సమకాలీనం

ఆ విద్యార్థులు చేసిన నేర‌మేమిటి?

When questions become crimes and students become ‘Maoists’; I can’t breathe, Indian edition A young tribal student from Kerala found himself pinned to the ground, a constable straddling his chest and forcing his head into the pavement at an awkward angle while two others yanked at his arms and legs. నవంబర్ 23, ఆదివారం నాడు ఢిల్లీ, ఇండియా గేట్ దగ్గరకు వచ్చిన అనేక మంది నిరసనకారుల మధ్య కేరళకు చెందిన ఒక యువ ఆదివాసీ విద్యార్థి కూడా
సమకాలీనం

 ‘నూతన భారతం’లో ఆదివాసుల సంక్షోభం

నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా, మోదీ ప్రభుత్వం మళ్లీ ఘనంగా “జనజాతి గౌరవ దివస్”ను జరిపి, దేశ జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న ఆదివాసుల శ్రేయస్సు కోరేవారిగా తనను తాను చూపించుకుంటోంది. మరోవైపు, ఇటీవల, ప్రభుత్వం లదాఖ్‌లోని ఆదివాసుల రాజ్యాంగపరమైన డిమాండ్ కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని దారుణంగా అణచివేసింది. మణిపూర్‌లో ఆదివాసీ-స్థానిక సముదాయాల పైన రెండేళ్ల హింస తర్వాత కూడా పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. మావోయిజం నిర్మూలన పేరుతో బస్తర్‌లో ఆదివాసులపై పోలీసుల అణచివేత జరుగుతోంది. జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాల ఆదివాసులు తమ స్వతంత్ర మతపరమైన కోడ్ (నియమ నిబంధనల
సమకాలీనం

జైలు హక్కుల కోసం-మావోయిస్టు  ఖైదీ సంజయ్ దీపక్ నిరాహార దీక్ష‌

జైలు అధికారులు చట్టాన్ని పాటించే ఉంటే, సంజయ్ న్యాయం కోసం నిరాహారదీక్ష చేయాల్సిన అవసరం ఉండేదే కాదు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు గా అరోపించబడిన  రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావుతో ఒక సీనియర్ జైలు అధికారి ఇలా అంటాడు. " రాజ్యాంగాన్ని పాటించని వాళ్ళ పట్ల  మేము రూల్స్ పాటించాలా? నేను పాటించను.” భారతదేశ జైళ్లలో చట్టబద్ధత ఎంత పతనమైందనే విషయాన్ని ఈ అధికారి మాటలు చెప్పకనే చెప్తున్నాయి. 2025 అక్టోబర్ 28న, 60 ఏళ్ల సంజయ్ దీపక్ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన నిరసన ఏవో ప్రత్యేక హక్కుల కోసమో, సౌకర్యాల కోసమో కాదు.
సమకాలీనం

అదానికి ప్రతిఘటన అదాని బొగ్గు గనుల ప్రతిపాదన బహిరంగ విచారణలో ప్రజా నిరసన

పరిపాలనాధికారులు, కలెక్టరు, ఎస్‌డీఎంలు మాట్లాడాలనుకుంటే గ్రామాలకు రావాలి. గ్రామంలోని ప్రజల మధ్య మాట్లాడాలి. సార్, మాకు ఇంతే తెలుసు, మా భూమిని అదానీకి గానీ, ఇంకెవరికీ గానీ ఇవ్వాలని మేము అనుకోవడం లేదు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలి, రాజ్యాంగబద్ధ పాలన ఉండాలి తప్ప, ఏ ఒక్క పారిశ్రామికవేత్త కనుసన్నలలో జరిగేది  కాదు. భూమికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవలం ట్రస్టీలే (ధర్మకర్తలే) తప్ప యజమానులు కారని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూమిపై ఎవరికి హక్కు పత్రం (అధికార పత్రం) ఉందో వారే యజమాని. చిన్న రైలు మార్గం నిర్మించి, దాని ద్వారా రవాణా
సమకాలీనం

కొండల కోసం పోరాడిన మహిళా కార్యకర్తకు బెయిలు నిరాకరణ

ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాలలో ఉన్న, తరచుగా తిజిమాలిగా పిలిచే సిజిమాలి అనే ప్రశాంతమైన గ్రామంలో, ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ప్రతిఘటనా ఉద్యమం జరుగుతోంది. సిజిమాలి అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక కొండ శ్రేణి. బాక్సైట్ నిల్వలు, స్థానిక సముదాయాల పవిత్రస్థల ప్రాముఖ్యత, జీవవైవిధ్యాల కోసం ప్రసిద్ధి చెందింది. 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వ ఉన్నదని అంచనా వేసిన 1,549.022 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సిజిమాలి బాక్సైట్ బ్లాక్‌కు 2023లో మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (అభిప్రాయ పత్రం) ను తీసుకున్నది. అయితే, సెప్టెంబర్ నెల ప్రారంభంలో,
సమకాలీనం

