సంక్షుభిత ఆర్థిక వ్యవస్థ – సమస్యల వలయంలో ప్రజలు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా మారాయి. శ్రమదోపిడీ, వనరుల దోపిడీ, లాభాపేక్ష అనేవి అసమానతల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభం అనేది ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పేదరికం, అసమానతలు, తయారీ రంగంలో క్షీణత వంటి అంశాలతో ముడిపడి ఉంది. దాని ప్రభావం అన్ని వర్గాలపై పడుతున్నది. ఎందుకంటే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను విడివిడిగా చూడలేని పరిస్థితి. రైతుల బాధలు, కార్మికుల అభద్రత, నిరుద్యోగ సమస్య, పౌష్టికాహార కొరత,










