎగబాకవచ్చని జాండీ స్పష్టం చేశారు. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.

ట్రంప్‌ పెంచిన సుంకాల ప్రభావంతో 2026లో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ”ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఒఇసిడి) తెలిపింది. పారిస్‌కు చెందిన పరిశోధన సకంస్థ తన త్రైమాసిక నివేదికలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వార్షి ఆర్థిక వృద్ధి 2024లో 2.8 శాతం ఉండగా 2025లో 1.8 శాతం, వచ్చే ఏడాదిలో 1.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఒఇసిడి ఈ సంవత్సరం 1.6 శాతం, 2026లో 1.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 2024లో అమెరికా ఆర్థిక వృద్ధిరేట్‌ 2.8 శాతం ఉండగా, 2025లో అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.9 శాతం వృద్ధిని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని, అయితే ఐఎంఎఫ్‌ తన వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ లలో ప్రచురించిన అంచనాలు అమెరికా ఆర్థిక మందగమనం, వినియోగం మందగించడం, కార్మిక మార్కెట్‌ మృదువుగా మారడంతో వృద్ధి మితంగా ఉంటుందని భావించింది. ఒఇసిడి తన నివేదికలో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని పేర్కొంది.

బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు పంతొమ్మిదవ శతాబ్దంలో కూడా, ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత ఆర్థికవేత్తల ప్రాథమిక ఆలోచనలను మార్చిన తర్వాత దేశాల మధ్య వాణిజ్యం ఆయా దేశ ప్రయోజనాలను పెంచిందని ఆడమ్‌ స్మిత్‌ వాదించాడు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నాటికి ఆర్థికవేత్తలు అన్ని వాణిజ్య దేశాల సంక్షేమంలో పెరుగుదలకు దారితీసే తులనాత్మక ప్రయోజన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు. కానీ అమెరికన్‌ ఒంటరివాదులు చాలాకాలం తరువాత కూడా దీనికి విరుద్ధంగా నమ్మారు. 1920ల చివరిలో స్మూట్‌-హాలీ చట్టం ప్రకారం అన్ని దిగుమతులపై అధిక సుంకాలను విధించడానికి అమెరికా సంకల్పించింది. 1930లో మహా మాంద్యానికి ప్రధాన కారణం ధరలు పెరగడానికి, డిమాండ్‌ తగ్గడానికి దారితీసిన సుంకాలు మొత్తం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడానికి దోహదపడ్డాయనేది నిర్వివాదాంశం. అయితే ట్రంప్‌ ఇప్పుడు విధించిన సుంకాలు చివరికి అమెరికా, ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. కానీ ఈ సుంకాలు, వాటి ప్రభావాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. 

Leave a Reply