మీరీ పుస్తకం చదివారా ?

‘స్టిల్‌ షీ ఈజ్‌ అలైవ్‌’

సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్‌ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అది ఏ క్షణమైన కావచ్చు..ఏ నిమిషమైన ఆఖరిదవ్వొచ్చు..ఎవరిమీదైనా బాంబు పడొచ్చు..ఎవరి  మీదైనా డ్రోన్సు మిస్సైళ్ళు..మారణాయుధాలు పడొచ్చు..నిరంతరం మండుతున్న దేశమది.. అసలు యుద్దం ఎందుకు..?కన్నీళ్ళుగా మొదలైన యుద్దం నెత్తుటినదిగా మారి,  నెత్తుటినది కాస్త  రుధిరజీవనదిగా మారుస్తున్నదెవరు..?సామ్రాజ్యవాదం కాదా? ఈ నెత్తుటి దాహం తీరేదెప్పుడు.. చౌశా తన కవిత్వ ప్రయాణంలో పదిపుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచాన్ని కవితా వేదికగాచేసుకుని వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను, సంఘర్షణలను
మీరీ పుస్తకం చదివారా ?

నెత్తుటితో తడుస్తున్న నేల గురించి

‘మనిషే మనిషిని చంపుకు తినే ఈ లోకం ఎంతకాలం మనగలదు’ ‘మూర్ఖుడా యుద్దాతో దేశాల్ని కొల్లగొట్టగలవేమో సరిహద్దుల్ని జరపగలవేమో మహా అయితే ఇంకో విస్తీర్ణాన్ని నీ కాలి కింద తొక్కి పట్టగలవ్‌ జనం హృదయాలనైతే గెలవలేవు’ ‘ప్రేమను పంచడం కంటే మరో మతం లేదు’ ‘చివరగా యుద్దం సమస్త జీవరాశిని చంపుతుంది’ ...ఇటువంటి కవితావాక్యాలతో పాలస్తీనా`ఇజ్రాయిల్‌  యుద్దానికి వ్యతిరేకంగా..సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ వచ్చిన కవిత్వమే ఈ గాజాలేని జాగా..ఇప్పుడు దేశాలకు దేశాలు శ్మశానాలౌతున్నాయి. నిత్యం నెత్తుటితో తడుస్తున్నాయి. గాయపడ్డ నేల కాదది..చంపబడ్డ నేల..చెరచబడ్డ నేల..పసికందులని కనికరం లేకుండా బుల్లెట్ల వర్షం కురుస్తున్న నేల..ఇప్పటికీ ఎటుచూసినా దేహాన్ని తెంచుకుని విసిరేయబడ్డ అవయవాలు,
మీరీ పుస్తకం చదివారా ?

దేహం కూడా పొయ్యిలాంటిదే..

దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు ద్వీపంలో వొక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. ఈప్రపంచంలో ఎగరేసిన కవిత్వపు అరుణపతాకం. మాటల్ని మండిస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తాడు. ఏతరమైనా అతడికవిత్వానికి, అతడి ఆత్మీయతకు బానిసవ్వాల్సిందే. కవిత్వపు సీసానిండా ప్రేమల్ని, ఆవేధనల్ని, ప్రాపంచిక పరిణామాల్ని నింపి వర్తమాన ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తున్నవాడు. కళ్ళనిండా కవిత్వపు కాంతుల్ని, గుండెనిండా ఈ కాలపుకవుల ప్రేమను నింపుకున్న  అసాదారణ కవితా యాత్రికుడు. వొకతరానికి శివుడు, మరొక తరానికి ప్రేమైక మానవుడు. అంతటి మహోన్నత కవిత్వపు  శిఖరం గూర్చి
మీరీ పుస్తకం చదివారా ?

బాధితులంతా ఐక్యమవుదాం

ముమ్మాటికీ నిజమే. ప్రపంచమంతా వేధనతో నెత్తుటిధారల్లో తడిసిపోయింది. పీడితులకు అండగా నిలిచేరాజ్యం  ఈ భూగ్రహంమీద మొలవలేదనిపిస్తోంది. నూతనప్రపంచావిష్కరణకు ఇంకెన్నాళ్లో..సామ్రాజ్యవాదకాంక్షలో దేశాలకు దేశాలు  నాశనమౌవుతున్నాయి. దుర్నీతి దురంహంకార పాలకులు రాజ్యాలనేలేందుకొస్తున్నారు. పసిపిల్లలు, వృద్దులు, ఎవ్వరూ వీళ్ళకడ్డులేదు. కాజీనజ్రుల్‌ ఇస్లాం కలలు కన్న రాజ్యం ఇంకా ఉద్భవించలేదు. ఆయన కలలు కన్న పాలకులింతవరకూ రాలేదనే చెప్పవచ్చు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఎర్రపూలు పూస్తున్నాయి..ఆ ఆశతోనే సామాన్యుడు, పీడితుడు, బాధితుడు బతుకుతున్నాడు. ఐనా కాజీనజ్రుల్‌ ఇస్లాం యుద్దం ద్వారా మా హక్కులన్నీ సాధించుకుంటామన్నారు. ఆయన రాసిన గొప్పకవిత్వం మనకిటీవల అందుబాటులోకి వచ్చింది. ముస్లింలు దానికంటి ముత్యాలు/హిందువులు దాని జీవితం/ఆకాశమాత ఒడిలో సూర్య చంద్రుల వలె/వాళ్ళ
మీరీ పుస్తకం చదివారా ?

పదునెక్కిన ఆయుధం కదా జీవితం..!

స్వేచ్ఛ నాకు జీవితం మించిన కల అంటూ లోసారి సుధాకర్‌ ‘ఆయుధంలాంటి మనిషి’ కవిత్వం తెచ్చారు. జీవితం ఎలా పదునక్కుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కన్నీళ్ళు, ఇంకొన్ని దు:ఖాలు, మరికొన్ని విషాదాలు కవిత్వంలో కనబడతాయి. వర్తమాన కవిత్వలోకంలో విస్తృతంగా కవిత్వం వస్తునే వుంది. నవతరం యువ కవులు కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిగమ్యం, కవిత్వ పరిణామం ఏమిటి అని ప్రశ్నించినపుడు జవాబు మనికిప్పుడు అస్పష్ట్టంగానే వినబడుతుంది.  సామాజికవాస్తవాన్ని నొక్కి చెప్పగలిగిన కవిత్వం వర్తమాన సాహిత్యంలో చాలా అరుదుగా కనబడుతుందన్న విషయం కొద్ది మందికే తెలుసు. సామాజిక వాస్తవాన్ని కవిత్వంలో చెప్పాలనుకున్నప్పుడు కవికి సైద్దాంతికబలం ఉండాలి. అలా ఉన్నప్పుడే కవి
మీరీ పుస్తకం చదివారా ?

“గాయాలు ఈనాటివి కావు…”

జీవితాన్ని విశ్లేషించడం ఒక్క సాహిత్యానికి మాత్రమే సాధ్యమౌతుంది. మనిషిలోని మనిషితనం, మనసుతనం చెప్పడమే కాదు, ఈ ప్రపంచాన్ని చిటికెన వేలు పట్టి నడిపించేది కూడా కవిత్వమే. కవికి కవిత్వ వస్తువుల్ని వర్తమాన ప్రపంచమే అందిస్తుంది. ఈ ప్రపంచం అందించే వస్తువును గూర్చి  డా.కిన్నెర శ్రీదేవి ‘‘కవిత్వం వాస్తవ ప్రపంచంలోని నిర్ధిష్ట విషయాన్ని రచయిత సౌందర్యాత్మకంగా వ్యాఖ్యానించి మదింపు చేయడం వలన అది సాహిత్య వస్తువౌతుంది’’ అంటారు. అటువంటి నిర్ధిష్టమైన విషయంతో,  వస్తువును సౌందర్యాత్మకంగా.. మనసును లయాత్మకంగా విన్యాసం చేయించే కవిత్వం ఇటీవల వచ్చిన "వెన్నెల కురవని రాత్రి". ఈ కవిత్వాన్ని అందించిన కవి కర్నూలు జిల్లాకు చెందిన స్వయంప్రభ.
మీరీ పుస్తకం చదివారా ?

ఆమె వొక ఆయుధం.. తన కవిత్వమొక యుద్దమైదానం..

మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర సముదాయం                                                                                                                                                 -అద్దేపల్లి రామ్మోహన్‌ రావు. కవిత్వమే ఆయుధంగా సమాజాన్ని నడిపించాలని అహర్నిశలు కలలు కన్న వాళ్ళలో చాలా మంది ఉంటారు. కొంతమంది బయట ప్రపంచానికి తెలిసి ఉండటమో..తెలియకపోవడమో యాదృచ్చికం. కాని వాళ్లు సృజియించిన అక్షరాలు మాత్రం ఎన్నితరాలు మారినా అవి శాశ్వతంగా ఈ యుద్దమైదానంపై పోరాడుతూనే  ఉంటాయి. అటువంటి పోరాట పటిమ ఉన్న నిండా సామాజిక చైతన్యం కలిగిన కవయిత్రి కొత్త
మీరీ పుస్తకం చదివారా ?

ఫాసిస్టు రుతువులో కవి హత్య

*అత్యంత దుర్భరమైన జైలు జీవితానుభవాల తాకిడిని ఒడిసిపట్టుకొని, తన జీవన దృక్పథపు తెరచాపతో దృఢంగా నిలబడేందుకు చేస్తున్న సాహస ప్రక్రియే ఈ కవిత్వం. వాస్తవికమైన ఉద్వేగాల, విశ్వాసాల, ఆగ్రహావేశాల, కన్నీటి దుఃఖాల కాల్పనిక ప్రపంచమంతా చుట్టి వచ్చి తిరిగి జైలు గది నేల మీది నుంచి కవిత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టే ప్రక్రియ ఇది. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చు. కవిత్వమంటే సరిగ్గా ఇదే. అలవిగాని ఒంటరితనాన్ని అనంత మానవ సంబంధాల్లోకి, అతి సున్నితమైన, ఆర్ద్రమైన అనుభూతుల్లోకి, మానవులకు మాత్రమే సాధ్యమయ్యే అనుభవాల్లోకి, అంతకుమించి భవిష్యదాశలోకి మళ్లించడంకంటే కవిత్వానికి అర్థం
మీరీ పుస్తకం చదివారా ? కాలమ్స్

‘మన్‌ కీ బాత్‌ : వొట్టి మాయా పాచిక’

A poem is what happens when it is read- Christopher Caudwell భారతీయ సాహిత్యంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవి అఫ్సర్‌. కథ, కవిత్వం, విమర్శ ఏది రాసినా తనదైన భావజాలానికి అతీతంగా, తనదైన శైలికి భిన్నంగా రాయరు. అఫ్సర్‌ ఏది రాసినా పదికాలాలు గుర్తిండిపోయే అక్షరాలకు జన్మనిస్తాడు. ప్రగతిశీల రక్తకణాలను నరనరాల్లో నింపుకుని పిడికిలి బిగించి విప్లవోద్యమాన్ని నడిపిన కౌముది కొడుకే అఫ్సర్‌. ఈ తరానికి ఆయన కవిగానే తెలుసు. కానీ ఆయనది నాల్గున్నర దశాబ్దాల సుధీర్ఘ సాహిత్య ప్రయాణం. సమసమాజ నిర్మాణానికి రాళ్ళెత్తిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే! దేశంకాని దేశంలో
మీరీ పుస్తకం చదివారా ?

కాలంఒడిలో కవిత్వ ఉద్యమం

ఉద్యమకారులు గొప్పగా మాట్లాడతారు, కారణం సామాన్య ప్రజాజీవితాలతో మమేకమై తమ జీవనసరళిని కొనసాగిస్తుంటారు. పేదలకోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వొక యుద్దమే చేస్తుంటారు. ఉద్యమకారులకు గొప్పజీవితాలేమీ ఉండవు. ఎక్కడైనా ఉంటారు. ఏదైనా తింటారు. ఉన్నా లేకున్నా ప్రజలకోసమే పరితపిస్తారు. ఈ క్రమంలో ప్రజాపోరాటాలు చేసే ఓ కమూనిస్టుపార్టీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడం వొక కోణమైతే, మరో కోణంలో మనసుచేసిన సంఘర్షణను, మనసుకు కల్గిన బాధను మదిలో పురుడుబోసుకున్న చైతన్యాక్షరాలను కవిత్వంగా రాయడం అరుదుగా కనబడుతుంది. ఈ కవి చేస్తున్నదీ అదే. ప్రసిద్ద రష్యన్‌ కవి మాయాకోవ్‌స్కీ చెప్పిన