పచ్చని అడవి వీరుల నెత్తుటితో తడిసిపోయి 
రక్తపు మడుగుగా మారొచ్చు
అమాయకపు ఆదివాసీలు
ఏదో తెలియని కేసులో బంధించబడొచ్చు
మిగిలినవాళ్ళు బానిసలుగా
వాళ్ళ నేలని వారే తవ్వుతూ
కార్పొరేట్ల కింద నలిగిపోవొచ్చు…..
ఎప్పుడూ పేదల గుడిసెల వైపు
అడుగు వేయని పాలకులు
వారి నేలపై ఫాం హౌస్ కట్టుకుని
జల్సాలు చేయొచ్చు
ఇంతకంటే ఇంకా ఘోరమైనవి
ఎన్నో జరగొచ్చు కానీ
ఏరోజు అయితే …..
ఏరోజు అయితే……
అడవి లో చివరి మావోయిస్టు ను చంపుతారో
నగరంలో మొదటి మావోయిస్టు పుడతాడు
నిశీధి చీకటిలో మిణుగురు పురుగుల వెలుగులా
విప్లవం పురుడోసుకోక మానదు.

One thought on “విప్లవం పురుడోసుకోక మానదు

Leave a Reply