ఉత్తరాఖండ్‌లో ఖలంగా అడవి కోసం యువత, అడ్డుకున్న “దేశ భక్త” గుంపు
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న ఈ కాలంలో, మరిన్ని చెట్లను నాటాలని, అడవులను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో నగరం పక్కనే ఉన్న మరో అడవిని నాశనం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఈసారి దట్టమైన సాల్ చెట్ల ఖలంగా కొండల అడవి వాళ్ళ లక్ష్యం. ఇక్కడ సౌంగ్ నది తాగునీటి పథకానికి సంబంధించిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏటా రెండు వేల చెట్లను నరికివేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నరకబోయే చెట్లకు ఇటీవల గుర్తులు కూడా పెట్టారు. గుర్తు పెట్టడం అంటే నరకబోయే చెట్లకు గుర్తుగా గొడ్డలితో