ఏదీ విమర్శ?
తెలుగు సాహిత్యంలో విమర్శ తిరోగమనదిశగా ప్రయాణం చేస్తుందనే చెప్పవచ్చు. విమర్శ పేరుతో రాస్తున్నవన్నీ విమర్శకుండే మౌలికసూత్రాలకు అనుగుణంగా రాయడం లేదనే అపవాదు ఇటీవల బలంగా వినిపిస్తున్నది. అసలు విమర్శకుని కర్తవ్యం ఏమిటి? ఒక పుస్తకాన్ని ఎలా పరీక్ష చేయాలి? కవిత్వమైతే కావ్యపరీక్ష ఎలా చేయాలి? కథ అయితే వర్తమాన సమాజంతో పోల్చి ఎలా చెప్పాలి? నవల ప్రయాణం ఎలా సాగింది? ఇలా సాహిత్య ప్రక్రియలన్నింటినీ ఎలా మూల్యాంకనం చేయాలన్నదే విమర్శలో కీలకం. ఎవరెన్ని చెప్పినా విమర్శకు మార్క్సిజమే పునాది రాయి అనే విషయాన్ని ఎప్పుడైతే విమర్శకులు విస్మరిస్తారో విమర్శప్రయాణం తిరోగమనమే. ఈ ముగ్గుర్ని చదవకుండా విమర్శ చేస్తున్నారు! విమర్శకులకు

