స్త్రీల కవిత్వంలో ప్రపంచ దర్శనం
(ఇటీవల విడుదలైన ‘ప్రపంచ స్త్రీల కవిత్వం – స్వేచ్ఛానువాదం: దియా విఘ్నేష్’ పుస్తకానికి రాసిన ముందు మాట-వసంత మేఘం టీం ) ప్రపంచం నాలుగు మూలల నుండి ఒకేసారి అరవై మంది కవయిత్రులతో సంభాషణ ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఎలా వచ్చిందో కాని దానికదే ఎంత అపురూపమైనది కదా అనిపించింది ఈ పుస్తకం గురించి విన్న వెంటనే. వైవిధ్యభరితమైన సాంస్కృతిక వ్యక్తీకరణలు, ప్రాకృతిక విశేషాలు, చారిత్రక నేపథ్యాలు ఒక్క చోటికి రావడం దానంతటదే ఒక ప్రత్యేకత. అయితే ఈ కవిత్వమంతా సౌందర్యారాధన కాదు. ఒట్టి నగిషీలు చెక్కిన కళ కాదు. అలా అయితే రంగుల పుష్పగుచ్ఛంలా మన