మోడీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లక్షల కంపెనీలు మూతబడ్డాయి. ఉద్యోగాలు లేక యువత తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొరంటున్న ప్రధాన సవాలు పేదరికం. దాదాపు 28 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. దీనివల్ల  జనాభాలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థలో పాల్గొనలేకపోతున్నారు. ఇది పేదరికం యొక్క విష వలయానికి దారితీస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో పెద్ద సవాలు నిరుద్యోగం. భారతదేశంలో నిరుద్యోగ రేటు 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది చాలా సామాజిక సమస్యలకు కూడా దారితీస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం. భారతదేశంలోని మౌలిక సదుపాయాలు జనాభా పెరుగుదలకు అనుగుణంగా లేవు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో పెద్ద సవాలు అవినీతి. అవినీతి ఆర్థిక వ్యవస్థలో అసమర్థత, వ్యర్థాలకు దారితీస్తుంది. ఇది అనేక సామాజిక సమస్యలకు కూడా దారితీస్తుంది.

భారత ఆర్థిక వృద్ధి సరే… మరి అభివృద్ధి సంగతేంది ? గణాంకాలు భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినట్లు సూచిస్తున్నాయి. అయితే, ఈ ఆర్థికవృద్ధి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మెరుగుపరిచింది, పేదరికం, ఉద్యోగ కల్పన, ధరల పెరుగుదల వంటి అంశాల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపింది.. జిడిపి రెట్టింపు కావడం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగినట్లు సూచిస్తుంది. సేవల రంగం (7.2 శాతం వృద్ధి), వ్యవసాయం (3.8 శాతం వృద్ధి), పరిశ్రమల విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 2025లో 55.6 బిలియన్ డాలర్లకు చేరడం, సామాజిక ఖర్చు 15 శాతం పెరగడం వంటివి కూడా ఈ వృద్ధిని బలపరుస్తున్నాయి. అయితే, ఈ సంఖ్యలు సమగ్ర చిత్రాన్ని ప్రతిబింబించవు. జిడిపి వృద్ధి అనేది ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం విలువను సూచిస్తుంది. కానీ, అది ఆదాయ విభజన, జీవన ప్రమాణాలు లేదా సామాజిక సంక్షేమం గురించి చెప్పదు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా మారాయి. శ్రమదోపిడీ, వనరుల దోపిడీ, లాభాపేక్ష అనేవి అసమానతల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభం అనేది ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పేదరికం, అసమానతలు, తయారీ రంగంలో క్షీణత వంటి అంశాలతో ముడిపడి ఉంది. దాని ప్రభావం అన్ని వర్గాలపై పడుతున్నది. ఎందుకంటే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను విడివిడిగా చూడలేని పరిస్థితి. రైతుల బాధలు, కార్మికుల అభద్రత, నిరుద్యోగ సమస్య, పౌష్టికాహార కొరత, పేదరికం, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, ప్రజాస్వామ్య హక్కుల క్రమబద్ధమైన సంకోచం, ఇవన్నీ పరస్పరం సంబంధం లేని పరిణామాలు కావు. వీటిని ఏ రకంగా చూసినా ఒక విధాన దిశలో సాగుతున్న రాజకీయ, ఆర్థిక నిర్ణయాల ఫలితాలు. కార్పొరేట్ లాభాలను అభివృద్ధిగా చూపుతూ, శ్రమజీవుల జీవితాలను పక్కకునెట్టే ఈ మార్గమే దేశాన్ని దుస్థితిలో పడేసింది.

కేంద్రంలో మోడీ అధికారం చేపట్టిన 2014 మే 26 మొదలుకుని 2026 జనవరి 25వ తేదీ నాటికి మోడీ ప్రధానిగా పదకొండు  సంవత్సరాల ఆరు నెలల కాలం పూర్తయింది. మూడోసారి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రధాని పీఠం మీద కూర్చున్న మోడీ పాలనలో మునుపెన్నడూ లేనివిధంగా దేశ ఆర్థిక పరిస్థితి  దిగజారింది. ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలను హోల్‌సేల్‌గా ఆశ్రితులకు అప్పనంగా అమ్మేస్తున్నది. దేశ విదేశీ అప్పులు గత డిసెంబర్ 31 నాటికి 200 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అడ్డూ అదుపు లేకుండా ప్రజలపై పన్నుల భారం పెరిగింది. తొంభై శాతం దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ ప్రజా సంపదను కొల్లగొట్టే కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలిస్తున్నది. రైతులు, శ్రామికవర్గ పేదలకు ఇచ్చే రాయితీలకు మాత్రం కోత పెడుతున్నది. అలాగే ఈ మధ్యకాలంలో రైతులు, కార్మికులు, గ్రామీణ పేదల పొట్ట కొట్టే కొత్త చట్టాల్ని రూపొందించింది. నూతన విత్తన చట్టం, కార్మికుల కోడ్స్ అమలు నోటిఫికేషన్, ఉపాధి హామీ చట్టం రద్దు స్థానంలో వికసిత్ భారత్Ðజి రామ్ జి చట్టం  2025 వంటివి.

భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక నిరుద్యోగం, గణనీయమైన పేదరికం, అసమానతలు, మౌలిక సదుపాయాల కొరత, వ్యవసాయ సంక్షోభం, పర్యావరణ పరిరక్షణ వంటి నిరంతర సమస్యలకు తోడు బలహీనమైన రూపాయి విలువ, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు, జారిపోతున్న ఐటీ రంగం. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతపడటం, కృత్రిమ మేధస్సు స్తబ్దత, వాయు కాలుష్యం వల్ల కలిగే ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటూ భారతదేశం 2026లోకి అడుగుపెడుతోంది. స్టాక్ మార్కెట్ నుండి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా బయటకు వెళ్లడం, భారతీయ ఈక్విటీ మార్కెట్లలో వారి యాజమాన్యాన్ని 15 సంవత్సరాలలో అత్యల్ప స్థాయికి తగ్గించడం, కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, 2026లో భారతదేశ ఆర్థిక పురోగతి, దాని పర్యవసాన స్థితికి అతి ముఖ్యమైన బేరోమీటర్లుగా ఉండే మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి. స్థిఱమైన అభివృద్ధి కోసం వీటి పరిష్కారం అత్యంత అవశ్యకం.

2025లో, విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి రూ.1.58 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు, ఇది పడిపోతున్న కరెన్సీకి ప్రతిస్పందనగా కనిపిస్తుంది. 2025 సంవత్సరం భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే మానసికంగా ముఖ్యమైన 90 అవరోధాన్ని దాటి పడిపోయింది. ప్రస్తుతానికి,  వాణిజ్య విధాన అనిశ్చితి, స్టాక్ మార్కెట్‌లో పెరిగిన విలువలు, దేశీయ వృద్ధి ఆందోళనలు, భారతదేశం యొక్క కరెన్సీ పతనం దాని ఆర్థిక అవకాశాలపై బేరిష్ సెంటిమెంట్‌ను, ఇతర ఆసియా మార్కెట్లతో పోలిస్తే దాని సామర్థ్యాలపై తీవ్ర ప్రేరణ లేని దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ద్రవ్యోల్బణం రద్దు చేసే అవకాశం ఉంది. మరింత విస్తృతంగా చెప్పాలంటే, రూపాయి మరింత పతనాన్ని నివారించడానికి ఆర్‌బిఐ తన విదేశీ మారక నిల్వల నుండి పెద్ద మొత్తాలను తీసుకోవలసి ఉంటుంది. ఒక దేశ కరెన్సీకి, దాని జాతీయ గౌరవానికి మధ్య సమాంతరాలను గీయడం కష్టతరమైన పని అని ఇది గుర్తు చేస్తుంది, 2014 నుండి, రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 30 శాతానికి పైగా పడిపోయింది. భారతదేశంలో ఎఐ సంబంధిత పెట్టుబడుల గురించి ఇటీవలి కొన్ని ముఖ్యాంశాలు, అది మైక్రోసాఫ్ట్, అమెజాన్ లేదా గూగుల్ అయినా. ఈ మూడు టెక్ మేజర్లు భారతదేశంలో కృత్రిమ మేధస్సు పెట్టుబడుల కోసం బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నారు. కానీ రాబోయే కొన్ని నెలల్లో, డబ్బు ఎంత పెడుతున్నారనేది కాకుండా, దేని వైపు పెడుతున్నారనేది ముఖ్యం. 

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలతో పాటు భారత్‌నూ పట్టి పీడిస్తోన్న భూతం పేదరికం. 147 కోట్ల దేశ జనాభాలో నేటికీ 28 శాతం మంది పేదరికంలోనే మగ్గుతున్నారని ఇటీవలి నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్ జిలుగు వెలుగుల గురించి మనం వినని రోజంటూ ఉండదు. ‘ఇండియా ఈజ్ నాట్ పూర్. ఇండియన్స్ ఆర్ పూర్’ అంటారు. భారత్ పేద దేశం కాదని, భారతీయులే పేదవారని వారి అభిప్రాయం. పేదరికం ఎంతటి సామాజిక రుగ్మత అంటే అది మనిషి సహజ హక్కులను, జీవితానందాలను పరాయీకరించి, లోలోపలి నుంచి ధ్వంసం చేస్తుంటుంది. ఆ ఊబి నుంచి బయటపడే అవకాశం లేక ఆత్మహత్యే శరణ్యమన్న ధోరణిలోకి నెట్టివేస్తుంది. దేశంలో గతేడాది 1.7 లక్షలకు పైగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. వాటిలో 40శాతం పేదరికం, సంబంధిత కారణాలే ప్రధానమైనవి. ‘పేదరికం అత్యంత హింసాత్మకమైనది, అది జీవితాలను నాశనం చేస్తుంది” అంటారు నెల్సన్ మండేలా.

