పాలస్తీనియన్లను తుడిచిపెట్టే పన్నాగం
దశాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలకు అడ్డు కట్ట వేయాలని, పాలస్తీనా భూభాగాల ఆక్రమణలకు చరమగీతం పాడాలని గాజాలోని హమాస్ అనే మిలిటెంట్ సంస్థ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగాలలోకి చొరబడి 251 మందిని బందీలుగా చేసుకొని అపహరించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులు మొదలు పెట్టింది. అప్పటినుంచి ఇజ్రాయెల్ మారణకాండ కొనసాగిస్తూనే ఉంది. గాజా ప్రపంచంలోనే అత్యధిక జన సాంధ్రత గల ప్రదేశం. 22 మాసాలుగా గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతున్నది. ఇప్పటివరకు 85 వేల టన్నుల బాంబులతో ఆ ప్రాంతా న్ని శిథిలాల కుప్పగా మార్చింది. గాజాపై ఇజ్రాయెల్ జారవిడిచిన బాంబులు