కాలమ్స్ ఆర్ధికం

భావ స్వేచ్ఛ‌కు డిజిటల్ సంకెళ్లు

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ప్రచార ఉధృతిలో చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సామాన్యులకు, సంక్షోభంలో ఉన్న రైతులకు, అణగారిన వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగే ఒక్క చర్య చేపట్టలేదు. సమర్థ పాలన స్థానే అసమర్థత, ఏ మాత్రం పారదర్శకత, సమిష్టి నిర్ణయాలు లేని, నియంతృత్వ పోకడలున్న పాలకుడే మోడీలో కనిపిస్తాడు. కొవిడ్ మహమ్మారి విలయ తాండవం చేసిన, చేస్తున్న కాలంలోనూ మోడీ, ఆయన లెప్టినెంట్ అమిత్ షాల అనాలోచిత, ప్రజావ్యతిరేక చర్యలు దేశ అభివృద్ధిని అతలాకుతలం చేశాయి. మోడీ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.
కాలమ్స్ లోచూపు

అంటరానితనం గాయాలకు అక్షరభాష్యం ‘అకడమిక్ అన్ టచ్ బులిటీ’

ఏ కాలం నాటి సామాజిక చలనాలైనా ఆ కాలపు సమాజంలోని వర్గ పోరాటాల మీదే ఆధారపడి ఉంటాయి.ఆయా పోరాటాల ఉధృతిని బట్టే ఆ సామాజిక చలనాలు వేగవంతం అవుతాయి. పోరాట శక్తులు ఎంతగా విద్యావంతమై సైద్దాంతీకరణ చెందితే అంతగా అవి చారిత్రిక ఫలాలను అందిస్తాయి. ఉదాహరణకు, నక్సల్బరీ విస్ఫోటనం తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి చలనాలు చాలా వేగవంతమయ్యాయి. ఈనాటి అకడెమిక్ విద్యా రంగంతో పోలిస్తే ఆనాటి ప్రభుత్వరంగ విద్యలో అంతరాల వ్యవస్థ లేదు. ప్రైవేట్ పెట్టుబడి ఇంకా చొరబడలేదు. సాపేక్షికంగానైనా ఉమ్మడి పాఠశాల విధానం అమలులో ఉండేది. దాని వల్ల విద్యార్థుల్లో సామాజిక వాస్తవికత పట్ల సరైన
కాలమ్స్ అలనాటి రచన

యుద్ధ కాల‌పు మాన‌వీయ క‌థ‌నం

రష్యన్ మూలం: చింగీజ్ ఐత్ మాతోవ్,  తెలుగు అనువాదం: ఉప్పల లక్ష్మణరావు యుద్ధం....అది  సృషించే విలయం, విధ్వంసం వర్ణనాతీతం. జయాపజయాలు ఏ దేశానివైనా ఓడిపోయేది నిస్సందేహంగా పేద, మధ్యతరగతి వాళ్ళే. బిడ్డలను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు. ఎవరి పాపం? ఎవరి స్వార్ధం? నిర్మలంగా, ప్రశాంతంగా సాగిపోతున్న ఒక మామూలు సంసారంలో యుద్ధం సృష్టిచే భీభత్సమే ఈ కథ‌.  భర్తనూ, ముగ్గురు పిల్లలనూ కోల్పోయి, నిస్సహాయంగా బ్రతుకుతున్న తొల్గొనాయ్ కధే ఈ “తల్లీ-భూదేవి”  “ఒక్క గింజను నాకివ్వు. పది కంకులు నీకిస్తాను.” అని భూదేవిని కూడా ఒక పాత్రను చేసి, భూమిని సద్వినియోగం చేసుకోండి అని రచయత
కాలమ్స్ సమకాలీనం

తబ్లీగీ జమాత్ కరోనా జిహాద్ అయితే మరి కుంభమేళా?

"కరోనా ఆయా౼ మౌలానా లాయా" అనే వ్యంగ్యపూరితమైన, అపహాస్యమైన, అవమానకరమైన, నేరారోపణతో కూడిన ఈ మాటలు గత సంవత్సరం సామాజిక మాధ్యమాలల్లో ప్రదానంగా ఉత్తర భారతంలో ఎక్కువగా వినిపించినవి. కరోనా చైనా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టేసే తరుణంలో అంతటా అలుముకున్న భయం భారతదేశం లోను విస్తరించింది. మునుపెన్నడూ చూడని ఒక మహా విపత్తు  అన్ని దేశాలను వణికించింది. యూరప్ లో అతి వేగంగా విస్తరించి, అమెరికాను ముంచెత్తిన కరోనా ఇండియా ను చేరడానికి పెద్దగా ఆలస్యమేమి చేయలేదు. ప్రపంచ వైద్య రంగం ఎన్నడూ ఎరుగని, అంతుపట్టని అదృశ్య జీవి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ
కాలమ్స్ కథావరణం

“దుఃఖానికి ఆసరా మనిషే!-అంటున్న కథ

ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. మనిషి లోపలి ఒంటరితనాల గురించి, బాహ్యప్రపంచంలో మనిషి ఎదుర్కొనే  ఒంటరితనాల గురించిన కథలు మనల్ని కల్లోల పరుస్తాయి. కలవర పెడతాయి. అప్పటిదాకా రాని ఆలోచనలు ఇలాంటి కథలు చదివితే కొత్తగా పుట్టుకు వస్తాయి. ఏవో ఖాళీలు, ఏవో అంతరాలు, మరేవో అడ్డుగోడలు ఒక్కసారిగా కథలో కనిపిస్తాయి. అవన్నీ అంతకు ముందు మనం చూసినవే, అయినా చూసినా  నిజంగా చూడలేనివి. అప్పటిదాకా చూసినదాన్నే, చూసినా చూడలేని దాన్నే కొత్తగా చూపించేవే మంచి కథలు. నడవడం స్థానంలో పరిగెత్తడం మొదలయ్యాక వేగం పెరిగాక, మనుషులకు దూరంగా మనుషులు కదలటం మనుషులు దూరంగా మనుషులు వెళ్లిపోవడం చాలా
కాలమ్స్ కథ..కథయ్యిందా!

