ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు తీర్పుః బొగ్గు పారిశ్రామికుల విజయం
హస్‌దేవ్ అరణ్య అటవీ ప్రాంతంలోని ఘట్‌బర్రా గ్రామ ప్రజలకు ఉన్న అటవీ హక్కులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2025 అక్టోబర్ 8న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక న్యాయ అవహేళన. ఇది కేవలం ఒక తీర్పు కాదు; ఆదివాసులను మాట్లాడనీయకుండా చేసి, బొగ్గు మాఫియాలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం. ఈ తీర్పు అటవీ హక్కుల చట్టం-2006 కింద ఇచ్చిన హక్కులను రద్దు చేయడమే కాకుండా, తరతరాలుగా ఈ అటవీ ప్రాంతాలను సంరక్షిస్తున్న ఆదివాసుల జీవనాధారాన్ని, గౌరవాన్ని కూడా ఆటపట్టిస్తోంది. అంతేకాదు, దీనివల్ల “అభివృద్ధి” అనే పేరుతో అడ్డూ అదుపూ లేకుండా పరిశ్రమల విస్తరణకు అనుమతినిస్తోంది. భారతదేశ








