మీరీ పుస్తకం చదివారా ? కాలమ్స్

‘ఇదే నేను ఇదే నా జీవితమనుకో…’

ఇదే నేను ఇదే నా జీవితమనుకో...’ అంటూ వొకచోట..ఇంకిపోని ఊట బావిలాంటిదే ఈ దేహం/ఇదికూడా వో సామూహిక కన్నీటి సమీకరణ కేంద్రమే..అంటూ మరొకచోట కవిత్వాన్ని జీవితానికి మిళితం చేసి రాస్తున్న కవి వైష్ణవిశ్రీ. తెలుగు కవిత్వంలో సీరియస్‌గా కవిత్వం రాస్తున్న కవుల జాబితాలో ఉన్నారు. అనతికాలంలోనే తనకంటూ సాహిత్యలోకంలో వొకపుటను ఏర్పరచుకున్నారు. కవిత్వాన్ని ప్రేమగా ప్రేమిస్తుంది. ఆమె కవిత్వంలో గాఢత, లౌల్యం కలగలసి కనబడతాయి. సమాజాన్ని చూసేకోణం వొక్కొక్కరిది వొక్కో విధంగా వుంటుంది. సమాజం పట్ల స్పష్టమైన దృక్ఫథం కలిగి వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న ప్రతీదాన్ని వస్తువుగా తీసుకుని ప్రగతిశీలతను చాటుతుంది. కొన్ని చోట్ల కవిత్వాన్ని మంటల్లా మండిస్తే, 
మీరీ పుస్తకం చదివారా ?

ఉచ్చల జలధి వర్తమానం 

ఈ దేశం గమనం ఎటు ? ఈ దేశం భవిష్యత్తు ఎటు? ఎన్నాళ్ళీ అరాచకాలు? ఇంకెన్నాళ్ళీ దుర్మార్గాలు. అభం  శుభం తెలియని బాలికపై ఒకడు అత్యాచారం చేస్తాడు. ఇంకొక గుంపు వచ్చి కుటుంబాలకు కుటుంబాలను దౌర్జన్యం చేసి, ఆత్యాచారం చేస్తారు. కాదంటే హత్య చేస్తారు. 2012లో జలంధర్‌లో వొక దళిత విద్యార్థితో ఉచ్చ తాగిస్తారు. నొయిడాలో పోలీసులే దళితవర్గానికి చెందిన విద్యార్థితో ఉచ్చతాగిస్తారు. తమిళనాడులోని తిరుచ్చిలో లా చదువుతున్న దళిత విద్యార్థితో తోటి విద్యార్థులే ఉచ్చ తాగించారు. రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ నడిబొడ్డున జనవరి 26న బహిరంగ ప్రదేశంలో రీల్‌ వేయడానికి ప్రయత్నించిన మైనర్‌ దళిత బాలుడిని వేధించి
మీరీ పుస్తకం చదివారా ?

1917లోనే అచ్చయిన చతురిక..!

ఈ నవల తొలి పుటలో పరిశోధనల చరిత్రకెక్కని నవల అంటూ ఈ నవలను సేకరించి ముద్రించిన తెలకపల్లి రవి చెప్పుకున్నారు. నిజమే చరిత్రకెక్కని, చరిత్రలో చోటివ్వని అనేక విషయాలు కర్నూలు సాహిత్య చరిత్రలో ఉన్నాయి. కర్నూలు జిల్లా సాహిత్య చరిత్రను పరిశీలించినట్లైతే ప్రపంచంలోనే తొలి తెలుగుపదం ‘అన్‌ధిర లోహము’ అనగా ఆంధ్రలోకము అనే పదం కర్నూలు జిల్లా కన్నమడకలలో లభించినది.ఇది అత్యంత ప్రాచీన శాసనంగా గుర్తించారు. తొలి తెలుగుపదం ‘నాగబు’ అని నిర్ధారించినప్పటికీ అంతకుముందే ‘ఆంధ్రలోకము’ అనే పదమున్నప్పటికీ సాహిత్యకారులు, చరిత్రకారులు సమాజక్షేత్రంలోకి తీసుకెళ్ళలేకపోయారు. ఆ పదం కర్నూలుజిల్లాలో లభించడం అరుదున విషయం.  ప్రపంచానికి బౌద్ధ సిద్ధాంతాలను ప్రవచించిన
మీరీ పుస్తకం చదివారా ?

