అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, దేశీయంగా వ్యవస్థాగతమైన సమస్యల వల్ల ఇటీవలి సంవత్సరాల్లో డాలర్‌తో భారత రూపాయి మారకపు విలువ తగ్గుతూ వస్తోంది. ఈ నెలలోనైతే దాని విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇప్పుడు ఒక డాలరు కావాలంటే 90 రూపాయలకు పైగా వెచ్చించాలి. రూపాయి విలువ పడిపోవడం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలనే కాదు భారతీయ విద్యార్థులనూ ఇబ్బందు ల పాల్జేస్తుంది. విదేశీ చదువుల కోసం విద్యార్థులకు అయ్యే వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. డాలర్‌కు అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ హోదా ఉంది. దాని విలువ స్థిరంగా కొనసాగుతుండటం మరో అంశం. బంగారం, చమురుతో పాటు ఆహారధాన్యాలు, ముడి ఖనిజాలు తదితరాల ఎగుమతి, దిగుమతు లు 88 శాతం డాలర్లలోనే జరుగుతున్నాయి. చమురు ఎగుమతులకు డాలర్లలో చెల్లింపులను స్వీకరిస్తు న్నందు వల్ల పెట్రోడాలర్‌ అనే పదబంధం ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి దేశానికీ చమురు తప్పనిసరి అవసరం కాబట్టి అంతర్జాతీయ వాణిజ్యానికి పెట్రో డాలర్‌ ఆయువుపట్టు అయ్యింది.

”డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతున్నది. మన్మోహన్‌ బలహీన ప్రధాని, మేము అధికారంలోకి వస్తే డాలర్‌తో సమానంగా రూపాయి విలువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రూపాయికి, రెండు, మూడు డాలర్స్‌ వచ్చే రోజులొస్తాయిస‌స  అని 2011లో బిజెపి అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ చెప్పిన మాటలివి. ఆయనే కాదు, ఆ పార్టీ నేతలంతా 2014 ఎన్నికల వరకు రూపాయి పతనాన్ని కాంగ్రెస్‌పై దాడికి ఆయుధంగా వాడుకున్నారు. మరి ఇప్పుడు? మోడీ దేశ ప్రధాని అయిన ఈ పదకొండేం డ్ల కాలంగా రూపాయి బలహీనపడుతూనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే ప్రమాదకరంగా పతనమవుతున్న ది. ఇంత జరుగుతున్నా కేంద్ర సర్కార్‌ చర్యలెందుకు చేపట్టడం లేదు? దేశ ఆర్థిక వ్యవస్థ స్థైర్యాన్ని కొలి చే కీలక సూచీలో ఒకటైన భారత కరెన్సీ విలువ కొద్ది నెలలుగా నిరంతర పతన దిశగా పోతున్నది. ఇది ఆర్థిక నిపుణులను మాత్రమే కాదు, సామాన్య ప్రజలను కూడా ఆందోళనకు గురిచేస్తున్న‌ది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ల ఒత్తిడికి, దేశీయ విధానపరమైన వైఫల్యాలకు, రాజకీయ – ఆర్థిక అనిశ్చితులకు రూపాయి బలవుతుండటం స్పష్టంగా కనిపిస్తున్న‌ది. 

భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందన్న మోడీ సర్కార్‌ గొప్పలకు భిన్నంగా అంతర్జాతీయ మార్కె ట్లో రూపాయి విలువ అధోపాతాళానికి పడిపోయింది. రూపాయి రోజు రోజుకు క్షీణిస్తూ దేశ చరిత్రలోనే ఎప్పు డూ లేని స్థాయిలో తాజాగా డాలర్‌తో రూపాయి 90 దాటింది. భారత కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూఎస్‌ డాలర్‌కు డిమాండ్‌ పెరుగడంతో రూపాయి జీవితకాలపు కనిష్ట స్థాయికి ప‌డిపోయింది. మోడీ 2014లో అధికారం చేపట్టే నాటికి డాలరుతో రూపాయి మారక విలువ రూ. 60. 34 ఉండగా డిసెంబర్‌ 4 నాటికి ఆల్‌ టైం హైకి 90.43కి పడిపోయింది. రూపాయి విలువ పతనం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ త్వరలో రూ.90.70 మార్కును తాకుతుందని అంచనా. సహజంగా అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడల్లా డాలరుకు గిరాకి పెరుగుతుంది.  అందుకే అమెరికా డాలర్‌ ముందు భారతీయ రూపాయి ఏమాత్రం నిలబడ‌లేకపోతున్నది. ఫలితంగా చారిత్రక కనిష్టాలకు దిగజారుతున్న దేశీయ కరెన్సీతో ద్రవ్యోల్బణం విజృంభించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుండగా… పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యుడి నెల‌వారీ బడ్జెట్‌ తలకిందులు కావడం ఖాయం.

