నెత్తుటి కన్నీరుతో
ఇంద్రావతి
ఎరుపెక్కింది
చావులను
అంకెలతో లెక్క
కడుతున్నాడు
దేహాలను
కుప్పలుగా పోసి
అంతిమ యుద్దమని
హెచ్చరిస్తున్నాడు
ముఖాలను
గుర్తుపట్టక ముందే
తలలకు కట్టిన
వెలలు ప్రకటిస్తాడు
పాలబుగ్గల
పసివాళ్ళను
మెషీన్ గన్లతో
చంపుతున్నాడు
నిరాయుధుల
చెంత తుపాకులు
పరిచి ఎదురుకాల్పుల
కట్టు కథలు చెప్తాడు
ద్రోన్లతో
విష వాయువులు
చిమ్మి అడవి బిడ్డల
ప్రాణాలు హరిస్తాడు
ఆకుపచ్చని
అరణ్యమంతా
సైనిక క్యాంపులు
నింపుతున్నాడు
నేలకింది బంగారం
వాడికి అమ్మకపు
సరుకుగా కావాలి
వాడిది కార్పొరేట్ యుద్ధం
మనది జనతన పోరాటం.

Photo lo police lu champuthunte amarula rakthamtho errajenda erpaduthundi annatluga undali kaani vari rakthamtho police le alaa giyatam anedi baledu ani naku anipisthundhi parisheelinchagalaru