పితృస్వామ్యపు విరుగుడు ను చిత్రించిన చాయ్ గ్లాసు

చాయ్ గ్లాసు కథను రాసింది , నిత్య. ఈ కథ మొదట అరుణతారలో అచ్చయ్యాక , సామాన్యుల సాహసం కథాసంకలనంలో కూడా వచ్చింది.కథ, పదకొండేళ్ల వ్యవధితో మూడు దృశ్యాలను చిత్రిస్తుంది. 1994నుంచి 2005 మధ్య దండకారణ్యంలో ఆదివాసీ సమూహంలో నూతన మానవులు ఎలా ఉధ్భవించారో చెబుతుంది కథ. కథలోని  కథకురాలు 1994లో పారెనార్ గ్రామానికి రావడం, అక్కడ ఒక చిన్న పిల్లవాడి ప్రవర్తనలో పితృస్వామ్యాన్ని ఆమె గమనించడం. ఆలోచనలో పడటం. రెండో దృశ్యంలో 2000లో సంవత్సరంలో దండకారణ్యంలో జనతన సర్కార్లు ఏర్పడటంతో విద్యా వ్యవస్థ వేళ్లూనుకోవడం. భూంకాల్ స్కూళ్ల నిర్వహణలో కథకురాలు వుండటం కన్పిస్తుంది. మూడో దృశ్యంలో మొదటి
కాలమ్స్ లోచూపు

మానవత్వం పరిమళించాలంటే పోరాటం అనివార్యం

ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి
కాలమ్స్ ఆర్ధికం

కరోనా అయితేనేం..? కుబేరులకు కాసుల పంటే

భారత్‌లో ప్రజావ్యతిరేక కార్పొరేటు అనుకూల‌ మోడీ ప్రభుత్వ విధానాల వ‌ల్ల అత్యధిక ప్రజ‌లు కొనుగోలు, ఆదాయాల‌ను కోల్పోతోంటే అపర కుబేరులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నారు. మార్చి 2న హురున్‌ గ్లోబల్‌ 10వ వార్షిక నివేదిక రిచ్‌ లిస్టు 2021 భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 209కి చేరిందని తెలిపింది. 100 కోట్ల డార్ల సంపద కలిగి ఉన్న వారిని బిలియనీర్‌ అంటారు. ప్రస్తుత డాల‌ర్‌ మారకం రేటు ప్రకారం రూ.7400 కోట్ల పైమాటే. మొత్తం 209 మందిలో 177 మంది బిలియనీర్లు భారత్‌లోనే నివసిస్తుండగా మిగిలిన వారు విదేశాల్లో స్థిరపడ్డట్లు నివేదిక వెల్ల‌డించింది. అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల‌
కాలమ్స్ బహుజనం

జీవితం కథలో ‘అమ్మ’మనస్తత్వం – పరిశీలన

 ‘జీవితం’  కరుణ రాసిన కథల సంపుటి. ఇందులో మొత్తం 30 కథలున్నాయి. వాటిలో జీవితం ఒక కథ. ఆ కథ పేరే పుస్తకం పెరయ్యింది. 30 కథలు విభిన్నమైన సారూప్యమైన ఇతి వృత్తాల కలయికగా, పాఠకులకు పరిచయమై అనేక సన్నీవేశాలతో, సంఘటనలతో, పాఠకులు తమను తాము పాత్రలలో ప్రవేశ పెట్టుకునేంత సహజ సిద్దంగా , మమేకత్వంతో పాత్రలను, కథనాలను, నిర్మించడం రచయిత్రీలోని ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ఈ పుస్తకంలోని కథలు ఎక్కువ కాలం పాఠకుని మనసులో నిలిచిపోయేందుకు కారణం అవుతోంది. సంపుటిలోని ప్రతి కథ ఒక సందేశాత్మక ఇతివృత్తంతో ఉంటుంది. రచయిత్రి ఆ మూలాగ్రం తన కథలలోని, విభిన్న
కాలమ్స్ లోచూపు

ఆజాదీ కీ ఆవాజ్

యూరప్ లో 14వ శతాబ్దము నుండి రెండు,మూడు శతాబ్దాల పాటు రాచరిక భూస్వామ్యం పై తీవ్రంగా ఘర్షణ పడి, దాన్ని ఓడించి గెలిచిన పెట్టుబడిదారీ వ్యవస్థ(తన స్వప్రయోజనం కోసమే అయినా) ‘మనుషులందరూ సమానమే’, ‘ఏ మనిషికైనా ఒకటే విలువ’ లాంటి కొన్ని ఆధునిక విలువలను ముందుకు తెచ్చింది. పెట్టుబడి తన విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఏర్పరచుకునే క్రమంలో భారతదేశం కూడా ఒక బ్రిటిష్ వలసగా మారింది. ఆ తర్వాత వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమం ఫలితంగా అధికార మార్పిడి జరిగి,బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడి భూస్వామ్యంతో తీవ్ర ఘర్షణేమీ లేకుండానే మనదేశానికి దిగుమతి కావడం వల్ల ప్రగతిశీల ఆధునిక