సాయుధ ప్రతిఘాతుకం.. ఉల్కా పతనం
14 అక్టోబర్ కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ రెండేళ్ల క్రితం దండకారణ్యం - బస్తర్‌లో మరణించిన రోజు - అమరత్వం పొందిన రోజు. జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం.. మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం.. అని 11 అక్టోబర్ 2004లో గుత్తికొండ బిలం అమరుడు చారుమజుందార్ స్మారక స్థూపం దగ్గర వేలాది మంది ప్రజల ముందు దేశంలోని కోట్లాది పీడిత ప్రజలకిచ్చిన మాట ఆయన నిలుపుకున్నాడు. అప్పటికొక 25 ఏళ్లుగా సాయుధ విప్లవాచరణలో ఉన్నాడు. నల్లమల విప్లవోద్యమ నిర్మాణానికి నాయకత్వం వహించాడు. సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే రెండు విప్లవ పార్టీల