‘స్టిల్‌ షీ ఈజ్‌ అలైవ్‌’

సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్‌ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అది ఏ క్షణమైన కావచ్చు..ఏ నిమిషమైన ఆఖరిదవ్వొచ్చు..ఎవరిమీదైనా బాంబు పడొచ్చు..ఎవరి  మీదైనా డ్రోన్సు మిస్సైళ్ళు..మారణాయుధాలు పడొచ్చు..నిరంతరం మండుతున్న దేశమది.. అసలు యుద్దం ఎందుకు..?కన్నీళ్ళుగా మొదలైన యుద్దం నెత్తుటినదిగా మారి,  నెత్తుటినది కాస్త  రుధిరజీవనదిగా మారుస్తున్నదెవరు..?సామ్రాజ్యవాదం కాదా? ఈ నెత్తుటి దాహం తీరేదెప్పుడు.. చౌశా తన కవిత్వ ప్రయాణంలో పదిపుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచాన్ని కవితా వేదికగాచేసుకుని వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను, సంఘర్షణలను
మీరీ పుస్తకం చదివారా ?

దేహం కూడా పొయ్యిలాంటిదే..

దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు ద్వీపంలో వొక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. ఈప్రపంచంలో ఎగరేసిన కవిత్వపు అరుణపతాకం. మాటల్ని మండిస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తాడు. ఏతరమైనా అతడికవిత్వానికి, అతడి ఆత్మీయతకు బానిసవ్వాల్సిందే. కవిత్వపు సీసానిండా ప్రేమల్ని, ఆవేధనల్ని, ప్రాపంచిక పరిణామాల్ని నింపి వర్తమాన ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తున్నవాడు. కళ్ళనిండా కవిత్వపు కాంతుల్ని, గుండెనిండా ఈ కాలపుకవుల ప్రేమను నింపుకున్న  అసాదారణ కవితా యాత్రికుడు. వొకతరానికి శివుడు, మరొక తరానికి ప్రేమైక మానవుడు. అంతటి మహోన్నత కవిత్వపు  శిఖరం గూర్చి
మీరీ పుస్తకం చదివారా ?

బాధితులంతా ఐక్యమవుదాం

ముమ్మాటికీ నిజమే. ప్రపంచమంతా వేధనతో నెత్తుటిధారల్లో తడిసిపోయింది. పీడితులకు అండగా నిలిచేరాజ్యం  ఈ భూగ్రహంమీద మొలవలేదనిపిస్తోంది. నూతనప్రపంచావిష్కరణకు ఇంకెన్నాళ్లో..సామ్రాజ్యవాదకాంక్షలో దేశాలకు దేశాలు  నాశనమౌవుతున్నాయి. దుర్నీతి దురంహంకార పాలకులు రాజ్యాలనేలేందుకొస్తున్నారు. పసిపిల్లలు, వృద్దులు, ఎవ్వరూ వీళ్ళకడ్డులేదు. కాజీనజ్రుల్‌ ఇస్లాం కలలు కన్న రాజ్యం ఇంకా ఉద్భవించలేదు. ఆయన కలలు కన్న పాలకులింతవరకూ రాలేదనే చెప్పవచ్చు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఎర్రపూలు పూస్తున్నాయి..ఆ ఆశతోనే సామాన్యుడు, పీడితుడు, బాధితుడు బతుకుతున్నాడు. ఐనా కాజీనజ్రుల్‌ ఇస్లాం యుద్దం ద్వారా మా హక్కులన్నీ సాధించుకుంటామన్నారు. ఆయన రాసిన గొప్పకవిత్వం మనకిటీవల అందుబాటులోకి వచ్చింది. ముస్లింలు దానికంటి ముత్యాలు/హిందువులు దాని జీవితం/ఆకాశమాత ఒడిలో సూర్య చంద్రుల వలె/వాళ్ళ
మీరీ పుస్తకం చదివారా ?