రూపాయి విలువ పడిపోవడం అనేది కేవలం గణాంకం కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా సామాన్య ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే రూపాయి విలువ ప‌త‌నంతో మనం దిగుమతి చేసుకునే అనేక వస్తువుల ధరలు పెరుగుతాయి.  ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్‌ విలువ అనూహ్యంగా బలపడటమే రూపాయి బలహీనపడటానికి ముఖ్య కారణంగా ఉంది. అమెరిక న్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో, పెట్టుబడిదారులు అధిక రాబడి, భద్రత కోసం తమ పెట్టుబడులను తిరిగి అమెరికన్‌ మార్కెట్లలోకి తరలిస్తున్నారు. దీని కారణంగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) భారత మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులను వెనక్కి తీసు కుంటున్నారు. డాలర్‌ డిమాండ్‌ అధికంగా ఉండటం రూపాయి బలహీనతకు ప్రధాన కారణమని, భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరితే రూపాయి మరింత స్థిరపడే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.  ఈ విధంగా భారత ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లపై ఒత్తిడి పెరిగి, మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో రూపాయి విలువ క్షీణత వేగవంతమవుతున్న‌ది.

దీనికితోడు, ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అధిక స్థాయిలో ఉండటం రూపాయి పతనానికి మరో పెద్ద దెబ్బ. భారత్‌ తన మొత్తం ముడిచమురు అవసరాలలో దాదాపు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. చమురు కొనుగోలుకు భారీగా డాలర్లను ఖర్చు చేయాల్సి రావడంతో, మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగి, రూపాయి విలువ క్షీణిస్తోంది. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం వలన కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతున్న‌ది. భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవడం కూడా రూపాయి మీద ప్రతికూల ప్రభావం చూపుతోందని ట్రేడర్లు అంటున్నారు. చైనా తన కరెన్సీ అయిన యువాన్‌ విలువను తగ్గించడం ద్వారా తన వస్తువులు అంతర్జా తీయ మార్కెట్‌లో చౌకగా లభించేలా చేసి ఎగుమతులను పెంచుకుంటున్న‌ది. ఇలాంటి విధానాన్ని అనుసరించడం వల్ల దేశీయంగా కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి.  భారత రిజర్వ్‌ బ్యాంక్‌ కేవలం రూపాయి విలువలో తీవ్రమైన హెచ్చుతగ్గులను నియంత్రించడానికి మాత్రమే అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటుంది. ముఖ్యంగా, మార్కెట్‌ శక్తులే కరెన్సీ విలువను నిర్ణయిస్తాయి అనే విధానాన్ని భారత్‌ పాటిస్తుంది. రూపాయి పడిపోవడం అనేది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది తప్ప, ఇది ఒక వ్యూహం గా పరిగణించబడదు.

రూపాయి పతనానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది- అమెరికాతో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు. భారత-అమెరికా వాణిజ్య చర్చలు విఫలం కావడం, భారతీయ దిగుమతుల పై అమెరికా 50 శాతం దాకా సుంకాలు విధించడంతో బిజినెస్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. రెండు- ద్రవ్యో ల్బణం సాపేక్షంగా స్థిరంగానే ఉండి, జిడిపి ఊర్ద్వముఖంగా చూస్తున్నప్పటికీ, విదేశీ పెట్టుబడుల పలా యనం రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నది. మూడు- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) భారత ఆర్థిక వ్యవస్థను స్థిరమైన అనే వర్గీకరణ నుంచి తొలగించి, తాపీగా కదులుతున్న అనే జాబితాకు మార్చ డం ఒక కార‌ణంగా క‌నిపిస్తున్న‌ది. ఇది అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టను మసకబార్చి పలుకుబడిని మరింతగా తగ్గించింది. బ్లూంబర్గ్‌ ఈ ఏడాది ఆసియాలో అత్యంత దారుణమైన పనితీరు ప్రదర్శించిన ‘కరెన్సీ’గా రూపాయిని పేర్కొనడం గమనార్హం. ద‌శాబ్దకాలం పైగా కొనసాగుతున్న ఎన్డీయే పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైందనడానికి రూపాయి విలువ పతనమే నిదర్శనం. దిగుమ తులను తగ్గించుకునేలా స్వదేశీ వనరులను, స్థానిక ఉత్పత్తిని పెంచుకోవడంలో ఘోర వైఫల్యాన్ని ఇది సూచిస్తున్నది.