సొంత భూమిపై హక్కులు కోరుతున్న జేను కురుబలు

పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో వచ్చే పర్యాటకులకు “మీరు మా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు” అనే తమ సందేశాన్ని అందించడానికి డజన్ల కొద్దీ జేనుకురుబ ప్రజలు నాగరహొళె టైగర్ రిజర్వ్ ప్రవేశద్వారం దగ్గర వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని నిలబడి ఉన్నారు: నాగరహొళె పులులను చూస్తారని పర్యాటకులకు హామీ ఇచ్చే సఫారీ పర్యటనలను ఆపడం వారి లక్ష్యం;  అటవీ సంరక్షణ పేరుతో తమను తరిమికొట్టిన పూర్వీకుల స్థలాన్ని వ్యాపారానికి ఉపయోగించారని జేనుకురుబలు అంటున్నారు. కర్ణాటక అటవీశాఖ, కర్ణాటక
సమకాలీనం

ఇది  నైపుణ్య శిక్షణా? నిర్బంధమా? లొంగిపోయిన మావోయిస్టుల పేరుతో హింస

ఫోటోలో హోంమంత్రి అమిత్ షా మెరిసిపోతుంటే, ఆయనకు కొన్ని వరుసల వెనుక విషాద వదనంతో ప్రసన్న నిలబడి ఉన్నాడు. జూన్ 23న షా తన X హ్యాండిల్‌లో ఈ గ్రూప్ ఫోటోను పోస్ట్ చేసాడు. “నక్సలైట్లు ఎవరి చేతుల్లో తుపాకులు పెట్టారో, ఆ పిల్లలు తమ  భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు.” అని కింద రాసి ఉన్నది. కానీ ప్రసన్న చిన్నపిల్లవాడు కాదు. అతను యాభై ఏళ్ల వయసున్న ఆదివాసి. బీజాపూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందినవాడు - అతని భద్రత కోసం అసలు పేరును, ఊరును, గుర్తింపును చెప్పడం లేదు- జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఒక
సమకాలీనం

“తోలు కొరడాతో కొట్టారు” విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల చిత్రహింస

ఏ చట్టపరమైన విధానాన్ని అనుసరించకుండా, పౌర దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు తమను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అరెస్టు చేసిన విద్యార్థులు, కార్యకర్తలు ‘ది వైర్‌’కు చెప్పారు. తమ సహచరులు ఆరుగురిని, నజారియా పత్రికలో పనిచేస్తున్న ఒకరిని అవసరమైన ప్రక్రియను అమలుచేయకుండా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిర్బంధించి దౌర్జన్యం చేసిందని ఢిల్లీకి చెందిన భగత్ సింగ్ ఛాత్రా ఏక్తా మంచ్ (బిఎస్‌సిఇఎమ్)  విద్యార్థి సంఘం, ఫోరమ్ అగైన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్ఎసిఎఎం-కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక) సభ్యులు ఆరోపించారు. ఒక ఐఎఎస్ ఆఫీసర్ కూతురు ఎక్కడ ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి “ఇంటరాగేషన్” చేసే పేరుతో జులై
సమకాలీనం

ఈ మరణాలు ప్రజాస్వామ్య సంక్షోభానికి సూచికలు

కొద్దికాలంపాటు నేను మౌన జీవితంలోకి వెళ్లిపోయాను. కానీ రాజ్య ప్రాయోజిత హింస పెరుగుదల, భారతదేశం అంతటా పునరావృతమయ్యే సంఘర్షణ మరింత లోతైన ప్రతిస్పందనకు బలవంతం చేసింది. మధ్య భారతదేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన హత్యలు విడి ఘటనలు కావు. ప్రజాస్వామ్య ఆరోగ్యం, అట్టడుగు వర్గాలతో వ్యవహారానికి సంబంధించిన విస్తృతమైన, కొనసాగుతున్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవ రావు @ బసవరాజ్ సహా మావోయిస్టులుగా గుర్తించిన పలువురు వ్యక్తుల మరణానికి దారితీసిన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భద్రతా కార్యకలాపాలు మరోసారి ఆదివాసుల ప్రాంతాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణపట్ల దృష్టిని ఆకర్షించాయి. విభేదాలు, తిరుగుబాటులను
సమకాలీనం

శాంతి చర్చలు-రాజ్యాంగబద్ధత: తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత

(విర‌సం ఆవిర్భావ దినం సంద‌ర్భంగా జూలై 6న హైద‌రాబాదులో నిర్వ‌హించిన స‌ద‌స్సులో *తెలంగాణ‌లో కాల్పుల విర‌మ‌ణ ఆవ‌శ్య‌క‌త‌* అనే అంశంపై జ‌రిగిన సెష‌న్ కోసం రాసిన పేప‌ర్‌) మావోయిస్టు పార్టీ మార్చి 28న కాల్పుల విరమణ ప్రతిపాదనతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ సూచన చేసింది. ప్రజా ప్రయోజనం కోసం తాను కాల్పుల విరమణకు సిద్ధమనితెలంగాణ ప్రభుత్వం ముందు కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మారణకాండను ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో సహా