సంపాదకీయం

ఈ ఎన్‌కౌంటర్‌లు మనకు పట్టవా?

మే 10వ తేదీన బీజాపూర్‌ జిల్లా పిడియా అడవుల్లో జరిగినట్లు చెప్పబడుతున్న ఎన్‌కౌంటర్‌లో 12 మంది మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ 12 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉండే అవకాశం ఉందని, ఈ ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్‌, దంతేవాడ, సుకుమా జిల్లాల ఎస్‌పిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, వీరితోపాటు ఐజి సుందర్‌రాజ్‌ నిరంతరం సంబంధంలో ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నాడని, ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో 10వ తేదీ ఉదయానికి ఆరుగురు చనిపోయినట్లు తెలిసిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒక టివి చానెల్‌ ఎంతో ఉద్యోగపూరితంగా ప్రసారం చేసింది. స్టూడియో నుంచి ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఉన్న సచిన్‌ అనే
ఓపన్ పేజ్

‘ఇతరుల’ గురించి మాట్లాడలేమా?

మనుషుల స్పందనలు బహు విచిత్రం.  ఎప్పుడు దేన్ని పట్టించుకుంటారో.  ఏ విషయంలో  మౌనంగా ఉంటారో. దేన్ని తప్పించుకొని జాగ్రత్తగా తిరుగుతారో. చెప్పడం అంత సులభం కాదు. ఆరోపించీ లాభం లేదు. దీన్నంతా ఇష్టా ఇష్టాలుగా తేల్చవచ్చా? ఉద్దేశాలకు, రాజకీయాలకు మాత్రమే ఆపాదించవచ్చా? చైతన్యం గీటురాయి మీద పరీక్షించవచ్చా? సాంస్కృతిక స్థాయిగా కూడా చూడవచ్చా? ఇట్లా ఎన్ని చెప్పుకున్నా ఎంతో కొంత  మిగిలే ఉంటుంది. దీనికి చాలా కారణాలే ఉంటాయి. సమాజం యావత్తూ స్పందించడం సరే. అక్కడ చాలా సంక్లిష్టతలు పని చేస్తుంటాయి. స్పందనకూ మౌనానికీ  జటిలమైన కారణాలు ఉంటాయి. కానీ సమాజ కంఠస్వరంగా వినిపించే వాళ్ల మాటలనూ, మౌనాన్నీ
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు రెండు

1 ఏనాడైనా చూసావాఎర్రగా మారుతున్న అడవిని ఏనాడైనా చూసావా !ఏరులై పారుతున్న నెత్తుటి కాల్వల్లో ఏనాడైనా తడిసావా!గుండెల్లోకి దూసుకు వచ్చిన తుపాకీ గుండును ఏనాడైనా తాకావా!నిన్ను నీవు ప్రేమించుకున్నంత స్వచ్ఛంగాఈ భూమిని ఎప్పుడైనా ప్రేమించావా!ఆదివాసీ పల్లెల్లో కాలుతున్న మానవత్వాన్ని ఒక్కసారైనా కావలించావా!మట్టిని మనసుగా పరుచుకున్నోళ్ళగుండెదడను ఎక్కడైనా ఆలకించావా!స్వదేశంలో యుద్దానికై వెనుకాడనివిప్లవ వీరుల్ని ఏనాడైనా కలిశావా!అయితే నడువు...నేలకు ఒరిగిననెత్తుటి ముద్దలను ముద్దాడడానికి!అమరత్వం ఎంత గొప్పదో చాటి చెప్పడానికి!వాళ్లు నడిచిన బాటలలోధైర్యాన్ని వెలిగిస్తూ నడువు మరో ఉదయాన్ని వెతుక్కుంటూ. 2 అమరత్వందేశం నీదైతేనేం నాదైతేనేం అది గాజాయితేనేంభారతదేశమైతేనేంఫాసిజం ఎంత క్రూరమైందో చెప్పటానికి నువ్వైతేనేం నేనైతేనేం ఏ రాజకీయమైతేనేం ఏ ఇల్లయితేనేం ఏ
ఇంటర్వ్యూ

