విభజన చట్టం చంద్రబాబుకు గుర్తుందా?
ఈ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. ఇద్దరూ చాలా సౌకర్యంగా ఒకటి మర్చిపోయారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చేసిన విభజన చట్టం. దానికి పదేళ్ల వయసు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ‘నవ్యాంధ్ర’ను నిర్మిస్తానన్నాడు. కానీ విభజన చట్టం గురించి ఊసెత్తలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు. విభజన చట్టం నోరెత్తలేదు. చెరి ఐదేళ్లు వంతులవారి రాష్ట్రాన్ని పాలించారు. ఈ పదేళ్లలో తాయిలాలకు లోటు లేదు. ఉచితాలకు అంతులేదు. పోటీపడి సామాజిక పింఛన్లు వాగ్దానాలు చేశారు. తోచిన వరకు ఇచ్చారు. కానీ