వాళ్ళిద్దరిది ఒకే మాట. ఒకే ఆలోచన. ఒకే తీరు. ఒకే సిద్ధాంతం. ఒకే స్వప్నం. ఒకే వ్యక్తిత్వం. ఒకే పోరాటం. ప్రజల కోసమే పుట్టిన త్యాగమూర్తులు వాళ్ళు.
వాళ్లే జెన్నీ,కార్ల్ మార్క్స్.

జెన్నీ తండ్రి లుడ్విగ్ వాన్ వెస్ట్ ఫాలెన్. జెన్నీ తల్లి ఎంతో ప్రేమస్పదమైన హృదయం ఆమెది. జెన్ని సోదరుడు హెడ్గార్.హెడ్గార్ కు సహ పాఠకుడే మార్క్స్. సోదరుడి మూలంగానే మార్క్స్ కు,మరియు జెన్నీకి మధ్య బాల్యం నుండే స్నేహం ఏర్పడింది.
కాలం గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ మరింత సన్నిహితులయ్యారు. కాలం అనేది మనుషుల మధ్యన ప్రేమను, మానవత్వాన్ని, జాలి, దయను, కలిగిన వ్యక్తులను మనకు సమీపంగా తెస్తుందేమో.
మరోవైపు మార్క్స్ తండ్రి హెన్రిచ్ గొప్ప విజ్ఞాని. న్యాయవాది. ఆర్థికంగా రెండు కుటుంబాల మధ్య ఎక్కువ తేడా ఉంటుంది.
మార్క్స్ ది వినూత్న వ్యక్తిత్వం. ఎన్నో అవరోధాలు దాటాడు జీవితంలో. మార్క్స్ లోని మేధావినే జెన్నీని ఆకర్షించింది.ఆయన ఒక మహోన్నత విప్లవకారుడు.వారిద్దరూ ఒకరిలో ఒకరు అంతర్భాగమైనారు.
మార్క్స్ చదువులు ముగిశాయి. డాక్టరేట్ పొందాడు కానీ చుట్టూ ప్యూడల్ వ్యతిరేక పోరాటం వలన
ఏ యూనివర్సిటీలోనూ మార్క్స్ స్థానం దొరకలేదు. అందుకే ఆయన తను ప్యారిస్ ను కార్యక్షేత్రంగా ఎన్నుకున్నాడు. జెన్ని ఒక అందమైన, మానవత్వం గల మహిళ. మంచి వ్యక్తిత్వం, మంచి మాట తీరు, మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు,అందరి పట్ల అనురాగం, ప్రేమ, కరుణ, స్నేహభావం కలిగిన స్త్రీ తను.
ఆమెకు సంగీతంలో, నృత్యంలో, ప్రతిభ ఉంది. బాల్యం నుంచే వాళ్ళిద్దరి స్నేహం ఉండడం వల్ల చనువు ఏర్పడింది.ఇక ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంత స్థితికి వచ్చారు.వారి ప్రేమ విషయం ఇద్దరి కుటుంబాలలో ఒకే ఒక్క వ్యక్తికి మాత్రమే తెలుసు.అతనే మార్క్స్ తండ్రి. ఆయన కారణంగానే చివరకు 1843 జూన్ 19వ తేదీన ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ఆ ప్రేమికులు వివాహంతో ఒకటయ్యారు.
వీరు ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. జెన్ని ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. కాని మార్క్స్ ఆర్థికంగా పేదవాడు. అదే సమయంలో జెన్ని గర్భవతిగా అయింది. ఆ సమయంలో వారిని రైన్ ల్యాండ్ లోని స్నేహితులు ఆదుకున్నారు. మార్క్స్ వర్గ పోరాటంలోకి వచ్చాడు. అంటే సమాజంలోని సంపద కొందరి చేతిలో ఉండటం, ముఖ్యంగా ధనిక పేద, భూస్వామి కార్మికుడు, వీళ్ళ మధ్య జరిగే నిరంతర సంఘర్షణనే వర్గ పోరాటం అంటే..
