సంపాదకీయం

శ్రీ‌శ్రీ‌కి ప‌ల్ల‌కి మోత‌

ప్ర‌భువెక్కిన ప‌ల్ల‌కి కాదోయ్‌ అది మోసిన బోయీలెవ్వ‌ర‌ని ప్ర‌శ్నించి,  ‘మాన‌వ చ‌రిత్ర వికాసాన్ని’ తిప్పి చూపిన శ్రీ‌శ్రీ‌ని, ఆయ‌న మ‌హాప్ర‌స్థానాన్ని ఈ రోజు (న‌వంబ‌ర్ 30న‌) తిరుప‌తిలో కొంద‌రు ప‌ల్ల‌కిలో ఊరేగించారు. ఈ కాల‌పు వికృత‌, జుగుప్సాక‌ర స‌న్నివేశ‌మిది. ఆద‌ర్శాలు, విలువ‌లు, విశ్వాసాలు త‌ల‌కిందులుగా ఊరేగిన దృశ్య‌మిది.  మారుమూల బొరియ‌ల్లో వినిపిస్తుండిన మూలుగులు న‌డిరోడ్డు మీద విక‌టాట్ట‌హాసమైన తీరు ఇది. శ్రీ‌శ్రీ‌ని నిలువునా పాతేసి ఆయ‌న శ‌వానికి చేసిన‌  స‌ర్వాలంకృత వేడుక ఇది.  మ‌హాప్ర‌స్థానం భారీ సైజ్‌లో అచ్చు వేయ‌డ‌మే విడ్డూరం. అది చ‌దువుకోడానికి ప‌నికి వ‌చ్చేది కాదు. ఏ లాభాపేక్ష లేకుంటే దాన్ని సాహిత్య‌లోకంలోని, ప్ర‌చుర‌ణ రంగంలోకి ‘ముచ్చ‌ట‌’
కాలమ్స్ కథ..కథయ్యిందా!

చేదు మిగిల్చిన చెక్కెర కర్మాగారపు కథ ‘కంకాళం’

దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ పరిధిలో పనిచేస్తున్న అనేక సంఘాలు, సరళీకరణ ప్రైవేటీకరణ విధానాల దెబ్బకు కుదేలవడం తొంబైల తర్వాత  ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలో అమలవుతున్న మిక్సెడ్ ఎకానమీ ప్రైవేటు వేటుకు గురవడం కూడా యీ కాలంలోనే జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కొద్దిగా ప్రతిఘటించడం తొలినాళ్లలో జరిగింది. అయితే సహకార రంగంలోని నూలు మిల్లులూ, చెక్కెర కర్మాగారాలూ చాలా సులభంగా ప్రైవేటు కుట్రలకు గురికావడం జరిగింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చెక్కెర వినియోగదారులకు  చుక్కలు చూపించిన వైనం వొకవైపూ, వినియోగదారులకు విదేశీ చెక్కెరను సరఫరా చేయడాన్ని ప్రభుత్వాలు సమర్థించుకోవడం ఒకవైపు ఏకకాలంలో జరిగిపోయాయి. ప్రతిమ గారు
సాహిత్యం కవిత్వం

వెలుగు‌ రేఖలు

అమ్మ  అంతే మౌనంగా  తన భుజాన్ని తనకు  ఆసరాగా ఇచ్చిన  సహచరిగా  నిబ్బరంగా  నిదానంగా తోడుగా  నిర్బంధాన్ని ఎదుర్కొన్న అమ్మతనమే తనది విసుగు లేని తన జీవనయానం తెల తెలవారే  చిరునవ్వుతో ఉదయించే అమ్మ సభలలో ఓ కాంతిరేఖ నిరాడంబరంగా  నిలకడగా తన తోవ  వెనక నడచిన సహచరిగా  ఎప్పుడూ గుర్తుండే  అమ్మ తను అమ్మలంతే  ఆకాశంలో వెలితిని  పూడ్చే వెలుగు రేఖలు వారికేమిచ్చి  రుణం తీర్చుకోగలం మనసంతా నిండిన  దుఃఖపు నివాళి తప్ప... (కా.ఆలూరి లలితమ్మకు నివాళిగా)
లోచూపు కాలమ్స్

జీవన పునరుత్పత్తి సౌందర్యాన్ని చాటి చెప్పే ‘లద్దాఫ్ని’ కథలు

తన మొదటి కథా  సంకలనమే ఇంత ప్రభావశీలంగా ఉండడానికి అసలు జీవితం పట్లనే  షాజహానా గారి దృక్పథానికి  లోతైన, బలమైన పునాదులు ఉండడమే ప్రధాన కారణం. తన జీవితానుభవాల్లోంచి మాత్రమే కాకుండా, తన లాంటి వివక్షితులైన  మైనార్టీ సమూహపు పీడిత  ముస్లిం ప్రజల జీవిత వాస్తవికతా సంపర్కంలోంచి ఏర్పడడం వల్ల ఆమె దృక్పథానికి ఎంతో శక్తి సమకూరింది. ఆ శక్తితో నవనవోన్మేషంగా, సాహసోపేతంగా జీవిస్తూ ఆమె సృజించిన కళాత్మక డాక్యుమెంటులే యీ 14 ‘లద్దాఫ్ని- ముస్లిం స్త్రీ కథలు’.  నిత్యం అణిచివేయబడి  ధ్వంసమవుతున్న జీవితాన్ని తిరిగి ప్రజలు ఎలా పునర్నిర్మించుకుంటారో ఆమె కథలు పాఠకులకు చక్కగా  దృశ్యమానం చేస్తాయి. పైగా,