రూపాయిని డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రగల్బాలు పలుకు తుంటే, మరోవైపు ఫోరెక్స్‌ మార్కెట్‌లో రూపాయి మారకపు విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పతనమ వుతున్నది. ఈ సంవత్సరంలో ఇప్పటికే, రికార్డు స్థాయిలో 4.3 శాతం తగ్గుదల నమోదైంది. ఈ పతనాన్ని చాలామంది కేవలం వ్యాపార, వాణిజ్య కోణంలోనే చూడడం దురదృష్టకరం. దేశ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ విలువ భారీ పతనాన్ని ఎవరు భరిస్తారనే ప్రశ్న తెరపైకి రాకుండా ధనిక కార్పొరేట్‌ రంగం నిరంతరం ప్రయత్నిస్తునే ఉంటుంది. సమస్యను సృష్టించిన వారు నిజాలు ఎందుకు చెప్తారు. రూపాయి విలువ పతన భారాన్ని ప్రధానంగా భరించేది శ్రామికులు, చిన్న ఉద్యోగులు, రోజు వారి కూలీలు, స్వయం ఉపాధి చేసుకునే వర్గాలే. ఇది ఆర్థిక సిద్ధాంతాలపై ఆధారపడిన శాస్త్రీయ అధ్యయనం. భారత్‌ సహా ప్రపంచం లోని అనేక దేశాల దయనీయ ముఖచిత్రం. రూపాయి మారకపు విలువ పతనమైతే, అంతర్జాతీయ మార్కెట్‌లో దేశ కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. దిగుమతుల రంగం ప్రత్యక్షంగా ప్రభావితమవుతుంది.

ఆధునిక ఆర్థిక వ్యవస్థలో దాదాపు అన్ని రకాల ఉత్పత్తి, సేవా రంగాలకు ఇంధనం అత్యవసరం. రవాణా,  వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి తదితర అవసరాలకు ఇంధనం కీలకం. కాబట్టి, ఇంధన ధర పెరిగితే ఆ ప్రభావం అన్ని ప్రధాన రంగాలపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయ, ఫ్యాక్టరీ ఉత్పత్తుల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. వస్తుసేవలకు డిమాండ్‌ తగ్గడం ఉద్యోగ, ఉపాధి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కార్మికులకు ప్రతిఫలాన్ని డిమాండ్‌ చేసే పరిస్థితి ఉండదు. తక్కువ ఆదాయం.. తక్కువ కొనుగోళ్లు.. వస్తుసేవలకు తక్కువ డిమాండ్‌.. వెరసి తక్కువ ఉత్పత్తి.. ఇదో విషవలయం. ఉపాధి కోల్పోయేది, శ్రమకు తగినంత ప్రతిఫలాన్ని పొందలేక, వచ్చినదానితోనే రాజీపడే ది కూడా శ్రామికవర్గమే. రూపాయి పతనం వల్ల కలిగే ప్రభావాలు ముఖ్యంగా సామాన్య ప్రజల జీవితంపై ద్రవ్యోల్బణం రూపంలో కనిపిస్తాయి. 

చమురు ధరల పెరుగుదల రవాణా ఖర్చులను పెంచి, చివరికి అన్ని నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతుంది. తద్వారా సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. మరో ముఖ్య ప్రభావం ఏమిటంటే  విదేశా ల నుంచి వస్తువుల కొనుగోలు చేయడానికి లేదా సేవలను పొందడానికి ఎక్కువ రూపాయిలు చెల్లించాల్సి వస్తుంది. దీనితో పాటు, విదేశీ విద్య, ప్రయాణం కూడా భారం అవుతాయి. విదేశాల్లో చదువుతున్న విద్యా ర్థులు  ఫీజులు, జీవన వ్యయం కోసం ఎక్కువ రూపాయిలు డాలర్‌గా మార్చుకోవాల్సి వస్తుంది. అలాగే, విదేశీ పర్యటనలు ప్లాన్‌ చేసుకునే వారికి కూడా ఖర్చులు అమాంతం పెరుగుతాయి. ఈ స్థితి మారాలంటే ప్రభుత్వం ఎగుమతులను పెంచడానికి, దిగుమతులను తగ్గించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దేశంలో నే ఉత్పత్తి పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. దీనికితోడు, విదేశీ పెట్టు బడులను ఆకర్షించడానికి, వాటిని దేశంలోనే నిలపడానికి స్థిరమైన, పారదర్శకమైన ఆర్థిక విధానాలను అమలు చేయాలి. రిజర్వ్‌ బ్యాంక్‌ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను అవసరమైనప్పుడు ఉప యోగించి, మార్కెట్‌లో డాలర్‌ సరఫరాను పెంచడం ద్వారా రూపాయికి మద్దతు ఇస్తుంది.

