ఆధిపత్య సమాజాల్లో ప్రాణాల విలువ
ఆధిపత్య సామాజిక వ్యవస్థల్లో (ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో కులం మౌలికంగా వర్గంతో పాటు ఒక ఆధిపత్య నిర్మాణం) సుదూర గత చరిత్రలోకి వెళ్లకుండా చూసినప్పుడు యూరోపియన్లు ఆక్రమించుకున్నప్పటి నుండి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో ఆదివాసులు తెగలుగా, జాతులుగా ప్రాణం విలువతో కాకుండా పెట్టుబడిదారీ ప్రమాణాల్లో వనరుతో తూకం వేయబడుతున్నారు. ఇతర ఇంధనాలతో పాటు, ఒక దశలో అన్నిటికన్నా మార్కెట్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి ప్రాబల్యంలోకి వచ్చిన చమురు అనే వనరు దృష్ట్యా ఇస్లాం మతావలంబకులైన జాతులు అధికంగా ఉన్న దేశాలు (పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌ల