సమకాలీనం

భీమా కోరెగావ్ శౌర్య దివ‌స్ లో మనువాద వ్య‌తిరేక స్ఫూర్తి 

దేశంలోని మెజారిటీ ప్రజలపై మనువాద అణచివేత, దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2025, అక్టోబర్ ఆరవ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై మనువాద భావజాలం కలిగిన ఒక లాయర్ బూటుతో దాడి చేశాడు. అనంతరం ఆ వ్యక్తి మాట్లాడుతూ తన మతానికి చెందిన దేవునిపై న్యాయమూర్తి వ్యాఖ్యలను నిరసిస్తూ దాడిచేశానని తనకు పశ్చాతాపం లేదని చెప్పారు. ఆ వ్యక్తిపై  కనీసం కేసు కూడా నమోదు కాలేదు.  అదే నెల 7 వ తేదిన హర్యానాలో కుల వివక్షత భరించలేక ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొన్నారు. అతను యస్సీ కులానికి చెందినవారు కావడంతో
ఓపెన్ పేజీ

హద్దులు లేని ద్రోహ చింతన

అప్రియ వచనాలు మాట్లాడనవసరం లేకుంటే బాగుండు. వ్యక్తులనుద్దేశించవలసిన కానికాలాన్ని ఎవరం కోరుకుంటాం? సత్యమే గీటురాయి అనుకుంటాంగాని, అందరికీ సత్యమే పరమం కానవసరం లేదు. ప్రకృతిలో తిరుగులేని సత్య భావన సమాజంలో తరచూ భంగపడుతూ ఉంటుంది. ప్రయోజనాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు సత్యాన్ని బతకనీయవు. కనీసం అందరికీ ఆమోదమయ్యే సత్యంగా నిలబడనివ్వవు. అందువల్ల సమూహాలతోపాటు మనుషులనూ ఉద్దేశించే సంభాషణ సాగవలసి వస్తుంది. విప్లవంలోని అనన్య సామాన త్యాగాల గురించి మాట్లాడటానికి ముఖం మొత్తిన కొంద‌రు మేధావులు సహితం ద్రోహాన్ని ద్రోహమని చెప్పేసరికి లేచి కూచున్నారు. ఎవరి ప్రియాలు వారివని సరిపెట్టుకోవచ్చు. కానీ సత్యాన్ని దాచేద్దామనుకున్నాక మాట్లాడక తప్పదు కదా. ద్రోహం గురించి
లోచూపు

చరిత్ర పొడవునా ఫాసిజం

చారిత్రక కారణాలు ఏవైనా ఫాసిజం మన సామాజిక సాంస్కృతిక నేలలోనే మొలిచే విషపు కలుపు మొక్క. దానిని సకాలంలో గుర్తించి పెరికి వేయకపోతే పచ్చని పంట నాశనం అవుతుంది. సాధారణ కలుపు మొక్కలను ఏరివేయకపోతే పంట ఏపుగా పెరగదు గానీ, విషపు కలుపు మొక్క(ల)ను ఏరివేయకపోతే పంట నాశనం అవ్వడమే కాకుండా, నేల కూడా విషపూరితమై భవిష్యత్తులో ఏ పంటా పండని ప్రమాదం తలెత్తుతుంది. అటువంటి మనిషి మౌలిక మనుగడకే ప్రమాదకరమైన ఫాసిస్ట్ ఆక్టోపస్ తన విషపు కోరలతో మన దేశాన్ని కబళిస్తోంది. నిజమైన సంస్కరణోద్యమ పోరాటాలు, లౌకిక, ప్రజాస్వామిక, సమూల పరివర్తనా(విప్లవ) పోరాటాలు చాలా కాలంగా జరుగుతూనే
అలనాటి రచన

క్రిటికల్‌ రియలిజం

మనిషి బైటా లోపటా వాస్తవ ప్రపంచాలున్నాయి.  పదార్థంతో కూడింది బైటిది. భావాలతో కూడింది లోపటిది. వాస్తవికతావాదానికి ఈ రెండు ప్రపంచాలూ నిజమైనవే. నికరంగా మాట్లాడితే, వీటిని రెండుగా పేర్కొనడం సరికాదు. భౌతిక ప్రపంచం లేకుండా భావప్రపంచం వుండదు గనక, వీటిని ఒకే ప్రపంచంలో రెండు విభాగాలని అనవచ్చు. భౌతిక ప్రపంచమే మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా నాడీ కేంద్రమైన మెదటి కెక్కి, చైతన్యంగా రూపొందుతుంది. మెదడు చాలా జటిలమైన పదార్థం. భౌతిక పదార్థానికి అది అత్యున్నతమైన రూపం. దాని పనిపాటులనే బుద్ధిగా, అనుభూతిగా - మనస్సుగా - ఎన్నోపేర్లతో పిలవడం జరుగుతూంది. మెదడు నిర్మాణంలో ఒక పార్శ్వంలా మరొక పార్శ్వం
ఆర్ధికం

ఆర్థిక అసమానతలో అగ్రస్థానం భారత్‌దే!

ప్రపంచ అసమానతల నివేదిక 2026 మూడవదిగా వెలువడుతున్నది. 2018, 2022 తర్వాత కీలకమైన సిరీస్‌గా ఇది వస్తున్నది. ప్రపంచవ్యాపితంగా రెండువందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా ఇది కూర్పు చేయబడింది. వారు ప్రపంచ అసమానతల అధ్యయన ప్రయోగశాలతో అనుబంధంగా ఉంటున్నారు. ప్రపంచ అసమానతల చారిత్రక పెరుగుదలకు సంబంధించిన అతి పెద్ద డేటా సేకరణకు వారు దోహదపడుతున్నారు. అసమానతలకు సంబంధించి ప్రపంచవ్యాపిత చర్చలకు ఈ సమిష్టి కృషి గొప్పగా సహాయపడగలదు. విధాన నిర్ణేతలు, పౌరులు, అసమానతల తీవ్రతనూ, కారణాలనూ అర్థం చేసుకునే తీరును మార్పు చేయడానికి ఈ బృందం కృషి సహాయ పడింది. అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల కన్నా
మీరీ పుస్తకం చదివారా ?

కత్తుల వంతెనపై సమాజం

నిజమే వర్తమాన సమాజం నిలుచున్నదిక్కడే. అసమానతలు అన్యాయాలు రాజకీయ రాబందుల రాక్షస క్రీడలు నెత్తుటి మరకలు  సమాజ దేహానికి కొత్తేం కాదు. ఈ కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమగానో రాయలేదు. కవిత వాక్యాలను కన్నీటి సరస్సులో ముంచి మరీ రాశారు. ఈ ప్రపంచం పట్ల బాధ్యతగా రాశారు. కవిత్వ మనోఫలకంపై ఏర్పడే కవితా వాక్యాల ప్రతిబింబాలు పాఠకున్ని ఆలోచింపజేస్తాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన కవి చం ఆధునిక తెలుగు కవిత్వంలో అరుదైన కవి. అంతే ప్రాపంచిక దృక్పథంతో సమాజాన్ని వీక్షిస్తున్న కవి. వర్తమాన సమాజంలో సంక్లిష్టంగాను తీవ్రమైన  వైరుధ్యాలతో మన ముందు పరచుకొని వుంది. ఈ సంక్లిష్టతను అధిగమించేందుకు
సమకాలీనం

మోడీ కాలంలో మీడియా

(ముంబై నుండి ప్రచురితమయ్యే  మిడ్ - డేలో ఎజాజ్ అష్రాఫ్ ఆరు సంవత్సరాల నుండి రాస్తున్న కాలమ్‌ను ఆపివేశారు. సోమవారం కాలమ్‌లో సమాధి వ్యాసంతో అతను తన కాలమ్ మరణాన్ని ప్రకటించాడు. సీనియర్ జర్నలిస్ట్, ‘భీమా కొరేగావ్: ఛాలెంజింగ్ కాస్ట్’ రచయిత ఎజాజ్ అష్రాఫ్ రాసిన వ్యాసం ఇది – జాన్‌చౌక్ సంపాదకమండలి) ఎందుకంటే అది ఆఖరి శ్వాస తీసుకుంటోన్న ‘మండే బ్లూస్‌’*కి నివాళులర్పించాలని అనిపిస్తోంది; మీరు ఈ రోజు దాని చివరి విడత చదవడం పూర్తి చేయగానే, అది ఎలాంటి హడావిడీ, విచారమూ లేకుండా కనుమరుగైపోతుంది. అయితే, నేను నా ఆలోచనలను చాలా వరకు స్వతంత్రంగా వ్యక్తం
ఆర్ధికం

ప్రభుత్వ బ్యాంకుల మెడపై ప్రైవేట్‌ కత్తి

దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులను పెద్దపెద్ద కంపెనీలు నిలువునా ముంచేస్తున్నాయి. మొండిబకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌/ఎన్‌పిఎ).. పేర్లు ఏవైనా, లాభపడుతున్నది ఎగవేత కంపెనీలు.. నష్టపోతున్నది ప్రత్యక్షంగా బ్యాంకులు, పరోక్షంగా ప్రజలు. ఘరానా కంపెనీలు బ్యాంకులను ముంచకపోతే, ఈ బ్యాంకుల లాభాలు మరింతగా పెరిగి ఉండేవి. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు రుణాలను ఎగవేయడమే బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ప్రభుత్వం దర్జాగా మొండిబాకీలను రద్దు చేస్తోంది. ఇలాంటి రుణాలను రద్దు చేయడం కంటే, వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఎఐబిఇఎ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోగా, మరింతగా రాయితీలను
ఆర్ధికం

డాలర్ ఆధిపత్యానికి తెరపడనుందా ?

ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం' అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర
ఆర్ధికం

కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధిస్తోందని.. ఇది మాములు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని మూడీస్‌, స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిచ్‌ వంటి రేటింగ్‌ సంస్థలు, నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(ఐయంఎఫ్‌) 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందున్న 6.1 శాతం