కేసులు కొట్టేసినా, జైలు నుంచి విడుదలైనా దొరకని స్వేచ్ఛ
2022 మే లో రతీరామ్ మాంఝీ మావోయిస్టు ఆరోపణల నుండి విముక్తి పొందారు, కానీ ఆ ఆరోపణల నీడ ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. హత్య, అల్లర్లు, ఆయుధ చట్టం, క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ కింద మహువాటాండ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బొకారోలోని ఒక సివిల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసినప్పటికీ, ఆయన జీవితం గతంలోలాగా సాధారణ స్థితికి చేరుకోలేదు. మిగిలిందల్లా పోలీసుల వేధింపులు, సామాజిక వివక్షతో కూడిన సంవత్సరాల తరబడి అవమానాలే. దీని పర్యవసానాలు ఆయనతోనే ఆగిపోలేదు, ఆయన కుటుంబాన్ని కూడా తాకాయి. ఒక పాఠశాల తన


