ధిక్కార పతాకమై ఎగిరే నీలం రంగు నది
నల్లింకు పెన్నుతో పరిచయమైన రచయిత హథీరామ్ సభావట్, తనలోని ఎన్నో ఆవేదనలను అక్షరీకరించి, మళ్ళీ తన బలమైన గొంతును వినిపించేందుకు ధిక్కార పతాకమై ఎగిరే "నీలం రంగు నది"ని మన ముందుకు తెచ్చారు. ఇందులోని ప్రతీ కవిత దేనికదే ప్రత్యేకం. ఆదివాసీ గూడాల గుండెలలో రగులుతున్న ఆవేదనను... పాలస్తీనా, సూడాన్ వంటి ప్రపంచ దేశాలలో జరుగుతున్న మానవ హననాన్ని... ప్రకృతిని దోచుకుంటున్న రాజ్యపు అహంకారాన్ని.... మనుగడ కాన్వాస్ పై రక్తపు మరకలతో యుద్ధం చిత్రించిన దృశ్యాలను... ఎన్నింటినో రచయిత తన కవిత్వంతో మన కళ్ళ ముందుంచారు. నది అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి. ఆ ప్రకృతితో మమేకమై










