మోడీ కాలంలో మీడియా
(ముంబై నుండి ప్రచురితమయ్యే మిడ్ - డేలో ఎజాజ్ అష్రాఫ్ ఆరు సంవత్సరాల నుండి రాస్తున్న కాలమ్‌ను ఆపివేశారు. సోమవారం కాలమ్‌లో సమాధి వ్యాసంతో అతను తన కాలమ్ మరణాన్ని ప్రకటించాడు. సీనియర్ జర్నలిస్ట్, ‘భీమా కొరేగావ్: ఛాలెంజింగ్ కాస్ట్’ రచయిత ఎజాజ్ అష్రాఫ్ రాసిన వ్యాసం ఇది – జాన్‌చౌక్ సంపాదకమండలి) ఎందుకంటే అది ఆఖరి శ్వాస తీసుకుంటోన్న ‘మండే బ్లూస్’*కి నివాళులర్పించాలని అనిపిస్తోంది; మీరు ఈ రోజు దాని చివరి విడత చదవడం పూర్తి చేయగానే, అది ఎలాంటి హడావిడీ, విచారమూ లేకుండా కనుమరుగైపోతుంది. అయితే, నేను నా ఆలోచనలను చాలా వరకు స్వతంత్రంగా వ్యక్తం