ప్రభుత్వం వీరిని ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఫ్రాన్స్ ను వదిలి పోవాలని మార్క్స్ను కు ఆదేశాలు అందాక, వాళ్లు బ్రసెల్స్ చేరుకున్నారు.
మార్క్స్ జెన్నిలకు 1845లో లారా, మరియు 1846లో కుమారుడు హెడ్గార్ పుట్టడంతో కుటుంబం విస్తరించింది. ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగాయి.
1848 ఫిబ్రవరి చివరి నాటికి “కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక” ప్రచురణ ప్రారంభమైంది. అదే సమయంలో మార్క్స్ తండ్రి కూడా మరణించాడు. అది ఆయనను ఎంతో మానసిక క్షోభకు గురిచేసింది. ఆయన ఆస్తికి వారసుడుగా మార్క్స్ కు,ఎంతో కొంత అందింది. మరో వైపు యూరప్ లో ప్రజా తిరుగుబాట్లు జయప్రదమైనవి. వీటిలో మార్క్స్ పాత్ర ఎంతో ఉంది. ఆ ఆదరణ ఫలితంగానే ఫ్రెంచి తిరుగుబాటుదారులు
ఆ దంపతులను తిరిగి ఫ్రాన్స్ కు ఆహ్వానించారు.కానీ బెల్జియం ప్రభుత్వం తన తలుపులను మూసింది. బెల్జియం పోలీసులు 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని వారిని ఆదేశించారు. గడువు తీరక ముందే,పోలీసులు ఇంట్లో చొరబడి, మార్క్స్ ను అరెస్టు చేశారు. జెన్నీ డెమోక్రటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జుటేరాoడ్ ను కలిసి మార్క్స్ను ను విడుదల చేయించమని కోరింది. మార్క్స్ తో మాట్లాడదలచుకుంటే తమతో రమ్మని అడిగారు పోలీసులు. పోలీసు కార్యాలయానికి తీసుకువెళ్లి జైలుకు తరలించారు.అదే రాత్రి ఆమెను వ్యభిచారులతో కూడిన ఒక చీకటి కొట్లో బంధించారు. మరునాడు ఉదయం 11 గంటలకు ఆమెను బయటికి తీసుకొచ్చారు. ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ లోపున బెల్జియం ప్రభుత్వం ఇచ్చిన గడువు దాటిపోయిందిమ్ దాంతో కనీసం కట్టుబట్టలు కూడా తీసుకోకుండానే వారు ప్యారిస్కు పయనమై పోయారు. ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్నారు.

“రూడేఅల్లి” అనే ఒక ప్రాంతంలో చిన్న ఇల్లు తీసుకున్నారు.ఇంకా ఇల్లు కూడా సర్దుకోకముందే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు అధికారి వచ్చి, మార్క్స్ను ప్యారిస్ వదిలి, తేమగా ఉండే బ్రిటాని జిల్లాలో మాత్రమే ఉండాలి అని ఆదేశించాడు. అప్పటికే వారి పిల్లలకు అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి.
వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న జెన్నీ, మార్క్స్ కలుసుకొని సెప్టెంబర్ నాటికి ముగ్గురు లండన్ చేరారు. నవంబర్ 5 న వారికి హెన్రిచ్ పుట్టారు
ఇంతలో కమ్యూనిస్టు లీగ్ను నాశనం చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేసు విచారణ 5 వారాలు కొనసాగింది. ఈ సమయంలో మార్క్స్ ఎంతో ఉద్వేగం అనుభవించాడు. అప్పుడే భార్యకు జబ్బు చేసింది. లేంచెన్ కు ఏదో నరాల జ్వరం సోకింది. మందులు కొనేందుకు వారి వద్ద డబ్బు లేదు, డాక్టర్ను పిలవలేరు. గత ఎనిమిది పది రోజుల నుండి వారి భోజనం రొట్టె, బంగాళదుంప మాత్రమే. పైగా ఇంగ్లాండ్ వాతావరణానికి జబ్బు పడ్డారు. చివరికి సంవత్సరం నిండిన హెన్రిచ్ గ్రమెడో 1850 నవంబర్లో ప్రాణం విడిచింది. మొదటి బిడ్డ మరణం మనసు నుండి ఇంకా తొలగనేలేదు. ఆ కన్నీరు మహాసముద్రంలో ముంచేసింది మరో ఏడాదిన్నరకు చిన్న కూతురు ఫ్రాన్సిస్క కూడా మరణించింది. జెన్నీ దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. ఫ్రాన్సిస్కా మరణించిన మూడేళ్లు పూర్తికాకముందే వారి ముద్దుల కొడుకు హెడ్గార్ కూడా మరణించాడు.
నిజం కదా! తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తే, ఆ బిడ్డను తన ప్రాణం వల్లే కాపాడుకుంటుంది.అలాంటిది వరుసగా ముగ్గురు పిల్లల మరణాన్ని జెన్ని ఇలా తట్టుకున్నది అనే ప్రశ్న నా లోపల ఇంకా మెదులుతునే ఉంది.
ఆ బాధను ఆ దంపతులు తట్టుకోలేకపోయార. మాన్చేస్టర్ కు వెళ్లి ఎంగెల్స్ తో కొంతకాలం గడిపి సేద తీరారు.లండన్లో నివాసం ఏర్పరచుకున్న తర్వాత వాళ్లు పడిన బాధలు దారుణమైనవి.దారిద్య్రం ఆమెను శారీరకంగా, మానసికంగా, కుంగదీసింది. ఏడవ బిడ్డ పుట్టింది. పుట్టగానే మరణించింది. తను 9 నెలల గర్భంలో మోసినందుకు కూడా ఫలితం లేకుండా పోయింది. పాపం వరుసగా బిడ్డలు చనిపోవడంతో ఆమె మానసిక వేదనకు గురైంది. ఎంతో ధైర్యం గల ఆమె సైతం చలించిపోయింది.ఆమెకు “ఇన్ సానియా” వ్యాధి పదేపదే సోకింది. మార్క్స్ రాసిన కరపత్రం అచ్చుకు సిద్ధం చేసేందుకు ఆమె రాత్రింబవళ్లు కృషి చేసింది. అది పూర్తయ్యే నాటికి ఆమె కూడా అనారోగ్యం పాలయ్యింది. ఆ జబ్బు మసూచిగా మారింది. ఆమెకు అప్పటికే రెండుసార్లు టీకాలు వేయించారు ఆ అంటూ వ్యాధి నుండి పిల్లలను దూరంగా ఉంచడానికి వారిని మరో ఇంటికి పంపారు మార్క్స్క. అది మర్క్స్క్ కు అతి భయంకరమైన కాలం. వ్యాధి సోకుతుంది అనే భయం కూడా లేకుండా మార్క్స్ జెన్నీకి సేవలు చేశాడు. క్రిస్మస్ వరకు పిల్లలు వారిద్దరి వద్దకు రాలేదు. పిల్లలు దగ్గర లేకపోవడం వల్ల ఎంత వేదన పడ్డారో… ఆ తరువాత అందరూ కలిసి కొంత కాలం ఉన్నారు. కానీ జెన్ని కొంచెం కోలుకోగానే మార్క్స్ జబ్బు పడ్డాడు. ఆందోళనలు కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, బాధలు, ఆయనను అనారోగ్యం పాలు చేశాయి.
ఇంత దారుణమైన పరిస్థితుల్లోనూ మార్క్స్ ఎన్నో రచనలు చేశాడు.జెన్నీ అతనికి ఎన్నో సహకారాలు అందించింది. ఆమె తన ఇంట్లో విశ్వసించదగిన ప్రతి కామ్రేడ్కు ఆదరణ ఉండేది. ఆమె అసాధారణమైన గుణగణాలు కలిగిన వ్యక్తి. ప్రేమాస్పదురాలు. గర్వం లేదు. బెట్టు లేదు. ఆమెను చదువుతుంటే, మనకు మన అమ్మ ముందూ,అక్క ముందూ ఉన్నట్లు ఉంటుంది. ఆమె ఉన్నత కుటుంబంలో పుట్టింది కానీ, ఆమెకు మానవతా విలువలు తెలుసు. సాంఘిక భేదాలు గానీ వర్గ భేదాలుగాని, ఆమెకు లేవు. ఆమె తన ఇంటికి వచ్చే కార్మికులను సైతం గౌరవించింది. మర్యాదలు చేసింది. ఆమె ఉన్నత కుటుంబీకురాలు అంటే ఎవరూ నమ్మలేదు. ప్రతి ఒక్కరూ ఆమెను తల్లి లాగా, తోబుట్టు లాగా భావించారు. కానీ ఆమె కూడా జబ్బు పడ్డది. దానిని క్యాన్సర్ గా భావించారు.1850 వేసవికాలంలో ఆమె జబ్బు అంతకంతకు ముదిరిపోయింది. జులైలో ఆమెను మెల్బోర్న్ కు తీసుకువెళ్లారు. ఆ జబ్బు నయం కాదని, ఆమెకు కూడా తెలుసు. ఆమె అనారోగ్యం మూలంగా పడిన ఆవేదన చాలా ఎక్కువే.ఆమె ముఖం తెల్లబారిపోయింది. కండ్ల కింద నలుపు చారలు వచ్చాయి. ఇక మాట్లాడలేని సమయంలో మార్క్స్ చేతిని తన చేతిలోకి తీసుకొని, “గుడ్ బాయ్”అన్నది. అవే ఆమె చివరి మాటలు. చివరిదాకా వారు కలిసి మెలిసి ఉన్నారు .
1881 డిసెంబర్ 2 న జెన్నీ తన చివరి శ్వాసను వదిలింది. ఇది మార్క్స్ ఎన్నటికీ ఎదుర్కొనలేని విషయం. ఆయన వ్యాధిగ్రస్తుడు కనుక స్మశానానికి సైతం ఆయనను రానీయలేదు.
” తల్లి గుణాలన్నీ చేతలన్నీ, కల్మషం లేనివని, నటన లేనిదని, కూతురుకి ఉత్తరంలో రాశాడు.
అలా ఓ మహోన్నత ప్రేమ కావ్యం ముగిసింది. స్త్రీ జాతి ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఆమె త్యాగమే మనకు వెలుగు దారి. ఆమె వ్యక్తిత్వం చాలా అరుదైనది. బహుశా అట్లాంటి వాళ్లను మళ్లీ చూడలేము. మార్క్స్ కు జెన్నీ అంటే పంచప్రాణాలు. జెన్నీ కూడా అంతే.ఒక భార్యగా, తల్లిగా, విప్లవకారిణి లాగా, సమాజసేవకురాలిగా, సోదరిగా, కూతురిగా, ఆమె అందరి అభిమానాన్ని పొందింది.

వీరిలా జీవించడానికి అయినా, సమాజానికి సేవ చేయడానికి అయినా, అన్ని తెలుసుకోవడానికి అయినా,ప్రేమ మానవత్వం ఉండాలన్నా, ఒక మంచి గృహిణిగా ఎలా జీవించాలని తెలుసుకోవాలన్నా, వీరి చరిత్రను తెలుసుకోవాలి. వీరి ప్రేమ సజీవం. అంతరించిపోతున్న అనుబంధాలను నిలబెట్టడానికి, వారి ప్రేమ ఒక అవసరం.

Leave a Reply