వెన్నెల కురిసిన రాత్రిలో
ఒక పువ్వు వికసించింది .
ఆ పువ్వు వికసించడానికి కారణం చీకటి
అడవి తల్లి రక్షణ కోసం.
ఆయుధంలా జన్మించాడు
ప్రజల స్వప్నాల్లో
మొక్కలా మొలకెత్తాడు
ప్రజల ఆశనే, తన లక్ష్యంగా ములుచుకున్న త్యాగమూర్తి అతడు
అన్యాయాన్ని ఎదిరించి
గిరిజన ధీరుడయ్యాడు
రాత్రీ, పగలు అడవి తల్లిని
తన కన్నబిడ్డలా కాపాడాడు
అడవికి, జనాలకు అండగా
నిల్చిన యోధుడతడు
ఆ కుమురం భీం నుంచి
ఈ హిడ్మా దాకా అడవి
పోరాటం కొనసాగుంది.




