మావోయిస్టు పార్టీ ఆవిర్భావ సభ(లు) జ్ఞాపకాలు కొన్ని
సిపిఐ (మావోయిస్టు) ఏర్పడి 2024 సెప్టెంబర్ 21 నాటికి 20 సంవత్సరాలు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు నెల రోజుల పాటు ఈ రెండు దశాబ్దాల వార్షికోత్సవాలు జరుపుకోవాలని పీడిత, పోరాట ప్రజలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ శ్రేణులు, నాయకత్వం, విప్లవాభిమానులు దేశవ్యాప్తంగా ఈ 20 ఏళ్ల సభలు అమరుల స్మృతిలో నిర్వహించుకుంటారని కూడా ప్రకటించింది. ఈ 20 ఏళ్లలో 5250 మంది పార్టీ సభ్యులు, 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పోలిట్ బ్యూరో సభ్యులు అమరులయ్యారని, పార్టీ నిర్మాతలైన అమరులు కామ్రేడ్స్ చారుమజుందార్, కన్హయ్య చటర్జీతో పాటు