‘ఇదే నేను ఇదే నా జీవితమనుకో…’
ఇదే నేను ఇదే నా జీవితమనుకో...’ అంటూ వొకచోట..ఇంకిపోని ఊట బావిలాంటిదే ఈ దేహం/ఇదికూడా వో సామూహిక కన్నీటి సమీకరణ కేంద్రమే..అంటూ మరొకచోట కవిత్వాన్ని జీవితానికి మిళితం చేసి రాస్తున్న కవి వైష్ణవిశ్రీ. తెలుగు కవిత్వంలో సీరియస్గా కవిత్వం రాస్తున్న కవుల జాబితాలో ఉన్నారు. అనతికాలంలోనే తనకంటూ సాహిత్యలోకంలో వొకపుటను ఏర్పరచుకున్నారు. కవిత్వాన్ని ప్రేమగా ప్రేమిస్తుంది. ఆమె కవిత్వంలో గాఢత, లౌల్యం కలగలసి కనబడతాయి. సమాజాన్ని చూసేకోణం వొక్కొక్కరిది వొక్కో విధంగా వుంటుంది. సమాజం పట్ల స్పష్టమైన దృక్ఫథం కలిగి వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న ప్రతీదాన్ని వస్తువుగా తీసుకుని ప్రగతిశీలతను చాటుతుంది. కొన్ని చోట్ల కవిత్వాన్ని మంటల్లా మండిస్తే,