రాజ్యం ప్రాధాన్యత ఆదానీ లాభాలు కారాదు
బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా, పిర్‌పైంటిలో 1,050 ఎకరాల భూమిని అదానీ పవర్‌కు సంవత్సరానికి ఎకరాకు కేవలం రూ 1 చొప్పున, 33 సంవత్సరాల కాలానికి లీజుకు ఇవ్వాలనే నిర్ణయం బీహార్‌లో ప్రధాన రాజకీయ వివాదానికి దారితీసింది. కార్పొరేట్ లాభాల కోసం రైతుల హక్కులను, ప్రజా ప్రయోజనాలను, పర్యావరణ శ్రేయస్సును బలిచేసే ఈ అన్యాయమైన, అపారదర్శకమైన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బహిరంగ మిత్ర పెట్టుబడిదారీ విధానానికి (క్రోనీ క్యాపిటలిజం)పరాకాష్ట; ఇది పాలనపట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని మరింతగా పెంచుతోంది. పిర్‌పైంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని, సేకరించిన భూమిని ప్రభావిత రైతులకు తిరిగి కేటాయించాలని, పునరావాసాన్ని కల్పించాలని,