ఉడుకు!
యూత్ అసోషియేషన్ సభ్యులంతా జమయ్యిన్రు. బస్తీలో చెయ్యాల్సిన కార్యక్రమాన్ని గురించి చర్చోపచర్చలు చేసి తీర్మానం కూడా చేసిన్రు. “ఒరేయ్... మీరంతా గుండు చేపించుకుంటారా?” అడిగిండు వో దోస్తు. “మనమేం మాట్లాడినాం? వీడేమంటున్నాడ్రా?” యెవరికీ యేమీ అర్థంకాలే. మెంటలోన్ని చూసినట్టు చూసిన్రు. “సరే, నేను పైసలిస్తాను, మీరంతా గుండు చేపించుకుంటారా?” దోస్తుగాడు అన్నమాట మీదే వున్నడు. “ఒరే హవ్లే, యింట్లో యెవరు పోయిన్రని... గుండు చేపించుకుంటారు?” ఆ దోస్తుని తిరిగి అంతా అడిగిన్రు. “మీ తాత పోయిండు. మీ జేజమ్మ పోయింది. ఊ... మీ చిన్నాయిన పోయిండు. ఆ... మీ పెద్దమ్మ కూడా పోయింది. ఒరే, మీ బావ కరోనా