రూపాయి దెబ్బకు సామాన్యుడి బడ్జెట్‌ తలకిందులవుతున్నది. సగటు మనిషి జేబుకు చిల్లులు తప్ప డం లేదు. ఆదాయం అంతంతమాత్రంగా ఉండే పేద, మధ్యతరగతి ప్రజానీకం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నెలనెలా పెరుగుతూపోతున్న ఖర్చులు.. కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని దుస్థితికి నెడుతున్నా యి. అసలే మార్కెట్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నానాటికీ కరువైపోతున్నాయి. కొత్త పుంతలు తొక్కుతు న్న సాంకేతిక పరిజ్ఞానం.. మానవ వనరుల అవసరాలను ప్రతి రంగంలోనూ పరిమితం చేస్తున్నది. దీంతో పెరిగే ఇంటి నిర్వహణ వ్యయం భారం.. భారతీయులకు పెద్ద తలనొప్పిగా పరిణమిస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించకపోతే సమీప భవిష్యత్తులో పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుం దని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తుండటం గమనార్హం. ప్రజా పొదుపు, పెట్టుబడులపైనా దుష్ప్రభావం చూపు తుంది. రూపాయి నష్టాలు దేశంలోని సామాన్యులకు ఆర్థికంగా కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. భారత చరిత్రలోనే తొలిసారి 90 స్థాయిని మించి మారకపు విలువ క్షీణించటం ఆందోళనకరం.

ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి పతనం.. దేశంలో ధరలను ఎగదోస్తుంది. విదేశాల నుంచి వచ్చే ప్రతీ వస్తూత్పత్తి, ముడి సరుకుల దిగుమతులకు అధిక మొత్తంలో చెల్లించాల్సిన దుస్థితి తలెత్తుతుంది. దీనివల్ల మార్కెట్‌లో ఆయా ఉత్పత్తులు, సేవల ధరలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలు 80 శాతం వరకు ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుతోనే తీరుతు న్నాయి. ఈ క్రమంలో రూపాయి బలహీనత క్రూడాయిల్‌ను ఖరీదెక్కిస్తుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని, దీన్ని తగ్గించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ కఠిన ద్రవ్య వైఖరిని అవలంభించాల్సి ఉంటుందని  అంటున్నారు. ఇదే జరిగితే వడ్డీరేట్లు పెరిగి రుణ లభ్యత కష్టతరంగా మారుతుంది. రూపీకి ఇబ్బందికరంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలను చక్కదిద్దడం మన చేతుల్లో లేదు కాబట్టి… ఆర్బీఐ జోక్యంతోనైనా రూపాయిని బలపర్చాల్సిన అవసరం ఉందని ఇప్పుడు మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, అలాగే బంగారం-వెండి దిగుమతులు అకస్మాత్తుగా పెరగడం రూపా యి మీద మరింత ఒత్తిడి పెర‌గ‌డంతో సెప్టెంబర్‌లో తరుగుదల తీవ్రంగా కనిపించింది. రూపాయి విలువ లో తీవ్రమైన పతనాన్ని గమనించిన భారత రిజర్వ్‌ బ్యాంక్‌ మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి కొన్ని చర్యలు తీసుకుంటోంది. రూపాయి విలువ పడిపోతున్న ప్రతిసారీ, రిజర్వ్‌ బ్యాంక్‌ తన వద్ద ఉన్న భారీ విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఉపయోగిస్తోంది. అంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లను విక్ర యించి, రూపాయిని కొనుగోలు చేస్తోంది. దీని ద్వారా డాలర్‌ సరఫరాను కృత్రిమంగా పెంచి, డాలర్‌కు ఉన్న డిమాండ్‌ను తగ్గించి, రూపాయి విలువ మరింత దిగజారకుండా రక్షిస్తోంది. సెప్టెంబర్‌లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) దాదాపు 8 బిలియ న్‌ డాలర్లు మార్కెట్‌లో విక్రయించింది. సెప్టెంబర్‌లో రూపాయి 88.80 రూపాయల చరిత్రాత్మక కనిష్టాన్ని తాకడంతో, కరెన్సీ స్థిరత్వం కోసం ఈ చర్య చేపట్టింది. ఇదే తరహా ఒత్తిడుల మధ్య ఆగస్టులో కూడా ఆర్‌బిఐ 7.7 బిలియన్‌ డాలర్లను విక్రయించింది. 