ఆకలి, జీవన ఒత్తిళ్లు ఒక కుటుంబాన్ని ఎలా నిస్తేజంగా మార్చుతాయో, నిశ్శబ్దంగా వారి ప్రాణాలనే ఎలా మింగేస్తున్నాయో… ఈ ఆత్మహత్యలు ధ్రువీకరిస్తున్నాయి. ‘పాత ప్రపంచం మరణిస్తూ… కొత్త ప్రపంచం జనిస్తున్న ఈ సంధి కాలంలో రాక్షసులు రాజ్యమేలుతున్నారు’ అని వందేళ్ల క్రితం అన్న ఆంటోనియో గ్రాంసీ మాటల ప్రాసంగికత నేటికీ వర్తిస్తుంది. దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచబ్యాంక్, మోడీ ప్రభుత్వం గొప్పగా చెబుతున్నప్పటికీ వాస్తవికత మరో విధంగా ఉంది. ‘ప్రస్తుత కాలం భారతీయ మహా కుబేరులకు స్వర్ణయుగంగా మారింది’ అని 2026 అంతర్జాతీయ అసమానతల నివేదిక చెబుతోంది. అంతేకాదు… బ్రిటిష్ పాలన నాటికంటే ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయని కూడా ఈ నివేదిక వెల్లడించింది. దేశ సంపదలో సగానికి పైగా సంపద కేవలం 10శాతం మంది కుబేరుల దగ్గర పోగుబడిందని ‘బ్లూమ్ వెంచర్స’ అనే పెట్టుబడుల సంస్థ నివేదించింది. మేడిపండు చూడు మేలిమై ఉండు’ అన్న చందంగా మోడీ పాలనలో రూపాయి విలువ చరిత్రలో కనివిని ఎరుగనంత పతనావస్థకు దిగజారింది.

ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు సంపన్న వర్గాలకే ఎక్కువగా అందుతున్నాయి. నాణ్యమైన ఉద్యోగాల సృష్టి తక్కువగా ఉంది. ముఖ్యంగా పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్రంగా ఉంది. ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతోంది. రవాణా, విద్య, ఆరోగ్య రంగాల్లో ఇంకా అభివృద్ధి అవసరం. పరిష్కార చర్యలుగా సమగ్ర వృద్ధి విధానం అవసరం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వ్యవసాయ ఉత్పాదకత పెంచడం. చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ముఖ్యం. ఉద్యోగ  సృష్టి కోసం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, యంఎస్‌యంఇలకు మద్దతు ఇవ్వడం, లేబర్Ðఇంటెన్సివ్ రంగాల్లో పెట్టుబడులు పెంచడం అవసరం. ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం సరఫరా గొలుసును మెరుగుపరచడం, ఆహార ధరల స్థిరీకరణకు బఫర్ స్టాక్‌లను నిర్వహించడం చేయాలి. సామాజిక ఖర్చును విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణంలో గణనీయంగా పెంచాలి. సాంకేతికత వినియోగం స్టాక్‌లను నిర్వహించడం చేయాలి. సామాజిక ఖర్చును విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణంలో గణనీయంగా పెంచాలి. సాంకేతికత వినియోగం ద్వారా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలను ఉద్యోగ సృష్టికి వినియోగించడం కీలకం.

ముగింపు : భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటికి తోడు ద్రవ్యోల్బణం, అస్థిర రూపాయి, కరెంట్ ఖాతా లోటు ఉన్నాయి. అదనంగా, దేశం గణనీయమైన మౌలిక సదుపాయాల అవసరాలను, పెరుగుతున్న యువత, విద్యావంతులైన జనాభాను ఎదుర్కొంటుంది. ఈ అంశాలు రాబోయే సంవత్సరాల్లో దేశ ఆర్థిక వృద్ధికి అవకాశాలు, సవాళ్లను అందిస్తాయి. ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక సమస్యలు సాధారణంగా కొరత నుండి ఉత్పన్నమవుతాయి. పరిమిత వనరులు ఉన్న భారత్ లాంటి దేశంలో ఏమి ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి (సాంకేతికత/ సామర్థ్యం), ఎవరి కోసం ఉత్పత్తి చేయడం వంటి అంశాలను హేతుబద్ధంగా రూపొందించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే  పేదరికం, అసమానత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, స్థిరమైన వృద్ధిని సాధించడం వంటి విస్తృత సమస్యల పరిష్కారానికి  దారితీస్తుంది. ఈ సవాళ్లకు సమాజాలు వనరులను సమర్థవంతంగా కేటాయించాల్సిన అవసరం ఉంది, ఇది వ్యక్తుల నుండి ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుం

Leave a Reply