ప్రమాదకరమైనా సరే అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందే

(దశాబ్ద కాలం తరువాత ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు నిర్దోషిగా విడుదలైన్ హేమ్ మిశ్రా తన జైలు శిక్ష, విచారణ, అనుభవాల గురించి ‘అవుట్ లుక్’కు చెందిన విక్రమ్ రాజ్ తో మాట్లాడారు) హేమ్ మిశ్రా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 2013 లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మొదటిసారి అరెస్టు చేసారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు కొరియర్గా పనిచేశాడని, దేశంపై యుద్ధం చేస్తున్నాడని అభియోగాలు మోపారు. 2017మార్చి 7నాడు గడ్చిరోలి సెషన్స్ కోర్టు హేమ్, మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2024మార్చి 5నాడు బాంబే హైకోర్టు-నాగ్పూర్ బెంచ్ ఈ కేసులో హేమ్, మరో
ఎరుకల కథలు

అదే ప్రశ్న

ఆ ఇంటిముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ. వేణుగోపాలస్వామి గుడివీధి, మల్లెపూల పందిరిల్లు, రెండంతస్థుల ఆకుపచ్చని  పాత బిల్డింగు. సుభద్రమ్మ చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి. అయినా లోపలికి వెళ్లాలంటే ఒక్కక్షణం భయమేసింది. కాళ్లకేదో అడ్డం పడుతున్నట్లు అనిపించింది. మొహమాటంగా బెరుగ్గా అనిపించింది.మళ్ళీ తనే  ధైర్యం తెచ్చుకుంది. కదలకపోతే ఆగిపోయేది తన జీవితమే అని గుర్తు తెచ్చుకుంది.ఇల్లు ఇంట్లో ఆకలితో సగం చనిపోయినట్లు, ఒంట్లో రక్తమే లేనట్లు నిస్తేజంగా కనిపించే పిల్లల మొహాలు గుర్తుకు వచ్చేసరికి ఒక్క ఉదుటున ముందుకే కదిలింది. మనుషులు ఎట్లున్నా ముందుకు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే ఎట్లా కుదురుతుంది ? ముగ్గురు
సంభాషణ

వియ్యుక్క వెలుగులో మరికొంత ముందుకు

వియ్యుక్క సంకలనాలను ఆదరిస్తున్న పాఠకులకు విప్లవాభినందనలు తెలియజేస్తూ మరికొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా సంకలనాలలో దొర్లిన కొన్ని పొరపాట్లను, కొత్తగా అందిన సమాచారం  వల్ల గుర్తించిన వాటిని పాఠకుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు పరిశోధక విద్యార్థులు, ఒక విద్యార్థిని తమ థీసిస్ విషయవస్తువుకు ప్రధాన వనరుగా వియ్యుక్క సంకలనాలను స్వీకరించామని మరింత సమాచారం కోసం సంపాదకురాలిని సంప్రదించారు. నేటి తరం యువతను వియ్యుక్క సంకలనాలు ఆకర్షించటం, వారి బాధ్యతగా వారు విప్లవ సాహిత్యంలో మరింత సూక్ష్మ పరిశోధనలు చేపట్టటం చాలా సంతోషించవలిసిన విషయం. వారికి, వారిని ప్రోత్సహిస్తున్న ఆచార్యులకు విప్లవాభివందనాలు.  ఇటువంటి పరిశోధనలను
వ్యాసాలు

