తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
యుద్ధం మానవాళిని భయపెడుతున్నది. స్వేచ్ఛా జీవులైన మానవులను ఆందోళనకు గురి చేస్తున్నది. పాలస్తీనాలో, ఉక్రెయిన్లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. లక్షలాది ప్రాణాలను బలిగొంటున్న యుద్ధాలు మానవతను ధ్వంసం చేస్తున్నాయి. అట్టడుగు సమూహాల ఉనికినే రద్దు చేస్తున్నాయి. మానవ ప్రాణానికన్నా ఆధిపత్యం, ఆయుధ వ్యాపారం, కార్పొరేట్ లాభాలే పాలకులకు ముఖ్యమని ఈ హింసాకాండ నిరూపిస్తున్నది. మరీ ముఖ్యంగా ఇజ్రాయిల్ దాడుల్లో వేలాదిగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్నారు. భారతదేశంలో సొంత ప్రజలపైనే పాలకులు యుద్ధం ప్రకటించి నెత్తుటేరులు పారిస్తున్నారు. 2026 మార్చ్ నాటికి నక్సలిజాన్ని