విద్రోహాలు, అబద్ధాలు, వక్రీకరణలు చెలరేగిన యుద్ధ కాలంలో చారిత్రక సత్య ప్రకటన
*భారత విప్లవ పంథా - సమకాలీన సందర్బం* పుస్తకం ముందుమాట. డిసెంబర్ 7న హైదరాబాదులో జరిగే సదస్సులో ఆవిష్కరణ... వసంతమేఘం టీం ఈ పుస్తకంలో ఏముందో చెప్పబోవడం లేదు. లోపలికి వెళ్లితే మీకే తెలుస్తుంది. సందర్భం గురించే నాలుగు మాటలు. మన చుట్టూ అంతులేని శబ్ద కాలుష్యం. రణగొణ ధ్వని. యుద్ధారావం. మన పక్కన ఉన్నారనుకున్న మనుషులే శతృవు పక్కకు వెళ్లిపోతున్నారు. మనతో గొంతు కలుపుతారనుకున్న వాళ్లే ఇతరుల భాషతో మాట్లాడుతున్నారు. నిజానికి ఏ ఒక్కరి కోసమో, ఏ మార్గం కోసమో చర్చించనవసరం లేదు. దేనినైనా చరిత్రలో భాగంగా చూస్తే చాలు. అందరమూ చరిత్ర ముందు విద్యార్థులమే. కాలగతిని తెలుసుకోగల