రూపాయి ఆకస్మిక మార్పులను నియంత్రించేందుకు ఆర్‌బిఐ స్పాట్‌ మార్కెట్‌తో పాటు ఫార్వర్డ్‌ మార్కెట్‌లో కూడా జోక్యం చేసుకుంటోంది. భారత ఎగుమతులపై పెరిగిన శిక్షాత్మక సుంకాలు, ఇతర మార్కెట్‌ అంశాల కారణంగా ఇటీవల రూపాయి మీద ఒత్తిడి కొనసాగుతుండటంతో ఈ జోక్యాలు పెరిగా యి. అయితే, ఈ చర్యలు కేవలం తాత్కాలికంగా ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి, ఎందుకంటే డాలర్లను విక్రయించడం వలన దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతాయి. ప్రభుత్వం కూడా రూపాయి పతనం యొక్క తీవ్రతను తగ్గించడానికి కొన్ని కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా, ఎగుమతిదారులు, విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేయడానికి నిబంధనలను సడలిస్తోంది. ప్రవాస భారతీయులు భారత్‌లో డాలర్ల రూపంలో డిపాజిట్లు చేస్తే వారికి అధిక వడ్డీ రేట్లను అందించడం వంటి చర్యలను ప్రోత్సహించడం ద్వారా, దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది.

రూపాయి విలువలో స్థిరత్వాన్ని సాధించాలంటే, కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపోదు, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. ఎగుమతులు పెంచడం, కరెంటు ఖాతా లోటును తగ్గించడం వంటి శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించడం ద్వారానే రూపాయి విలువ దీర్ఘకాలంలో స్థిరత్వాన్ని సాధించగలదు. దీనికి ప్రధాన మార్గం ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయడం.  దిగుమతి చేసుకునే వస్తువులను దేశంలోనే తయారు చేసుకుంటే,  దిగుమతులపై ఆధారపడటం తగ్గి వర్తమాన ఖాతా లోటు తగ్గుతుంది. కరెన్సీ విలువ పడిపోవడం సాధారణ ఆర్థిక సంఘటన కాదు, సామాన్య వర్గాల జీవన ప్రమానా లు తగ్గిపోవడం వారి స్వయంకృతం అంతకంటే కాదు. ఈ దుస్థితి సాధారణ ఆర్థిక చక్రం కాదు… వ్యవస్థీ కృత అన్యాయం, పెట్టుబడిదారీ వర్గాలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాల నిర్వాకం, పాలకుల విధానాల వైఫ ల్యమే ఆర్థిక వ్యవస్థలోని అసమానతకు కారణం. దేశ సంపదను సృష్టించేది శ్రామికవర్గమే అయినప్పటికీ, ఆ సంపద విలువను కార్పొరేట్‌ వర్గాలు నిర్ణయిస్తాయి. ఉత్పత్తి వ్యయం పెరిగితే కంపెనీలు వస్తు, సేవల ధరలు పెంచుతాయి. స్వదేశంలోనే పారిశ్రామిక ఉత్పత్తిని పెంచి, విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించాలి. దానివల్ల డాలర్‌కు గిరాకీ తగ్గి వాణిజ్య లోటు దిగివస్తుంది. సౌర, పవన తదితర పున రుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించాలి.

రూపాయి బలపడాలంటే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ అనుకూల ప్రపంచీకరణ విధానాలను విడనాడా లి. దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వ రుణ సదుపాయం కల్పించాలి. ఇటీవల అన్ని రకాల పంటలు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ప్రకటించడమే కాకుండా అమలు చేసే బాధ్యత తీసుకోవాలి. ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వ పరిశ్రమల్లో ఉత్పత్తి చేసి సరసమైన ధరలకు రైతులకు అందుబాటులో ఉంచాలి. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలి. తద్వారా వ్యవసాయం అభివృద్ధి చెంది గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవ స్థకు స్థిరమైన పునాదిని ఏర్పాటు చేస్తుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చి ఉత్పత్తులను పెంచడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విద్య, వైద్యంతో పాటు అనేక సేవా రంగాలను ప్రభుత్వం నిర్వహించాలి. కార్పొరేట్‌ కంపెనీలు, సంపన్నుల కోసం ట్రంప్‌ ముం దు సాగిలపడుతున్న ప్రస్తుత పాలకులు ఈ విధానాలను అమలు చేయలేరు. కావున రూపాయి బలపడా లన్నా, ప్రస్తుత విధానాలు మారాలన్నా పాలకులపై సంఘటితంగా వత్తిడి తేవాల్సి ఉంటుంది.

Leave a Reply