వ్యాసాలు

పుస్తకం వల్లనే చాలా మారాను…

1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి? జ.పాఠశాల స్థాయి నుంచే తెలుగు మీద మమకారం పెంచుకున్నాను.1992 ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా రెండో అన్న హుస్సేన్ భావకవిత్వం రాసేవాడు. మా వాడి కవిత్వం రహస్యంగా చదివేవాడిని. సాహిత్యం అంటే ఏమో తెలుసుకోవాలనిపించింది. మా తెలుగు లెక్చరర్ ను అడిగితే బైపీసీ వాడికి తెలుగు సాహిత్యం తో ఏం పని అన్నారు. నీకు అభిలాష ఉంటే పుస్తకాలు బయట అద్దెకు దొరుకుతాయి అవి చదువు అన్నారు. ఇక అదే సందర్భంలో ఆదోనిలో పుస్తకాలు అద్దెకు తెచ్చుకుని చదివేవాడిని.. మొదట ఫిక్షన్, కొమ్మనాపల్లి గణపతిరావు,
కథలు

శివ శివ!

ఏడుపు ఆపుకోవడమే కాదు, వొక్కోసారి నవ్వాపుకోవడం కూడా కష్టమే! అయితే మనం దేనికి నవ్వుతున్నామో మన చుట్టుపక్కల వాళ్ళకి బోధపడనప్పుడు నవ్వుతున్న మనం యేడవక తప్పదు! నవ్వుగురించి చెప్పబోయి నా యేడుపు గురించి యెందుకు గాని, కథలోకి వస్తే, నేనున్నాను. నా పక్కన మా యోగా బ్యాచంతా వున్నారు. “శివ శివ అననేలరా...” పాట స్టీరియోలో వస్తోంది. ఆ పాట కూడా నవ్వుతూనే మొదలైంది. జానకిగారి గొంతు కదా, ఖంగుమంటూ తాడు లేకుండానే కట్టిపడేసింది నన్ను. “శివ శివ అననేలరా... కౌగిలిలోనే కైలాసమందగా. కౌగిలిలో-నే కైలాస మీయగ, శివ శివ అననేల-రా...” పాట పాదరసం కదా, యెక్కడికైనా జారుతుంది,
కవిత్వం

మరణాన్ని గెలిచే యుద్ధం

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునివచ్చిన దారిలోనికలుపు మొక్కలను ఏరుకుంటూభుజం భుజం కలుపుతూమునుముందుకు సాగుదాంయుద్ధం మధ్యలో తుపాకీనిశత్రువు చేతిలో పెట్టినవాళ్ళ నవ్వులను తిప్పికొడుతూఅమరుల రెప్పల మాటున దాగినకలల సాకారం కోసం సాయుధమవుదాంవర్గ పోరాటం ఎప్పుడూముగిసిపోదు కదాఒకరు ఆపేస్తే ఆగేది కాదిదిపిరికి గుండెలకు చోటు లేనిదిమెలకువను మింగే మాయ తెరలనుఛేదిస్తూ ఉదయాస్తమయాల మధ్యనిత్యమూ సాగె బడలిక ఎరుగనిసుదూర ప్రయాణం కదాఅణగారిన ప్రజల హృదయాలేస్థావరాలుగా యుద్ధం చేసే వాళ్ళకిచివరి మజిలీ ఎన్నడూ లేదు కదాఇది మరణాన్ని గెలిచే యుద్ధం!మాతృత్వాన్ని ప్రేమించే యుద్ధం!మనుషులను కలిపే యుద్ధం!!
stories

Steel Fortress

Before You Read This Story On 5 February 2026, near Podewada village in the Maad area of Gadchiroli district, police and C-60 commandos carried out a cordon-and-search operation in which seven Maoist revolutionaries, including three women, were killed. One among them was Loketi Chander, the leader of that guerrilla unit. This is his story. At the time of his death, he was around 63 years old. Many people in Telangana
వ్యాసాలు

నవతగా సులోచన

(భారత విప్లవోద్యమంలో అత్యుత్తమ విప్లవకారిణి కా. నవత అమరత్వం తర్వాత 2016 జులై లో అమరుల బంధుమిత్రుల సంఘం ప్రచురించిన పుస్తకానికి రాసిన ముందుమాట ఇది. మొదట ఈ పుస్తకం పేరు ఆదర్శవీర వనిత కామ్రేడ్ నవత. అచ్చుకు వెళ్లే క్షణాన కామ్రేడ్ అమ్మగా మారింది. ఫిబ్రవరి 5వ తేదీ గడ్చిరోలీలో జరిగిన దాడిలో నవత జీవన సహచరుడు కా. ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అమరుడయ్యాడు. ఆ ఇద్దరి స్మృతిలో ఈ వ్యాసం పునర్ముద్రణ ..వసంతమేఘం టీం) ఆరోజు కామారెడ్డిలో బస్సు దిగే సరికి ఉదయం పది గంటలైంది. అక్కడి విలేఖర్లకు ఫోన్ చేసి సంగోజివాడికి ఎలా
వ్యాసాలు

కామ్రేడ్ నవతా!

(ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ గ‌డ్చిరోలీలో జ‌రిగిన దాడిలో అమ‌రుడైన కా.ప్ర‌భాక‌ర్ అలియాస్ ప‌డ్క‌ల్ స్వామి  2016లో త‌న జీవ‌న స‌హ‌చ‌రి కా.సులోచ‌న అలియాస్ న‌వ‌త అమ‌ర‌త్వ సంద‌ర్భంగా రాసిన వ్యాసం ఇది. అప్ప‌ట్లో అమ‌రుల బంధుమిత్రుల సంఘం ప్ర‌చురించిన పుస్త‌కంలో ఇది అచ్చ‌యింది. మొద‌ట ఈ పుస్త‌కం పేరు ఆద‌ర్శ‌వీర వ‌నిత కామ్రేడ్ న‌వ‌త‌. అచ్చుకు వెళ్లే క్ష‌ణాన కామ్రేడ్ అమ్మ‌గా మారింది. కా.ప్ర‌భాక‌ర్  స్మృతిలో ఈ వ్యాసం పున‌ర్ముద్ర‌ణ.. వ‌సంత‌మేఘం టీం) నిన్ను, మన పిల్లల్ని కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఉద్యమ అవసరాల రిత్యా కొంత లేటయినా చివరికి మనందరిని కలుసుకొమ్మని మనకు ఓ మంచి అవకాశం పార్టీ
కథలు

ఉక్కుకోట

(ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు కా. రేణుక రాసిన క‌థ ఇది. ఆయ‌న అమ‌ర‌త్వం సంద‌ర్భంగా పున‌ర్ముద్ర‌ణ‌- వ‌సంత‌మేఘం టీం) కుడి చేతిల ప్లాస్టిక్ లోటతోటి నీళ్లు పట్టుకొని నడుస్తాంది రాజవ్వ. చూస్తే దొడ్డికి పోతున్న దానిలెక్క వుంది. యాభై యేండ్ల వయసుండొచ్చామెకు. శాయనలుపుతోటి ఎత్తుగా, ఎత్తుకు తగ్గ దొడ్డుతోటి వుంది. ఇంచుమించు సగం నెత్తి నెరిసింది. కొంచెం దూరం నుంచి ఆమెనే అనుసరించి నడుస్తున్నడు స్వామి. సుమారు వ•ప్పయ్యేండ్ల వయసుతోటి, బక్కపలుచగ పొట్టిగ ఉన్నడాయన. అంగీ తొడుక్కొని, దోతీ కట్టుకున్నడు. కాళ్లకు చెప్పుల్లేవు. నెత్తిమీద గొంగడి కప్పుకొని దానిమీద ఒక బస్త
వ్యాసాలు

భావ‌జాల, సాంస్కృతిక రంగాల్లో వ‌ర్గపోరాటం

(జ‌న‌వ‌రి 24, 25 తేదీల్లో జ‌రిగిన విర‌సం 30 మ‌హా స‌భ‌ల కీల‌క ప‌త్రంలోంచి కొన్ని భాగాలు- వ‌సంత‌మేఘం టీం) ఉపోద్ఘాతం: విరసం ముప్పైవ మహా సభలకు హాజరైన కామ్రేడ్స్‌కు విప్లవాభివందనాలు. మార్క్సిజం లెనినిజం మావోయిజం   మార్గదర్శకంగా విప్లవ సాహిత్య, భావజాల, సాంస్కృతికోద్య‌మాల‌ను నిర్వహిస్తున్న విరసం ఈ మహా సభల ఇతివృత్తంగా వర్గపోరాటాన్ని ఎంచుకున్నది. వర్గపోరాటం చరిత్ర నియమమే అయినా అది నిర్దిష్ట స్థల కాలాల్లో కొనసాగుతూ ఉంటుంది. నక్సల్బరీతో మొదలైన విప్లవోద్యమ చరిత్రలోని అనుకూల, ప్రతికూల సందర్భాలన్నిటినీ విరసం తన ప్రాపంచిక దృక్పథంతో వర్గపోరాటం గీటురాయి మీద విశ్లేషిస్తూ వచ్చింది. అట్లాగే ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభాన్ని అర్థం
వ్యాసాలు

న్యాయమైన వేతనం కోసం విచారణ ఖైదీ పోరాటం

ఖైదీల రోజువారీ వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ సవరణను ప్రకటించినప్పుడు .. నైపుణ్యం కలిగిన పనులకు రూ. 620, పాక్షిక నైపుణ్యం కలిగిన పనులకు రూ. 560, నైపుణ్యం లేని పనులకు రూ. 530 గా నిర్ణయించింది. జైలు గోడల వెనుక సంస్కరణలను ప్రోత్సహించడమూ; శ్రమ గౌరవాన్ని పెంపొందించడమూ ఈ చర్య ఉద్దేశ్యంగా భావించారు. అయితే, ఒకప్పుడు విచారణా ఖైదీగా రోజుకు రూ. 20 కంటే తక్కువ వేతనం పొందిన టి.కె. రాజీవన్ వంటి వారికి, ఈ వార్త ఒక పరాకాష్టగా, చేదు వ్యంగ్యంగా అనిపించింది. ఎడక్కర మావోయిస్టు కేసులో ఐదవ నిందితుడిగా ఉన్న రాజీవన్, ఒకప్పుడు అమల్లో
సంపాదకీయం

కార్మిక సమ్మెకు సంఘీ భావం

ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె విజయవంతం కావడానికి కార్మిక వర్గం సమాయుత్తమాతుంది. పన్నెండు ఏళ్ల నరేంద్ర మోదీ  పాలనలో కార్మిక, కర్షక వర్గ  విధానాల పట్ల అనుసరి స్తున్న వైఖరి పట్ల అసంతృప్తి ఉంది.  ఇప్పటికే భారత దేశ రైతులు రోడ్లపై నిలబడి ఉన్నారు.వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాదని  చివరకు పోరాట రూపమే మిగిలిందనే నమ్మికతో వున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేలాది మంది రైతులు రోడ్లపై నిల్చున్నారు. ఈ దేశానికి సంబంధించి నంతవరకు  కార్మికులు, కర్షకులు పునాదిగా ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా    ఉన్నారు. రైతులు ఈనాటికీ తమకు ఉన్న