రాజకీయాలు – సామాజిక మాధ్యమం

రాజకీయ, సాంస్కృతిక వ్యక్తీకరణలో  చొరబడిన ‘సామాజిక మాధ్యమం’ అనేక మానవీయ విషయాలలో గందరగోళం సృష్టిస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియా ప్రజల ఆలోచనాధారలోకి ప్రవేశించింది. ప్రధాన స్రవంతి మీడియాకు ప్రత్యామ్నాయంగా మనిషి చేతికి సామాజిక మాధ్యమం అంది వచ్చింది. సృజనాత్మక అభినివేశం గల మానవుల సాంస్కృతిక, రాజకీయ వికాసపు వ్యక్తీకరణకు సోషల్‌ మీడియా ఆలంబనగా నిలిచింది. పదేళ్ల కాలంలో సోషల్‌ మీడియా భారత సమాజంపై తనదైన ముద్ర వేయగలిగింది. మన ఇంటి పక్క అమ్మాయి, లేదా అబ్బాయి తమకున్న సృజనాత్మతతో లక్షలాది వీవర్స్‌ను సంపాదించకోగలుగుతున్నారు. కొందరికి ఆర్ధిక వనరయింది కూడా.  సోషల్‌ మీడియాకు సమాజమే ప్రతిబింబం. దిన పత్రికలను,
కవిత్వం

అన్యాయం

బంగారు డేగ వర్ణంలోనే బంగారంవనరులున్నా ఉన్మాదం కోరల్లో విలవిలతన భూభాగం కోసమే తాను శ్రమిస్తూ ఆశ్రయం కోసం ఎంతో దూరం వెళ్తుంటేఊసురోమని నీరసిస్తుంటేకాసింత ఊరట కోసం జానెడు చోటు కోసంవెంపర్లాడుతుంటే ఉసూరమనిపిస్తుంది జామ్ మీనార్ సాక్షి గాచుకర్ పార్ట్రిడ్జ్ హిమాలయాల్లోనేబతకగలదుఅది ఆ సరిహద్దు నుండి రాలేదువచ్చిందంటే బతుకు మృగ్యమైతేనేఅక్కున చేర్చుకునే నేల కోసంనెలవంక ను వేడుకుంటుంది షాలిమార్ ఉద్యాన వనంలోఅడవి కోడి సెంబగం పోరులో సెంబగం అలసిపోయి అడుగులు నెమలివైపు యల్పనం మీదుగాసేదతీర దారులు మూసుకుపోయాయిప్రజాస్వామ్యం అంపశయ్య పై నుండగాబూడిద నెమళ్ళు పడవల్లో సకల కష్టాలతోఘోష వినలేక ఇర్రవాడ జీవం కోల్పోగానెమలి పంచన ఒదిగితేతరిమే నయా మత స్వామ్యం
కీనోట్

ఆదివాసీ పరిరక్షణకు ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నిద్దాం

(మధ్య భారతదేశంలో ఆదివాసులపై ప్రభుత్వ బలగాల హత్యాకాండ కు వ్యతిరేకంగా  ఐక్య కార్యాచరణ సన్నాహాల్లో భాగంగా  25, శనివారం ఉదయం 10 గంటలకు, హైదరాబాదులో ని సుందరయ్య విజ్ఞానకేంద్రం, షోయబ్ హాల్లో   ఏర్పాటు చేసిన సమావేశంలో  పౌరహక్కుల సంఘం ప్రవేశపెట్టిన కీనోట్ ) మితృలారా.. ఆదివాసులకు భారత రాజ్యాంగం హామీ పడిన హక్కులు తీవ్రమైన సంక్షోభంలో పడిపోయాయి. అడవి, సహజ వనరులు, పర్యావరణం, ఆదివాసుల జీవనోపాధులతో సహా వాళ్ల జీవించే హక్కును సహితం భారత ప్రభుత్వం  ఉల్లంఘిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పీడిత సమూహాలన్నిటి రక్షణ కోసం అనేక ప్రత్యేక చట్టాలను రాజ్యాంగం ప్రకటించింది. ఇందులో ఆదివాసల
వ్యాసాలు

Should we not think of these Encounters?

Police informed the public that as many as 12 people were killed in an encounter that was said to have happened in the Pidia forests in Bijapur district on 10th May. A T V channel broadcasted excitedly that it was most likely that there were important Maoist leaders among those 12 dead people. It also conveyed the news that the SP’s of Bijapur, Dantewada and Sukuma districts were personally monitoring