“గాయాలు ఈనాటివి కావు…”

జీవితాన్ని విశ్లేషించడం ఒక్క సాహిత్యానికి మాత్రమే సాధ్యమౌతుంది. మనిషిలోని మనిషితనం, మనసుతనం చెప్పడమే కాదు, ఈ ప్రపంచాన్ని చిటికెన వేలు పట్టి నడిపించేది కూడా కవిత్వమే. కవికి కవిత్వ వస్తువుల్ని వర్తమాన ప్రపంచమే అందిస్తుంది. ఈ ప్రపంచం అందించే వస్తువును గూర్చి  డా.కిన్నెర శ్రీదేవి ‘‘కవిత్వం వాస్తవ ప్రపంచంలోని నిర్ధిష్ట విషయాన్ని రచయిత సౌందర్యాత్మకంగా వ్యాఖ్యానించి మదింపు చేయడం వలన అది సాహిత్య వస్తువౌతుంది’’ అంటారు. అటువంటి నిర్ధిష్టమైన విషయంతో,  వస్తువును సౌందర్యాత్మకంగా.. మనసును లయాత్మకంగా విన్యాసం చేయించే కవిత్వం ఇటీవల వచ్చిన "వెన్నెల కురవని రాత్రి". ఈ కవిత్వాన్ని అందించిన కవి కర్నూలు జిల్లాకు చెందిన స్వయంప్రభ.
మీరీ పుస్తకం చదివారా ?

ఆమె వొక ఆయుధం.. తన కవిత్వమొక యుద్దమైదానం..

మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర సముదాయం                                                                                                                                                 -అద్దేపల్లి రామ్మోహన్‌ రావు. కవిత్వమే ఆయుధంగా సమాజాన్ని నడిపించాలని అహర్నిశలు కలలు కన్న వాళ్ళలో చాలా మంది ఉంటారు. కొంతమంది బయట ప్రపంచానికి తెలిసి ఉండటమో..తెలియకపోవడమో యాదృచ్చికం. కాని వాళ్లు సృజియించిన అక్షరాలు మాత్రం ఎన్నితరాలు మారినా అవి శాశ్వతంగా ఈ యుద్దమైదానంపై పోరాడుతూనే  ఉంటాయి. అటువంటి పోరాట పటిమ ఉన్న నిండా సామాజిక చైతన్యం కలిగిన కవయిత్రి కొత్త
మీరీ పుస్తకం చదివారా ?

ఫాసిస్టు రుతువులో కవి హత్య

*అత్యంత దుర్భరమైన జైలు జీవితానుభవాల తాకిడిని ఒడిసిపట్టుకొని, తన జీవన దృక్పథపు తెరచాపతో దృఢంగా నిలబడేందుకు చేస్తున్న సాహస ప్రక్రియే ఈ కవిత్వం. వాస్తవికమైన ఉద్వేగాల, విశ్వాసాల, ఆగ్రహావేశాల, కన్నీటి దుఃఖాల కాల్పనిక ప్రపంచమంతా చుట్టి వచ్చి తిరిగి జైలు గది నేల మీది నుంచి కవిత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టే ప్రక్రియ ఇది. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చు. కవిత్వమంటే సరిగ్గా ఇదే. అలవిగాని ఒంటరితనాన్ని అనంత మానవ సంబంధాల్లోకి, అతి సున్నితమైన, ఆర్ద్రమైన అనుభూతుల్లోకి, మానవులకు మాత్రమే సాధ్యమయ్యే అనుభవాల్లోకి, అంతకుమించి భవిష్యదాశలోకి మళ్లించడంకంటే కవిత్వానికి అర్థం
మీరీ పుస్తకం చదివారా ?

కాలంఒడిలో కవిత్వ ఉద్యమం

ఉద్యమకారులు గొప్పగా మాట్లాడతారు, కారణం సామాన్య ప్రజాజీవితాలతో మమేకమై తమ జీవనసరళిని కొనసాగిస్తుంటారు. పేదలకోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వొక యుద్దమే చేస్తుంటారు. ఉద్యమకారులకు గొప్పజీవితాలేమీ ఉండవు. ఎక్కడైనా ఉంటారు. ఏదైనా తింటారు. ఉన్నా లేకున్నా ప్రజలకోసమే పరితపిస్తారు. ఈ క్రమంలో ప్రజాపోరాటాలు చేసే ఓ కమూనిస్టుపార్టీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడం వొక కోణమైతే, మరో కోణంలో మనసుచేసిన సంఘర్షణను, మనసుకు కల్గిన బాధను మదిలో పురుడుబోసుకున్న చైతన్యాక్షరాలను కవిత్వంగా రాయడం అరుదుగా కనబడుతుంది. ఈ కవి చేస్తున్నదీ అదే. ప్రసిద్ద రష్యన్‌ కవి మాయాకోవ్‌స్కీ చెప్పిన